రూ. 21.23కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
పెట్టుబడి నిధి కింద మరో రూ. 35.98 కోట్లు
కడప కార్పొరేషన్ : జిల్లాలోని పట్టణ ప్రాంతాలలో ఉండే స్వయం సహాయ సంఘాలకు రూ. 21.23 కోట్లు వడ్డీలేని రుణాలు విడుదలయ్యాయి. అలాగే పెట్టుబడి నిధి (క్యాపిటల్ ఇన్‌క్లూజన్) కింద మరో రూ. 35. 98 కోట్లు విడుదలైంది. ఈ మొత్తం జూన్ 3న స్వయం సహాయ సంఘాల ఖాతాలలో జమ కానుంది. వడ్డీలేని రుణాలు అత్యధికంగా పొందిన జిల్లాలలో వైఎస్‌ఆర్ జిల్లా ద్వితీయ స్థానంలో ఉండటం విశేషం.
ఆధార్‌నెంబర్లు సరిగా ఉన్నవారికి మాత్రమే పెట్టుబడి నిధి ఇవ్వడానికి రూ. 35.98 కోట్లు విడుదల చేశారు. ఊర్లో లేకుండా ఉండటం, తాత్కాలికంగా వలస వెళ్లడం, ఆధార్ సమర్పించక పోవడం, ఆధార్‌నెంబర్ మ్యాచ్ కాకపోవడం వంటి కారణాల వల్ల 909 మందికి పెట్టుబడి నిధి మంజూరు కాలేదు. వీరంతా అర్హులై ఉండి ఆధార్‌నెంబర్ సమర్పిస్తే వారికి కూడా పెట్టుబడి నిధితోపాటు, వడ్డీలేని రుణాలు మంజూరవుతాయని అధికారులు చెబుతున్నారు.
మున్సిపాలిటీల వారీగా వడ్డీలేని రుణాలు
కడప నగరపాలక సంస్థకు రూ. 5.82 కోట్లు, బద్వేల్ మున్సిపాలిటీకి రూ. 2.25 కోట్లు, జమ్మలమడుగుకు రూ. 1.22 కోట్లు, మైదుకూరుకు రూ. 1.06 కోట్లు, ప్రొద్దుటూరుకు రూ. 4.26 కోట్లు, పులివెందులకు రూ. 3.25 కోట్లు, రాజంపేటకు రూ. 1.01 కోట్లు, రాయచోటికి రూ. 1.10 కోట్లు, యర్రగుంట్లకు రూ. 1.21 కోట్ల వడ్దీ లేని రుణాలు విడుద లయ్యాయి.
పెట్టుబడి నిధి వివరాలు ఇలా..
కడప నగరపాలక సంస్థకు రూ. 12.81 కోట్లు, బద్వేల్ మున్సిపాలిటీకి రూ. 3.26 కోట్లు, జమ్మలమడుగుకు రూ. 1.88 కోట్లు, మైదుకూరుకు రూ. 2.11 కోట్లు, ప్రొద్దుటూరుకు రూ. 6.81 కోట్లు, పులివెందులకు రూ. 3.48 కోట్లు, రాజంపేటకు రూ. 1.63 కోట్లు, రాయచోటికి రూ. 2.48 కోట్లు, యర్రగుంట్లకు రూ. 1.47 కోట్ల వడ్దీ లేని రుణాలు విడుద లయ్యాయి.
జిల్లాకు వడ్డీలేని రుణాలు విడుదల
Published Thu, May 21 2015 4:08 AM | Last Updated on Sun, Sep 3 2017 2:23 AM
Advertisement
Advertisement