మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడుతున్న కలెక్టర్ రొనాల్డ్‌రోస్
నవాబుపేట: ఉదయం నిద్ర లేవగానే మహిళా సంఘాల బాధ్యుల ఈల పిలుపు తో ఎవరూ బహిర్భూమికి వెళ్లకుండా చూడాలని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ సూచిం చారు. మండల పరిధిలోని రుద్రారం గ్రామాన్ని సోమవారం ఆయన సందర్శించి మరుగుదొడ్ల వాడకంపై ఆరాతీశారు. మరుగుదొడ్లు నిర్మించుకోవడంతోనే కాదు వాడితేనే స్వచ్ఛ భారత్ లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు. గ్రామంలో ఎవ రూ బహిర్బూమి వెళ్లకుండా మహిళా సంఘాలు బాధ్యతగా తీసుకుని ఈలలు వేయాలన్నారు. ఒక్కో సంఘం బాధ్యులు ఒక్కో ప్రాంతాన్ని ఎంచుకుని ఈలల శబ్ధాలతో అందరూ వ్యక్తిగత మరుగుదొడ్లు వాడుకునేలా చేయాలని ఆయన సూచించారు.
కాగా, రుద్రారం గ్రామానికి డ్వామా ద్వారా చెత్త సేకరణ ప్రాజెక్టు మంజూరయ్యే అవకాశముందని కలెక్టర్ తెలిపారు. అలాగే, గ్రామపంచాయతీ కి నూతన భవనం మంజూరు చేయాలన్న సర్పంచ్ లక్ష్మీకృష్ణ విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించాలని ఆతర్వాత గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం ద్వారా చేస్తున్న ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని కలెక్టర్.. డీఎంహెచ్‌ఓ రజిని, వైద్యులు వేణుగోపాల్‌రెడ్డి, నిర్మాణతో కలిసి పరిశీలించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ శ్రీనివాస్, ఎంపీడీఓ సాయిలక్ష్మి, మాజీ ఎంపీపీ నర్సింహులుతో పాటు యాదిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, కృష్ణ, రవి, ఉమారెడ్డి, రహీం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment