నిలువు దోపిడీ | KTR to oppose downsizing of job scheme at Ministers' meet | Sakshi
Sakshi News home page

నిలువు దోపిడీ

Published Tue, Jan 6 2015 3:10 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

నిలువు దోపిడీ - Sakshi

నిలువు దోపిడీ

* బరితెగించిన మెప్మా ఉద్యోగులు
* మహిళా సంఘాల నుంచి బలవంతపు వసూళ్లు
* లేదంటే రుణ మంజూరులో అడ్డంకులు
* ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 20 లక్షలు టార్గెట్

ఆర్మూర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ మాటగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించిన విధానంతో మహిళా సంఘాలకు వడ్డీ లేని రు ణాలు అందాలి. అయితే ఆర్మూర్‌లో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ప్రభుత్వం మహిళలకు బ్యాంకు రుణా ల వడ్డీ మాఫీ చేయడం ద్వారా లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నిస్తోంటే.

రుణాల వంకతో మహిళా సంఘాల నుంచి వేల రూపాయలను వసూలు చేయడానికి పట్టణ పేదరిక ని ర్మూలన సంస్థ (మెప్మా) ఉద్యోగులు పూనుకున్నారు. కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు అధికారులందరికీ ముడుపులు చెల్లిం చాల్సి ఉంటుందంటూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే ఆ మహిళా సంఘానికి రుణం అందకుం డా చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.

దీంతో గత్యం తరం లేని పరిస్థితులలో మెప్మా ఉద్యోగులకు మహిళా సంఘాలవా రు ముడుపులు ముట్ట జెప్పుకుంటున్నారు. నిజామాబాద్, ఆర్మూర్, కామారెడ్డి, బోధన్ మున్సిపాలిటీల పరిధిలో ఈ వ్యవహారం కొనసాగుతోంది. ఆర్మూర్‌లోనే మెప్మా ఉద్యోగులు ముడుపుల రూపంలో ఈ ఏడాది రూ. 20 లక్షలు వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారంటే మహిళలు ఎంత దోపిడీకి గురవుతున్నారో అర్థమవుతోంది. ఇలాంటి ఉద్యోగు ల కారణంగా ప్రభుత్వాలు వడ్డీ లేని రుణాలు అందజేసినా రుణం మొత్తం చెల్లించే సమయానికి వందకు రెండు రూపాయల వడ్డీని చెల్లించే పరిస్థితులు ఏర్పడతాయి.
 
ఇదీ జరగాలి
మహిళలకు బ్యాంకు రుణాలు ఇప్పించడం ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేయడ మే లక్ష్యంగా గత పాలకుల హయాంలో నుంచి ఇందిరా క్రాంతి పథం, మెప్మా ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నారు. ఆర్మూర్ పట్టణంలో 742 మహిళా సంఘాలు ఉన్నా యి. పది నుంచి 20 మహిళా సంఘాలతో కలిపి 29 మహిళా సమాఖ్యలను (పెద్ద సం ఘాలు) ఏర్పాటు చేసారు. ప్రతీ మహిళా సమాఖ్యకు మినిట్ బుక్స్, బ్యాంకు రికార్డులు రాయడానికి ఒక రీసోర్స్ పర్సన్ (ఆర్‌పీ) ఉం టారు.

ఈ ఆర్‌పీలకు మ హిళా సమాఖ్యలో జమ చేసుకున్న మొత్తం నుంచి వేతనాలు చెల్లిస్తారు. ఆర్‌పీలందరినీ మానిటరింగ్ చేస్తూ ఇద్దరు కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఉం టారు. వీరు మెప్మా ఉద్యోగులుగా వేతనాలు అందుకుంటున్నారు. మహిళా సంఘాలు రుణాలు పొందే సమయంలో ఆర్‌పీలు సం బంధిత డాక్యుమెంట్లు సిద్ధం చేస్తే వాటిని పరిశీలించి బ్యా ంకర్ల తో మాట్లాడి ఎంపిక చేసిన బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించే బాధ్యత సీఓ, ఆర్‌పీలపై ఉంటుంది. వీరు టౌన్ మిషన్ కోఆర్డినేటర్ ఆధీనంలో ఈ సేవలందించాల్సి ఉంటుంది.
 
మరేం జరుగుతోంది
ఆర్మూర్ పట్టణంలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి 190 సంఘాలకు రూ. 4.5 కోట్ల బ్యాంకు రుణాలు ఇప్పించాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఉన్న తాధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఇప్పటికే ఆర్మూర్ పట్టణంలోని 138 సంఘాలకు రూ. 3.74 కోట్ల రుణం ఇప్పించినట్లు టౌన్ మిషన్ కోఆర్డినేటర్ ఉదయశ్రీ తెలిపారు. అయితే, ఈ రుణాలు ఇప్పించే సమయంలో నిరక్షరాస్యులు, పెద్దగా తెలియని పలు మహిళా సంఘాలవారు నేరుగా బ్యాంకుకు వెళ్లి మేనేజర్లతో రుణం గురించి మాట్లాడటం ఇబ్బందికరంగా ఉంటుంది.

ఈ సమస్యను అధిగమించడానికి ఆర్‌పీలు, సీఓలు, టీఎంఓలు మహిళా సంఘాల తరపున బ్యాంకు మేనేజర్లతో మాట్లాడి రుణం ఇప్పించాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని మెప్మా ఉద్యోగులు క్యాష్ చేసుకుంటున్నారు. ఇలా రుణం ఇప్పించినందుకు తమకు ప్రతి సంఘం నుంచి రూ. 10 వేలు చెల్లించాలని ఆర్మూర్ పట్టణంలోని ఒక సీఓ హుకుం జారీ చేసారు.

ఈ డబ్బులు చెల్లించకపోయినా,తాము సూచించిన మొత్తానికి ఒక్క పైసా తగ్గినా భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి అందే ఎలాంటి లబ్ధికైనా అర్హత లభించకుండా చేస్తామంటూ బహిరంగంగానే బెది రింపులకు పాల్పడుతున్నారు. ఇలా చెల్లించాల్సిన రూ. పది వేలలో పెద్ద సంఘానికి రూ. 5 వేలు, తమ సొంత ఖర్చులకు రూ. 5 వేలు తీసుకుంటామని సెలవిస్తున్నారు. నిబంధన ల ప్రకారం మంజూరైన రుణంలో 0.25 శాతం మాత్రమే పెద్ద సంఘంలో జమ చేయాల్సి ఉంటుంది.

కాని మెప్మా ఉద్యోగులు మహిళలను బెదిరింపులకు పాల్పడుతూ ముడుపుల రూపంలో దోపిడీకి పా ల్పడుతున్నారు. ఇలా వసూలు చేసిన మొత్తాన్ని తమ స్థాయికి తగ్గట్లు భాగాలు వేసుకొని పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ గణాంకాల ప్రకారం ఇప్పటికే రుణం మం జూరు చేయిం చిన 138 సంఘాల నుంచి సుమారు 13 లక్షలు వసూలు చేసి పంచుకున్నట్లు సమాచారం.

మిగిలి పోయిన సంఘాలకు సైతం వెంటది వెంట రుణాలు ఇప్పించి మరో రూ. 7 లక్షలు వసూలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మహిళా సంఘాల సభ్యులు తెలుపుతున్నారు. ఫిర్యాదు చేయడానికి సంబంధిత అధికారి దగ్గరికి వెళ్లినా పట్టించుకోవడం లేద ని మహిళలు వాపోతున్నారు. ఉన్నతాధికారులైన పట్టించుకోవాలని కోరుతున్నారు.
 
జిల్లా వ్యాప్తంగా
నిజామాబాద్ నగరంలో 2,445 మహిళా సంఘాలకు రూ. 45.82 కోట్ల బ్యాంకు రుణా లు చెల్లించాలని మెప్మా ఉన్నతాధికారులు టార్గెట్ విధించగా 691 సంఘాలకు రూ. 19.22 కోట్ల రుణాలు ఇప్పించారు. కామారెడ్డి పట్టణంలో 153 సంఘాలకు రూ. 3.90 కోట్ల టార్గెట్ విధించగా 95 సంఘాలకు రూ. 3.13 కోట్ల రుణాలిప్పించారు. బోధన్ పట్టణంలో 3012 సంఘాలకు రూ. 8.23 కోట్ల టార్గెట్ విధించగా 157 సంఘాలకు రూ. 4.94 కోట్ల రుణాలు ఇప్పించారు. ఈ పట్టణాల్లో సైతం పలువురు మెప్మా ఉద్యోగులపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.
 
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
బ్యాంకు నుంచి రుణం ఇప్పించడానికి మెప్మా ఉద్యోగులు ఎవరైనా ముడుపులు అడిగితే మాకు మౌఖికంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాము. నిబంధనల ప్రకారం చెల్లిం చాల్సిన మొత్తం మినహా యించి అదనంగా ఒక్క రూపా యి చెల్లించాల్సి న అవసరం లేదు. మెప్మా ఉద్యోగులకు సంస్థ నుంచి నేరుగా వేతనాలు అందుతాయి కాబట్టి వారికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు.      -ఉదయశ్రీ, టౌన్ మిషన్ కోఆర్డినేటర్, ఆర్మూర్

‘‘తెలంగాణ రాష్ట్రంలో మహిళా సాధికారితకు పెద్దపీట వేసేందుకు  వడ్డీ లేని రుణాలను అందజేస్తాం. ఇందుకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ లేని రుణాల కోసం రూ. 485 కోట్లు మంజూరు చేస్తాము. 30 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుంది. రుణ వాయిదాలను సకాలంలో చెల్లించే 70 శాతం మహిళా సంఘాలకు ఈ పథకాన్ని అమలు చేస్తాం’’    - కె . తారకరామారావు,పంచాయతీరాజ్ శాఖ మంత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement