MEPMA employees
-
కరోనా రుణంలోనూ వాటా!
సాక్షి, చీరాల: మెప్మాలో అవినీతి రాజ్యమేలుతోంది. పేద మహిళల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కొందరు అందినకాడికి దండుకుంటున్నారు. రుణం పేరుతో కాసుల వసూలుకు దిగి పొదుపు మహిళలను దగా చేస్తున్నారు. మీకు రుణం ఇస్తే.. మాకేమి ఇస్తారంటూ.. పొదుపు మహిళలను ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. పొదుపు సంఘాల అధ్యక్షుల ద్వారా రిసోర్సు పర్సన్లే ఈ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. జిల్లాలోని చీరాల మున్సిపాలిటీతో పాటు పలు మున్సిపాలిటీల్లో ఇదే తంతు నడుస్తోంది. కరోనా విపత్కర పరిస్థితి ఏర్పడి పేద, బడుగు వర్గాలతో పాటు అన్ని వర్గాల పరిస్థితి చిన్నాభిన్నమైంది. ఇందులో ముఖ్యంగా సగటు జీవులు నానా అవస్థలు పడుతున్నారు. దారిద్య్రరేఖ దిగువ ఉన్న వారికి కరోనా కష్టాలు తెచ్చి పెట్టింది. (కరోనా.. కాలయములైన కజిన్స్) దినసరి కూలీలు, వృత్తి వ్యాపారాలు చేసుకునే వారు ఇందులో ప్రధానంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం పేద, మధ్య తరగతి వారిని ఆదుకునేందుకు, ఆర్థిక ఇబ్బందుల్లో కూడా చేయూత ఇచ్చింది. ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయలతో పాటు రెండు నెలల కాలంలో నాలుగు దఫాలుగా ఉచితంగా రేషన్ అందించింది. దీంతో పాటు పొదుపు సంఘాలకు సున్నా వడ్డీని అందించడంతో పాటు ప్రధానంగా ఇప్పటికే బ్యాంకు రుణాలు తీసుకుని చెల్లిస్తున్న పొదుపు సంఘాల వారికి కరువు రుణం పేరుతో ప్రతి గ్రూపునకు రూ.50 వేలు చొప్పున రుణం ఇవ్వాలని ప్రభుత్వం బ్యాంకులను ఆదేశించింది. కరువు కాలంలో పొదుపు సంఘాలను ఆదుకుంటే ఆయా కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భావించింది. (‘గూగూల్ ప్రణాళికల కోసం ఉద్యోగులు కలిసిరావాలి’) జిల్లాలోని సగానికిపైగా పొదుపు సంఘాలకు రూ.50 వేలు చొప్పున రుణ సౌకర్యం కల్పించింది. జిల్లాలో అద్దంకి, చీమకుర్తి, చీరాల, గిద్దలూరు, కందుకూరు, కనిగిరి, మార్కాపురం, ఒంగోలు మున్సిపాలిటీ పరిధిలో 10,980 పొదుపు సంఘాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు 300 నుంచి 400 గ్రూపుల వరకు రూ.50 వేలు చొప్పున కరువు రుణాలు అందించారు. మిగిలిన వాటికి కూడా రుణం ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. కరోనా నిబంధన నేపథ్యంలో బ్యాంకర్లు ఇళ్ల వద్దకే వచ్చి రుణాలు అందిస్తున్నారు. కరువు రుణాల్లో కూడా మెప్మా సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. చీరాల మున్సిపాలిటీలో రూ.50 వేల రుణం తీసుకున్న గ్రూపుల అధ్యక్షుల వద్దకు వెళ్లి మీకు రుణం ఇచ్చాం.. మాకు గ్రూపులో ఉన్న పది మంది కలిసి రూ.2 వేలు చొప్పున చెల్లించాలని, ఇతర అధికారులకు తాము ఇవ్వాలని కొంతమంది రిసోర్సు పర్సన్లు రుణం ఇచ్చిన రోజే నగదు వసూలు చేశారు. పొదుపు సంఘాల మహిళలకు వారి వాటాకు వచ్చిన రూ.5 వేలలో రూ.200 చొప్పున వసూలు చేయడం ఏమిటని వాపోతున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే భవిష్యత్తులో ఏదైనా రుణం కోసం వస్తే ఇబ్బందులు పెడతారని వెనకడుగు వేస్తున్నారు. ఉదాహరణకు చీరాల మున్సిపాలిటీలో 1500 గ్రూపులు ఉన్నాయి. ఒక్కో గ్రూపు నుంచి రూ.2 వేలు చొప్పున వసూలు చేస్తే రూ.3 లక్షలు వసూలవుతాయి. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఇదే తంతు జరగుతుంటే మెప్మాలో పొదుపు మహిళలను ఏ స్థాయిలో మోసం చేస్తున్నారో తెలుసుకోవచ్చు. గతంలోనూ ఇదే తంతు చీరాల మున్సిపాలిటీలో గతంలోనూ ఇదే విధంగా అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. చీరాలలో రెండు మహిళా సంఘాల పేరుతో రుణం ఇచ్చినట్లు నమోదు చేసి లక్షల రూపాయలు స్వాహా చేశారు. పేద మహిళల పిల్లలకు ఇవ్వాల్సిన ఉపకార వేతనాలు కూడా ఇవ్వలేదు. దీంతో చీరాల తరహాలో ఒంగోలు, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి ప్రాంతాల్లో మెప్మా తీరుపై ఆరోపణలు వచ్చాయి. చీరాలలో జరిగిన వ్యవహారంపై పోలీసు విచారణ కూడా జరిగింది. -
మెప్మా ఆర్పీలకు రూ.6 వేలు
సాక్షి, హైదరాబాద్: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) సిబ్బందికి, రిసోర్స్ పర్సన్ల (ఆర్పీ)కు ప్రభుత్వం తీపి కబురు ప్రకటించింది. ఆర్పీలకు ప్రతి నెల రూ.6 వేల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 6 వేల మంది ఆర్పీలకు మేలు జరగనుంది. పెంచిన వేతనాలతో ప్రభుత్వంపై ఏటా రూ.30 కోట్ల భారం పడనుంది. పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం 4,800 మంది, కొత్తగా ఏర్పడిన పురపాలిక సంస్థల పరిధిలో మరో 1,200 మంది ఆర్పీలు పని చేస్తున్నారు. ప్రతి నెల ప్రభుత్వం రూ.4 వేలు, సంఘాలు రూ.2 వేల చొప్పున చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. మెప్మా ఉద్యోగులు, ఆర్పీలతో సమావేశమైన పురపాలక మంత్రి కేటీఆర్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గౌరవ వేతనాలు పెంచాలని, పట్టణాల్లో విధులు నిర్వహించేటప్పుడు తమకు గుర్తింపు ఉండేలా డ్రెస్ కోడ్, అరోగ్య బీమా కల్పించాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వీరి విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన మంత్రి ఆర్పీలకు గౌరవ వేతనాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు. బీమా సౌకర్యంపైనా స్పందించిన ఆయన తదుపరి కార్యాచరణకు పురపాలక శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. వడ్డీలేని రుణాలు విడుదల.. పట్టణాల్లోని మహిళా సంఘాలకు రావాల్సిన వడ్డీ లేని రుణాలు రూ.162 కోట్లను విడుదల చేస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ మొత్తాలను మహిళా సంఘాల పొదుపు ఖాతాల్లో జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్‌ను ఆయన అదేశించారు. స్వయం సహాయక సంఘాలతో మహిళా సాధికారత జరుగుతుందని, ఆ సంఘాలతో పట్టణా ల్లో గుణాత్మక మార్పు వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలోని మహిళా సంఘాల పనితీరు ఇతర రాష్ట్రాలకు అదర్శంగా నిలిచిందన్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ వారికి సేవలందిస్తున్న రిసో ర్స్ పర్సన్లను ప్రభుత్వం గుర్తిస్తుందని, ఈ మేరకు చాలా కాలంగా వారు కోరుతున్న గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మెప్మా ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ మెప్మా ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీని ఆమోదిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్)లో ఎప్పటి నుంచో ఉన్న హెచ్ఆర్ పాలసీని తమకూ వర్తింపజేయాలని మెప్మా ఉద్యోగులు కోరుతున్నారు. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఉద్యోగ భద్రత, జీతాల పెంపు, ఏటా ఇంక్రిమెంట్, ఆరోగ్య, జీవిత బీమా సౌకర్యాలు కలుగనున్నాయి. మంత్రి కేటీఆర్ ›నిర్ణయాలు, ప్రకటనలపై ఉద్యోగులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. -
సబ్ కలెక్టర్ వాహనం అడ్డగింత
బోధన్ నిజామాబాద్ : తమ గోడును ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆవేదనతో మెప్మా ఆర్పీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం బోధన్ మున్సిపల్ ఆఫీసు లోపల నుంచి బయటకు వస్తున్న సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి వాహనాన్ని మున్సిపల్ ఆఫీసు ప్రవేశ ద్వారం వద్ద అడ్డుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆర్పీలను సముదాయించే ప్రయత్నం చేస్తూ వాహనాన్ని తహసీల్ ఆఫీసు వైపు మళ్లీంచారు. స్థానిక మున్సిపల్ ఆఫీసులో చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్యపై కౌన్సిలర్లు ఇచ్చిన అవిశ్వాస నోటీసు మేరకు బలపరీక్షకు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 11.30 గంటల వరకు కౌన్సిలర్ల కోరం లేక పోవడంతో సమావేశం వాయిదా వేసి తిరిగి సబ్ కలెక్టర్ ఆఫీసుకు వెళ్తున్న ఆయన వాహనాన్ని మున్సిపల్ ప్రవేశ ద్వారం వద్ద మెప్మా ఆర్పీలు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆర్పీలు ఆగ్రహానికి గురై నినాదాలు చేశారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని, 22 రోజులుగా రోడ్డెక్కి నిరసన తెలిపినా ఎవరూ పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం తమతో వెట్టిచాకిరి చేయించుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ ఆఫీసుకు ర్యాలీ వెళ్లి నిరసన తెలిపారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఇతర సమస్యలు పరిష్కరించాలని మెప్మా ఆర్పీలు 22 రోజులుగా నిరవధిక సమ్మెను కొనసాగిస్తూ రిలే నిరహార దీక్షలు కొనసాగిస్తున్నారు. -
మంత్రి కేటీఆర్‌తో మెప్మా ఉద్యోగుల భేటీ
సాక్షి, హైదరాబాద్: పట్టణాల అభివృద్ధిలో మహిళల పాత్రను మరింత పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు తెలియజేశారు. బుధవారం ఆయన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఉద్యోగులతో సమావేశమయ్యారు. సంస్థలో పని చేస్తున్న రిసోర్స్ పర్సన్లు, కమ్యూనిటీ ఆఫీసర్ల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున మెప్మా ఉద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రిసోర్స్ పర్సన్లు, ముఖ్యంగా మహిళల సహకారంతో తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను పట్టణాల్లో పకడ్బందీగా అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం అమలుచేస్తున్న కేసీఆర్ కిట్లు, హరితహారం, బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా పట్టణాలను ప్రకటించే కార్యక్రమాలపై క్షేత్రస్థాయిలో అమలు జరుగుతున్న తీరు పైన రిసోర్స్ పర్సన్ లనుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. ప్రభుత్వం మాతా శిశు సంక్షేమానికి ప్రభుత్వ వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఈ నేపథ్యంలో వాక్సినేషన్, షౌష్టికాహార కార్యక్రమాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలపై పట్టణ ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని కోరారు. మెప్మా ఉద్యోగులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు త్వరలోనే సమావేశం అవుతారని తెలిపారు. ఈసందర్భంగా మెప్మా ఉద్యోగులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దాదాపు దశాబ్దకాలం పాటు అన్ని ప్రభుత్వ కార్యక్రమాల అమలులో క్షేత్ర స్థాయిలో కీలకంగా పనిచేస్తున్నా, తమకు అతి తక్కువ వేతనాలు ఉన్నాయని, వీటిని పెంచాలని రిసోర్స్ పర్సన్లు మంత్రికి విన్నవించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటారని, మంత్రి మెప్మా ఉద్యోగులకు హామీ ఇచ్చారు. -
ముడుపులు వాపస్
* మహిళా సంఘాలకు డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్న ఆర్పీలు * తమపై విచారణ కమిటీకి ఫిర్యాదు చేయవద్దంటూ వినతులు * సీఓను కాపాడే ప్రయత్నంలో అధికారులు ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించడానికి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఉద్యోగులు బలవంతపు వసూళ్లకు పాల్పడిన వ్యవహారంపై ‘సాక్షి’ దినపత్రికలో వరస కథనాలు ప్రచురితం కావడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎలాగైనా తప్పించుకోవడానికి పలువురు ఆర్పీలు ప్రయత్నాలను ముమ్మరం చేసారు. ఇన్ని రోజులుగా మహిళా సంఘాలను బెదిరించి, భయపెట్టి వసూలు చేసిన ముడుపులను ఆయా సం ఘాల సభ్యులకు తిరిగి ఇచ్చి వేస్తున్నారు. తమపై విచారణ జరపడానికి వచ్చిన అధికారులకు తమపై ఎలాంటి ఫిర్యాదు చేయవద్దని మహిళా సంఘాల సభ్యులకు విన్నవించుకుంటున్నారు. ఎవరైనా సంఘం సభ్యులు అందుబాటులో లేకపోతే సదరు ఆర్పీలు ఫోన్లు చేసి మరీ సభ్యుల ఇంటికి వెళ్లిడబ్బులు అప్పజెప్పి వస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ముడుపుల వ్యవహారంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కమ్యూనిటీ ఆర్గనైజర్ (సీవో)ను విచారణ నుం చి తప్పించడానికి జిల్లా కేంద్రంలోని మెప్మా ఉద్యోగులతో పాటు ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయానికి చెందిన ఒక అధికారి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీవోతో కలిసి మహిళా సంఘాల నుంచి బల వంతపు వసూళ్లు చేసిన ఆర్పీలు తమ వంతుగా తీసుకున్న మొత్తాన్ని మాత్రమే తిరిగి చెల్లిస్తున్నారు. సీవో వాటాగా తీసుకున్న మొత్తానికి మాత్రం తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటున్నారు. దీంతో మెప్మా పీడీ సత్యనారాయణ ఆధ్వర్యంలో విచారణ చేపడుతున్న కమిటీ సభ్యులు మహిళా సంఘాల సభ్యులందరినీ ఒకే చోట సమావేశం ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చాలని పలువురు కోరుతున్నారు. మహిళా సంఘాల నుంచి మెప్మా ఉద్యోగుల బలవంతపు వసూళ్లపై మెప్మా ఎండీ అనితా రాంచంద్రన్‌తో పాటు జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ సీరియస్ అయ్యారు. విచారణ కోసం ఆర్మూర్‌కు వచ్చిన మెప్మా అర్బన్ పీడీ సత్యనారాయణ ముగ్గురితో కూడిన విచారణ కమిటీని వేసారు. ఆర్మూ ర్ మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, డీఎంసీ ఐబీ మాధురీలత, డీఎంసీ బ్యాం లింకేజీ విశ్రాంత ఉద్యోగి మోహన్‌రావు ఈ కమిటీలో సభ్యులు. అయితే ముడుపుల ఆరోపణలు వచ్చి నాలుగు రోజులు గడుస్తున్నా ఈ కమిటీ ఇప్పటికీ విచారణ ప్రారంభించకపోవడం కొసమెరుపు. మహిళా సంఘాల రికార్డుల్లో అక్రమార్కుల బాగోతం.. మహిళా సాధికారతలో భాగంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు నుంచి గత ప్రభుత్వాలు మహి ళా సంఘాలను ఏర్పాటు చేయిస్తూ బ్యాంకుల ద్వారా అతి తక్కువ వడ్డీకి రుణాలను అందజేయిస్తున్నారు. అయితే ఈ మహిళా సంఘాలు ఏర్పాటైన రోజు నుంచి ప్రతి సమావేశం, సమావేశంలో చర్చించిన అంశాలు, తీర్మానాలు, బ్యాంకుల నుంచి పొందిన రుణాలు, వడ్డీ, తిరిగి బ్యాంకులకు చెల్లించిన మొత్తం, సంఘం నిర్వహణకు, బ్యాంకు రుణాలు పొందే సమయంలో అయిన ఖర్చును రికార్డుల్లో విధిగా రాయాల్సి ఉంటుంది. ప్రతి సంఘంలో సుమారు పది నుంచి 12 మంది మహిళలు సంభ్యులుగా ఉంటారు. బ్యాంకు వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల వ్యవహారాలన్ని ఆ సంఘంలో ఎంపిక చేసుకున్న లీడర్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటారు. సంఘం సభ్యులకు ఫోన్ చేసిన బిల్లును, ఆటో చార్జీలను మొదలుకొని ప్రతి పైసాకు ఆ సంఘం లీడర్లు బాధ్యులుగా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మెప్మా పరిధిలో మహిళా సంఘాలకు బ్యాంకుల నుంచి మాట్లాడి రుణాలు ఇప్పించాల్సిన బాధ్యత ఉన్న సీవోతో పాటు పలువురు ఆర్పీలు సంఘాల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు. రుణం ఇప్పించినందుకు బెది రింపులకు పాల్పడుతూ ప్రతి మహిళా సంఘం నుంచి రూ. 5,000 నుంచి రూ.10,000 వరకు బలవంతపు వసూళ్లు చేసారు. అయితే సీవో, ఆర్పీలు ఈ ముడుపుల వ్యవహారాన్ని ఆయా సంఘాల లీడర్ల ద్వారా కొనసాగిం చారు. ముందుగా సంఘం లీడర్‌ను పిలిపించి తాము బ్యాంకులో రుణం ఇప్పిస్తున్నందుకు మీ సంఘం నుంచి ఇంత మొత్తం విధిగా చెల్లించాలని డిమాండ్ చేసారు. ఆ లీడర్లు తమ సంఘం సభ్యులందరి దృష్టికి తీసుకెళ్లి తలా ఇంత డబ్బులు వేసుకొని ముడుపులు జమ చేసి మెప్మా ఉద్యోగులకు అప్పగించారు. అయితే ఇలా వసూలు చేసిన మొత్తాన్ని ఆ మహిళా సంఘం లీడర్ తన సొంతానికి కూడా వాడుకొనే పరిస్థితులు ఉంటాయి. దీంతో అవినీతికి తావు లేకుండా లీడర్ తాము జమ చేసిన మొత్తాన్ని ఏ అధికారికి ఎంత ముడుపుల రూపంలో చెల్లించింది రికార్డులో విధిగా రాయాల్సి ఉం టుంది. లేని పక్షంలో ఆ మొత్తాన్ని ఆ లీడరే కాజేసినట్లే అవుతుంది. విచారణ చేపట్టనున్న అధికారులు సైతం మహిళా సంఘాల సభ్యుల జమ ఖర్చులను వారి రికార్డుల్లో పరిశీలించి నిష్పక్షపాతంగా పూర్తి స్థాయి విచారణ జరిపితే బాధ్యులైన అక్రమార్కుల బండారం బయటపడే అవకాశం ఉంటుంది. -
నిలువు దోపిడీ
* బరితెగించిన మెప్మా ఉద్యోగులు * మహిళా సంఘాల నుంచి బలవంతపు వసూళ్లు * లేదంటే రుణ మంజూరులో అడ్డంకులు * ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 20 లక్షలు టార్గెట్ ఆర్మూర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ మాటగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించిన విధానంతో మహిళా సంఘాలకు వడ్డీ లేని రు ణాలు అందాలి. అయితే ఆర్మూర్‌లో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ప్రభుత్వం మహిళలకు బ్యాంకు రుణా ల వడ్డీ మాఫీ చేయడం ద్వారా లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నిస్తోంటే. రుణాల వంకతో మహిళా సంఘాల నుంచి వేల రూపాయలను వసూలు చేయడానికి పట్టణ పేదరిక ని ర్మూలన సంస్థ (మెప్మా) ఉద్యోగులు పూనుకున్నారు. కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు అధికారులందరికీ ముడుపులు చెల్లిం చాల్సి ఉంటుందంటూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే ఆ మహిళా సంఘానికి రుణం అందకుం డా చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో గత్యం తరం లేని పరిస్థితులలో మెప్మా ఉద్యోగులకు మహిళా సంఘాలవా రు ముడుపులు ముట్ట జెప్పుకుంటున్నారు. నిజామాబాద్, ఆర్మూర్, కామారెడ్డి, బోధన్ మున్సిపాలిటీల పరిధిలో ఈ వ్యవహారం కొనసాగుతోంది. ఆర్మూర్‌లోనే మెప్మా ఉద్యోగులు ముడుపుల రూపంలో ఈ ఏడాది రూ. 20 లక్షలు వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారంటే మహిళలు ఎంత దోపిడీకి గురవుతున్నారో అర్థమవుతోంది. ఇలాంటి ఉద్యోగు ల కారణంగా ప్రభుత్వాలు వడ్డీ లేని రుణాలు అందజేసినా రుణం మొత్తం చెల్లించే సమయానికి వందకు రెండు రూపాయల వడ్డీని చెల్లించే పరిస్థితులు ఏర్పడతాయి. ఇదీ జరగాలి మహిళలకు బ్యాంకు రుణాలు ఇప్పించడం ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేయడ మే లక్ష్యంగా గత పాలకుల హయాంలో నుంచి ఇందిరా క్రాంతి పథం, మెప్మా ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నారు. ఆర్మూర్ పట్టణంలో 742 మహిళా సంఘాలు ఉన్నా యి. పది నుంచి 20 మహిళా సంఘాలతో కలిపి 29 మహిళా సమాఖ్యలను (పెద్ద సం ఘాలు) ఏర్పాటు చేసారు. ప్రతీ మహిళా సమాఖ్యకు మినిట్ బుక్స్, బ్యాంకు రికార్డులు రాయడానికి ఒక రీసోర్స్ పర్సన్ (ఆర్పీ) ఉం టారు. ఈ ఆర్పీలకు మ హిళా సమాఖ్యలో జమ చేసుకున్న మొత్తం నుంచి వేతనాలు చెల్లిస్తారు. ఆర్పీలందరినీ మానిటరింగ్ చేస్తూ ఇద్దరు కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఉం టారు. వీరు మెప్మా ఉద్యోగులుగా వేతనాలు అందుకుంటున్నారు. మహిళా సంఘాలు రుణాలు పొందే సమయంలో ఆర్పీలు సం బంధిత డాక్యుమెంట్లు సిద్ధం చేస్తే వాటిని పరిశీలించి బ్యా ంకర్ల తో మాట్లాడి ఎంపిక చేసిన బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించే బాధ్యత సీఓ, ఆర్పీలపై ఉంటుంది. వీరు టౌన్ మిషన్ కోఆర్డినేటర్ ఆధీనంలో ఈ సేవలందించాల్సి ఉంటుంది. మరేం జరుగుతోంది ఆర్మూర్ పట్టణంలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి 190 సంఘాలకు రూ. 4.5 కోట్ల బ్యాంకు రుణాలు ఇప్పించాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఉన్న తాధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఇప్పటికే ఆర్మూర్ పట్టణంలోని 138 సంఘాలకు రూ. 3.74 కోట్ల రుణం ఇప్పించినట్లు టౌన్ మిషన్ కోఆర్డినేటర్ ఉదయశ్రీ తెలిపారు. అయితే, ఈ రుణాలు ఇప్పించే సమయంలో నిరక్షరాస్యులు, పెద్దగా తెలియని పలు మహిళా సంఘాలవారు నేరుగా బ్యాంకుకు వెళ్లి మేనేజర్లతో రుణం గురించి మాట్లాడటం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించడానికి ఆర్పీలు, సీఓలు, టీఎంఓలు మహిళా సంఘాల తరపున బ్యాంకు మేనేజర్లతో మాట్లాడి రుణం ఇప్పించాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని మెప్మా ఉద్యోగులు క్యాష్ చేసుకుంటున్నారు. ఇలా రుణం ఇప్పించినందుకు తమకు ప్రతి సంఘం నుంచి రూ. 10 వేలు చెల్లించాలని ఆర్మూర్ పట్టణంలోని ఒక సీఓ హుకుం జారీ చేసారు. ఈ డబ్బులు చెల్లించకపోయినా,తాము సూచించిన మొత్తానికి ఒక్క పైసా తగ్గినా భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి అందే ఎలాంటి లబ్ధికైనా అర్హత లభించకుండా చేస్తామంటూ బహిరంగంగానే బెది రింపులకు పాల్పడుతున్నారు. ఇలా చెల్లించాల్సిన రూ. పది వేలలో పెద్ద సంఘానికి రూ. 5 వేలు, తమ సొంత ఖర్చులకు రూ. 5 వేలు తీసుకుంటామని సెలవిస్తున్నారు. నిబంధన ల ప్రకారం మంజూరైన రుణంలో 0.25 శాతం మాత్రమే పెద్ద సంఘంలో జమ చేయాల్సి ఉంటుంది. కాని మెప్మా ఉద్యోగులు మహిళలను బెదిరింపులకు పాల్పడుతూ ముడుపుల రూపంలో దోపిడీకి పా ల్పడుతున్నారు. ఇలా వసూలు చేసిన మొత్తాన్ని తమ స్థాయికి తగ్గట్లు భాగాలు వేసుకొని పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ గణాంకాల ప్రకారం ఇప్పటికే రుణం మం జూరు చేయిం చిన 138 సంఘాల నుంచి సుమారు 13 లక్షలు వసూలు చేసి పంచుకున్నట్లు సమాచారం. మిగిలి పోయిన సంఘాలకు సైతం వెంటది వెంట రుణాలు ఇప్పించి మరో రూ. 7 లక్షలు వసూలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మహిళా సంఘాల సభ్యులు తెలుపుతున్నారు. ఫిర్యాదు చేయడానికి సంబంధిత అధికారి దగ్గరికి వెళ్లినా పట్టించుకోవడం లేద ని మహిళలు వాపోతున్నారు. ఉన్నతాధికారులైన పట్టించుకోవాలని కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్ నగరంలో 2,445 మహిళా సంఘాలకు రూ. 45.82 కోట్ల బ్యాంకు రుణా లు చెల్లించాలని మెప్మా ఉన్నతాధికారులు టార్గెట్ విధించగా 691 సంఘాలకు రూ. 19.22 కోట్ల రుణాలు ఇప్పించారు. కామారెడ్డి పట్టణంలో 153 సంఘాలకు రూ. 3.90 కోట్ల టార్గెట్ విధించగా 95 సంఘాలకు రూ. 3.13 కోట్ల రుణాలిప్పించారు. బోధన్ పట్టణంలో 3012 సంఘాలకు రూ. 8.23 కోట్ల టార్గెట్ విధించగా 157 సంఘాలకు రూ. 4.94 కోట్ల రుణాలు ఇప్పించారు. ఈ పట్టణాల్లో సైతం పలువురు మెప్మా ఉద్యోగులపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం బ్యాంకు నుంచి రుణం ఇప్పించడానికి మెప్మా ఉద్యోగులు ఎవరైనా ముడుపులు అడిగితే మాకు మౌఖికంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాము. నిబంధనల ప్రకారం చెల్లిం చాల్సిన మొత్తం మినహా యించి అదనంగా ఒక్క రూపా యి చెల్లించాల్సి న అవసరం లేదు. మెప్మా ఉద్యోగులకు సంస్థ నుంచి నేరుగా వేతనాలు అందుతాయి కాబట్టి వారికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. -ఉదయశ్రీ, టౌన్ మిషన్ కోఆర్డినేటర్, ఆర్మూర్ ‘‘తెలంగాణ రాష్ట్రంలో మహిళా సాధికారితకు పెద్దపీట వేసేందుకు వడ్డీ లేని రుణాలను అందజేస్తాం. ఇందుకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ లేని రుణాల కోసం రూ. 485 కోట్లు మంజూరు చేస్తాము. 30 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుంది. రుణ వాయిదాలను సకాలంలో చెల్లించే 70 శాతం మహిళా సంఘాలకు ఈ పథకాన్ని అమలు చేస్తాం’’ - కె . తారకరామారావు,పంచాయతీరాజ్ శాఖ మంత్రి