Womens Unions
-
మహిళాసంఘాలకు రూ.16 వేల కోట్ల రుణాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 2022–23 సంవత్సరంలో మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ)కు దాదాపు రూ.16 వేల కోట్ల మేర రుణాలు అందించేందుకు కసరత్తు సాగుతోంది. ఎస్‌హెచ్‌జీ బ్యాంక్ లింకేజీ వార్షిక కార్యాచరణకు పంచాయతీరాజ్ శాఖ శ్రీకారం చుట్టనుంది. బుధవారం దీనికి సంబంధించిన జిల్లాలవారీగా వార్షిక రుణప్రణాళికను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించనున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణ ప్రణాళికను ఆమోదించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 3,70,647 (కొత్తగా ఏర్పడిన సంఘాలతో సహా) సంఘాల్లోని దాదాపు 40 లక్షల మంది సభ్యులకు రూ.16 వేల కోట్ల మేర బ్యాంక్ లింకేజీలు కల్పిస్తారు. గత ఆర్థిక సంవత్సరంలో 4,304 కొత్త సంఘాలు ఏర్పడ్డాయి. అందులో 41,889 మంది కొత్త సభ్యులను చేర్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ సంఘాలు, సభ్యులకు కూడా బ్యాంక్ లింకేజీలు అందిస్తారు. ఆరు నెలలు దాటిన కొత్త సంఘాలకే బ్యాంక్ లింకేజీలు అందజేస్తారు. సంఘాల పరపతి, రుణాల చెల్లింపు తదితర అంశాల ప్రాతిపదికన వారికి లింకేజీలు కల్పిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళాసంఘాల్లో దాదాపుగా అన్ని కుటుంబాలు లబ్ధి పొందేలా ప్రణాళికలు రూపొందించినట్టు అధికారులు చెబుతున్నారు. 2022–23లో లక్ష్యాలివే... ♦అత్యధికంగా రుణలక్ష్యాలు ఉన్న జిల్లాలు... నిజామాబాద్ జిల్లాలో 21,786 సంఘాలకుగాను దాదాపు రూ.1,032 కోట్లు, నల్లగొండ జిల్లాలో 25,782 సంఘాలకుగాను దాదాపు రూ.959 కోట్లు, ఖమ్మం జిల్లాలో 21,766 సంఘాలకుగాను దాదాపు రూ.931 కోట్లు. ♦అత్యల్పంగా టార్గెట్ గల జిల్లాలు... మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 2,785 సంఘాలకు (కేవలం 5 మండలాలు) దాదాపు రూ.139 కోట్లు, జోగుళాంబ గద్వాల జిల్లాలోని 5,297 సంఘాలకు దాదాపు రూ.178 కోట్లు, కొమురంభీమ్ జిల్లాలోని 6,481 సంఘాలకు దాదాపు రూ.199 కోట్లు, ములుగు జిల్లాలోని 5,571 సంఘాలకుగాను దాదాపు రూ.196 కోట్లుగా ఉంది. పాతికేళ్లుగా... రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ కార్యక్రమాన్ని దాదాపు పాతికేళ్ల క్రితం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలోని నిరుపేద, పేదలను గుర్తించి, వారిని స్వయం సహాయక సంఘాల కింద సంఘటితం చేశారు. మహిళాసాధికారత సాధనకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) కృషి చేస్తోంది. -
చిచ్చు రేపిన పసుపు–కుంకుమ
మదనపల్లె : పసుపు–కుంకుమ డబ్బులు తనకు ఇవ్వకపోవడంపై ఆగ్రహించిన మహిళా సంఘ సభ్యురాలు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన గురువారం సాయంత్రం మదనపల్లెలో చోటుచేసుకుంది. వివరాలు..గాంధీపురానికి చెందిన చౌడేశ్వరి శేషసాయి పొదుపు సంఘంలో ఆరు నెలల క్రితం సభ్యురాలిగా చేరింది. సంఘంలో చురుగ్గా ఉండటం, డిగ్రీ అర్హత కలిగి ఉండడంతో ఆమెను టీఎల్ఎఫ్ ఆర్పీగా నియమించేందుకు తీర్మానం చేశారు. ఒకరోజు విధులు నిర్వహించిన తర్వాత అర్థంతరంగా తొలగించారు. ప్రస్తుతం ప్రభుత్వం మహిళా సంఘ సభ్యులకు ‘పసుపు–కుంకుమ’ పేరిట రూ.10,000 ఇస్తున్నట్లు ప్రకటించడం, తాను సభ్యురాలిగా ఉన్న గ్రూపునకు మంజూరు చేస్తారని, తనకూ తనకు ఇస్తారని చౌడేశ్వరి ఆశలు పెట్టుకుంది. ప్రకటించి పది రోజులవుతున్నా తనకు చెక్కులు ఎవరూ ఇవ్వకపోవడంతో కార్యాలయానికి వెళ్లి మెప్మా సిబ్బందితో వాగ్వివాదానికి దిగింది. మెప్మాలో అందరూ కలిసి తనకు అన్యాయం చేశారంటూ అక్కడ విలేకరులకు తన ఆక్రోశం వెళ్లగక్కింది. ఆపై, బయటకు వెళ్లి ఫినాయిల్ బాటిల్ తీసుకువచ్చి తాగి, అస్వస్థతకు గురైంది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళలను తోసేసి స్పృహ తప్పి కార్యాలయంలో నేలపై పడిపోయింది. ఆమె దగ్గరకు వెళ్లేందుకు మెప్మా కార్యాలయంలోని మహిళలెవరూ సాహసించలేదు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ శివప్రసాద్ కార్యాలయానికి చేరుకుని చౌడేశ్వరిని ఆస్పత్రికి తరలించారు. అనుకోని ఈ సంఘటనతో షాక్‌కు గురైన మెప్మా పీఆర్పీ అబ్బాస్ అస్వస్థతకు గురవడంతో ఆయనను Mకూడా ఆస్పత్రికి తరలించారు. ఈకేవైసీ లేకనే... ఈ విషయమై మెప్మా సీఆర్పీ మాధవిని వివరణ కోరగాగా.. శేషసాయి పొదుపు సంఘంలోని చౌడేశ్వరి, సునీతకు ఈకేవైసీ లేని కారణంగా పసుపు–కుంకుమకు అర్హులు కాలేదన్నారు. పట్టణంలో ఈ విధంగా సుమారు 2,500 మంది మహిళలకు చెక్కులు రాలేదని, పల్స్ సర్వే జరిగితే తప్ప దీనికి అర్హత రాదని, అందరూ చేయించుకోవాలని సూచించామన్నారు. చౌడేశ్వరికి కూడా ఇదే విషయం తెలియజేశామన్నారు. పీఆర్పీపై చెప్పుతో దాడి చేసిన బాధితురాలు సంఘటన జరిగిన సమయంలో అక్కడ ఉన్న మహిళలను విలేకరులు ప్రశ్నించగా, చౌడేశ్వరి ఆగ్రహంగా వచ్చీ రావడంతోనే పీఆర్పీ అబ్బాస్‌పై చెప్పుతో దాడి చేసిందని పేర్కొన్నారు. అడ్డుకోబోయిన సీఓ మస్తానీని కొట్టి, ఇతర మహిళలను గాయపరిచిందని చెప్పారు. ఇదలా ఉంచితే, ఈ ఘటనపై ఇరువర్గాలను విచారణ చేసి కేసు నమోదు చేయనున్నట్లు వన్‌టౌన్ పోలీసు అధికారులు తెలిపారు. -
మహిళలు ఈల వేసి ఆపాలి!
నవాబుపేట: ఉదయం నిద్ర లేవగానే మహిళా సంఘాల బాధ్యుల ఈల పిలుపు తో ఎవరూ బహిర్భూమికి వెళ్లకుండా చూడాలని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ సూచిం చారు. మండల పరిధిలోని రుద్రారం గ్రామాన్ని సోమవారం ఆయన సందర్శించి మరుగుదొడ్ల వాడకంపై ఆరాతీశారు. మరుగుదొడ్లు నిర్మించుకోవడంతోనే కాదు వాడితేనే స్వచ్ఛ భారత్ లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు. గ్రామంలో ఎవ రూ బహిర్బూమి వెళ్లకుండా మహిళా సంఘాలు బాధ్యతగా తీసుకుని ఈలలు వేయాలన్నారు. ఒక్కో సంఘం బాధ్యులు ఒక్కో ప్రాంతాన్ని ఎంచుకుని ఈలల శబ్ధాలతో అందరూ వ్యక్తిగత మరుగుదొడ్లు వాడుకునేలా చేయాలని ఆయన సూచించారు. కాగా, రుద్రారం గ్రామానికి డ్వామా ద్వారా చెత్త సేకరణ ప్రాజెక్టు మంజూరయ్యే అవకాశముందని కలెక్టర్ తెలిపారు. అలాగే, గ్రామపంచాయతీ కి నూతన భవనం మంజూరు చేయాలన్న సర్పంచ్ లక్ష్మీకృష్ణ విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించాలని ఆతర్వాత గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం ద్వారా చేస్తున్న ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని కలెక్టర్.. డీఎంహెచ్ఓ రజిని, వైద్యులు వేణుగోపాల్‌రెడ్డి, నిర్మాణతో కలిసి పరిశీలించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ శ్రీనివాస్, ఎంపీడీఓ సాయిలక్ష్మి, మాజీ ఎంపీపీ నర్సింహులుతో పాటు యాదిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, కృష్ణ, రవి, ఉమారెడ్డి, రహీం తదితరులు పాల్గొన్నారు. -
నిలువు దోపిడీ
* బరితెగించిన మెప్మా ఉద్యోగులు * మహిళా సంఘాల నుంచి బలవంతపు వసూళ్లు * లేదంటే రుణ మంజూరులో అడ్డంకులు * ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 20 లక్షలు టార్గెట్ ఆర్మూర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ మాటగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించిన విధానంతో మహిళా సంఘాలకు వడ్డీ లేని రు ణాలు అందాలి. అయితే ఆర్మూర్‌లో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ప్రభుత్వం మహిళలకు బ్యాంకు రుణా ల వడ్డీ మాఫీ చేయడం ద్వారా లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నిస్తోంటే. రుణాల వంకతో మహిళా సంఘాల నుంచి వేల రూపాయలను వసూలు చేయడానికి పట్టణ పేదరిక ని ర్మూలన సంస్థ (మెప్మా) ఉద్యోగులు పూనుకున్నారు. కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు అధికారులందరికీ ముడుపులు చెల్లిం చాల్సి ఉంటుందంటూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే ఆ మహిళా సంఘానికి రుణం అందకుం డా చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో గత్యం తరం లేని పరిస్థితులలో మెప్మా ఉద్యోగులకు మహిళా సంఘాలవా రు ముడుపులు ముట్ట జెప్పుకుంటున్నారు. నిజామాబాద్, ఆర్మూర్, కామారెడ్డి, బోధన్ మున్సిపాలిటీల పరిధిలో ఈ వ్యవహారం కొనసాగుతోంది. ఆర్మూర్‌లోనే మెప్మా ఉద్యోగులు ముడుపుల రూపంలో ఈ ఏడాది రూ. 20 లక్షలు వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారంటే మహిళలు ఎంత దోపిడీకి గురవుతున్నారో అర్థమవుతోంది. ఇలాంటి ఉద్యోగు ల కారణంగా ప్రభుత్వాలు వడ్డీ లేని రుణాలు అందజేసినా రుణం మొత్తం చెల్లించే సమయానికి వందకు రెండు రూపాయల వడ్డీని చెల్లించే పరిస్థితులు ఏర్పడతాయి. ఇదీ జరగాలి మహిళలకు బ్యాంకు రుణాలు ఇప్పించడం ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేయడ మే లక్ష్యంగా గత పాలకుల హయాంలో నుంచి ఇందిరా క్రాంతి పథం, మెప్మా ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నారు. ఆర్మూర్ పట్టణంలో 742 మహిళా సంఘాలు ఉన్నా యి. పది నుంచి 20 మహిళా సంఘాలతో కలిపి 29 మహిళా సమాఖ్యలను (పెద్ద సం ఘాలు) ఏర్పాటు చేసారు. ప్రతీ మహిళా సమాఖ్యకు మినిట్ బుక్స్, బ్యాంకు రికార్డులు రాయడానికి ఒక రీసోర్స్ పర్సన్ (ఆర్పీ) ఉం టారు. ఈ ఆర్పీలకు మ హిళా సమాఖ్యలో జమ చేసుకున్న మొత్తం నుంచి వేతనాలు చెల్లిస్తారు. ఆర్పీలందరినీ మానిటరింగ్ చేస్తూ ఇద్దరు కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఉం టారు. వీరు మెప్మా ఉద్యోగులుగా వేతనాలు అందుకుంటున్నారు. మహిళా సంఘాలు రుణాలు పొందే సమయంలో ఆర్పీలు సం బంధిత డాక్యుమెంట్లు సిద్ధం చేస్తే వాటిని పరిశీలించి బ్యా ంకర్ల తో మాట్లాడి ఎంపిక చేసిన బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించే బాధ్యత సీఓ, ఆర్పీలపై ఉంటుంది. వీరు టౌన్ మిషన్ కోఆర్డినేటర్ ఆధీనంలో ఈ సేవలందించాల్సి ఉంటుంది. మరేం జరుగుతోంది ఆర్మూర్ పట్టణంలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి 190 సంఘాలకు రూ. 4.5 కోట్ల బ్యాంకు రుణాలు ఇప్పించాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఉన్న తాధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఇప్పటికే ఆర్మూర్ పట్టణంలోని 138 సంఘాలకు రూ. 3.74 కోట్ల రుణం ఇప్పించినట్లు టౌన్ మిషన్ కోఆర్డినేటర్ ఉదయశ్రీ తెలిపారు. అయితే, ఈ రుణాలు ఇప్పించే సమయంలో నిరక్షరాస్యులు, పెద్దగా తెలియని పలు మహిళా సంఘాలవారు నేరుగా బ్యాంకుకు వెళ్లి మేనేజర్లతో రుణం గురించి మాట్లాడటం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించడానికి ఆర్పీలు, సీఓలు, టీఎంఓలు మహిళా సంఘాల తరపున బ్యాంకు మేనేజర్లతో మాట్లాడి రుణం ఇప్పించాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని మెప్మా ఉద్యోగులు క్యాష్ చేసుకుంటున్నారు. ఇలా రుణం ఇప్పించినందుకు తమకు ప్రతి సంఘం నుంచి రూ. 10 వేలు చెల్లించాలని ఆర్మూర్ పట్టణంలోని ఒక సీఓ హుకుం జారీ చేసారు. ఈ డబ్బులు చెల్లించకపోయినా,తాము సూచించిన మొత్తానికి ఒక్క పైసా తగ్గినా భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి అందే ఎలాంటి లబ్ధికైనా అర్హత లభించకుండా చేస్తామంటూ బహిరంగంగానే బెది రింపులకు పాల్పడుతున్నారు. ఇలా చెల్లించాల్సిన రూ. పది వేలలో పెద్ద సంఘానికి రూ. 5 వేలు, తమ సొంత ఖర్చులకు రూ. 5 వేలు తీసుకుంటామని సెలవిస్తున్నారు. నిబంధన ల ప్రకారం మంజూరైన రుణంలో 0.25 శాతం మాత్రమే పెద్ద సంఘంలో జమ చేయాల్సి ఉంటుంది. కాని మెప్మా ఉద్యోగులు మహిళలను బెదిరింపులకు పాల్పడుతూ ముడుపుల రూపంలో దోపిడీకి పా ల్పడుతున్నారు. ఇలా వసూలు చేసిన మొత్తాన్ని తమ స్థాయికి తగ్గట్లు భాగాలు వేసుకొని పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ గణాంకాల ప్రకారం ఇప్పటికే రుణం మం జూరు చేయిం చిన 138 సంఘాల నుంచి సుమారు 13 లక్షలు వసూలు చేసి పంచుకున్నట్లు సమాచారం. మిగిలి పోయిన సంఘాలకు సైతం వెంటది వెంట రుణాలు ఇప్పించి మరో రూ. 7 లక్షలు వసూలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మహిళా సంఘాల సభ్యులు తెలుపుతున్నారు. ఫిర్యాదు చేయడానికి సంబంధిత అధికారి దగ్గరికి వెళ్లినా పట్టించుకోవడం లేద ని మహిళలు వాపోతున్నారు. ఉన్నతాధికారులైన పట్టించుకోవాలని కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్ నగరంలో 2,445 మహిళా సంఘాలకు రూ. 45.82 కోట్ల బ్యాంకు రుణా లు చెల్లించాలని మెప్మా ఉన్నతాధికారులు టార్గెట్ విధించగా 691 సంఘాలకు రూ. 19.22 కోట్ల రుణాలు ఇప్పించారు. కామారెడ్డి పట్టణంలో 153 సంఘాలకు రూ. 3.90 కోట్ల టార్గెట్ విధించగా 95 సంఘాలకు రూ. 3.13 కోట్ల రుణాలిప్పించారు. బోధన్ పట్టణంలో 3012 సంఘాలకు రూ. 8.23 కోట్ల టార్గెట్ విధించగా 157 సంఘాలకు రూ. 4.94 కోట్ల రుణాలు ఇప్పించారు. ఈ పట్టణాల్లో సైతం పలువురు మెప్మా ఉద్యోగులపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం బ్యాంకు నుంచి రుణం ఇప్పించడానికి మెప్మా ఉద్యోగులు ఎవరైనా ముడుపులు అడిగితే మాకు మౌఖికంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాము. నిబంధనల ప్రకారం చెల్లిం చాల్సిన మొత్తం మినహా యించి అదనంగా ఒక్క రూపా యి చెల్లించాల్సి న అవసరం లేదు. మెప్మా ఉద్యోగులకు సంస్థ నుంచి నేరుగా వేతనాలు అందుతాయి కాబట్టి వారికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. -ఉదయశ్రీ, టౌన్ మిషన్ కోఆర్డినేటర్, ఆర్మూర్ ‘‘తెలంగాణ రాష్ట్రంలో మహిళా సాధికారితకు పెద్దపీట వేసేందుకు వడ్డీ లేని రుణాలను అందజేస్తాం. ఇందుకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ లేని రుణాల కోసం రూ. 485 కోట్లు మంజూరు చేస్తాము. 30 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుంది. రుణ వాయిదాలను సకాలంలో చెల్లించే 70 శాతం మహిళా సంఘాలకు ఈ పథకాన్ని అమలు చేస్తాం’’ - కె . తారకరామారావు,పంచాయతీరాజ్ శాఖ మంత్రి