ramkrishna
-
'రాష్ట్రంలో ఎవరు అభివృద్ధి చెందారు?'
సాక్షి, భీమవరం: రాష్ట్రంలో ఎవరు అభివృద్ధి చెందారో సీఎం చంద్రబాబు నాయుడు చెప్పాలని సీఐఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆయన భీమవరంలో జరుగుతున్న సీపీఎం రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక్క ఏడాదిలో రూ. 2500 కోట్ల అవినీతి సొమ్ము బయట పడిందన్నారు. చంద్రబాబు ఎన్నడూ లేని విధంగా దిగజారి రాజకీయ అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం బంద్ కూడా వామపక్షాలు వల్లే చేయగలిగామన్నారు. చట్ట సభల్లో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం పెరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సీపీఐ పార్టీ అన్నీ విషయాలలో సీపీఎంతో కలిసి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. -
అగ్రిగోల్డ్ బాధితులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్) : ప్రభుత్వం విడుదల చేసిన జీఓలకే విలువ లేకపోతే ఎలాగని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని, ఆత్యహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరుతూ విజయవాడలోని హనుమంతరాయ గ్రంథాలయంలో ఏపీ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం 30 గంటల సామూహిక సత్యాగ్రహం చేపట్టారు. తొలుత అగ్రిగోల్డ్ బాధితులు సీపీఐ రాష్ట్ర కార్యాలయం నుంచి గ్రంథాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఆత్మహత్యలకు పాల్పడిన అగ్రిగోల్డ్ బాధితుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామంటూ ప్రభుత్వం జారీ చేసిన జీఓలకు విలువ లేకుండా పోయిందన్నారు. జీఓ విడుదల చేసి మూడునెలలు అవుతున్నా పరిహారం అందలేదని, ప్రభుత్వం ప్రకటించిన విధంగా తక్షణమే ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఇదే చివరి హెచ్చరికని స్పష్టంచేశారు. అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన అవసరమైతే సీఎం ఇంటిని ముట్టడించేందుకు వెనుకాడబోమన్నారు. -
ఆ జీవోలు రద్దు చేయాలి: రామకృష్ణ
అమరావతి: మున్సిపల్ కార్మికుల జీవితాలతో చెలగాటమాడే జీవో నెం. 279, 159, 160 లను తక్షణం రద్దుచేయాలని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ కోరారు. జీవో 151 ప్రకారం కార్మికులకు వేతనాలు పెంచి చెల్లించాలని డిమాండ్ చేశారు. జీవో 193 ప్రకారం స్కూల్ స్వీపర్స్, వాచ్మెన్లకు కూడా వేతనాలు ఇవ్వాలన్నారు. మునిసిపల్ కార్మికులకు మొండిచేయి చూపిస్తున్న ప్రభుత్వం జీవోలు తెచ్చి కాంట్రాక్టర్లకు మేలు చేయాలనుకోవడం తగదన్నారు. తక్షణం కార్మికుల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని కోరారు. -
రూ.530 కోట్ల రుణాల అందజేత
నిడదవోలు, న్యూస్‌లైన్ : జిల్లావ్యాప్తంగా 68 వేల స్వయం సహాయక సంఘాలకు 2013-14లో రూ. 672 కోట్ల వడ్డీలేని రుణాలు అం దించాలని లక్ష్యం కాగా ఇప్పటివరకు సుమారు రూ. 530 కోట్లు అందజేశామని డీఆర్డీఏ పీడీ వై.రామకృష్ణ తెలిపారు. నిడదవోలు డీఆర్డీఏ కార్యాలయంలో నాలుగు మండలాల పరిధిలో నిరుద్యోగులకు మంగళవా రం నిర్వహించిన జాబ్‌మేళాను ఆ యన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మిగిలిన రుణాలను ఈనెలాఖరులోగా అందించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. కొత్త రేషన్‌కార్డులలో తప్పొప్పుల కారణంగా అమ్మహస్తం పథకంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. బంగారుతల్లిలో 5,320 మందికి లబ్ధి జిల్లాలో 7,500 మందికి బంగారు తల్లి పథకాన్ని వర్తింపజేయాలని లక్ష్యం కాగా ఇప్పటివరకు 5,320 మంది చి న్నారులకు నగదు అందించామని తె లిపారు. స్వయం సహాయక సంఘాల బలోపేతానికి కృషిచేస్తున్నామన్నారు. పింఛన్ల పంపిణీకి అదనపు సిబ్బంది వృద్ధాప్య, వితంతు, వికలాంగ పిం ఛన్లు పోస్టల్ శాఖ ద్వారా అందించేందుకు ప్రక్రియ పూర్తయిందని చె ప్పారు. 500 మంది పింఛన్‌దారులు ఉన్న ప్రాంతాల్లో అదనంగా మరో సి బ్బందిని నియమిస్తామన్నారు. జిల్లా లో 3,41,560 మంది పింఛన్‌దారులున్నారని తెలిపారు. 2,964 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు జిల్లావ్యాప్తంగా 72 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా కేవలం 12 కేంద్రాల్లో 2,964 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశామని రామకృష్ణ తెలిపారు. ఈమేరకు రైతులకు రూ. 39 లక్షలు అందజేశామన్నారు. 6 మండలాల్లో ఏపీఎం పోస్టులు, నరసాపురం, ఏలూరులో ఏరియా కో-ఆర్డినేటర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. రాజీవ్ యువకిరణాల పథకంలో భాగంగా ఇప్పటి వరకు 5,900 మందికి వివిధ కేటగిరిలో శిక్షణ ఇవ్వగా 2,800 మందికి ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. జిల్లా జాబ్స్ మేనేజర్ కె.రవీంద్రబాబు, ఏరియా కో-ఆర్డినేటర్ వేణుగోపాల్, ఏపీఎం మేరీరత్నం పాల్గొన్నారు.