‘ఉత్తర్వుల’ రాజకీయం | 'Orders' politics | Sakshi
Sakshi News home page

‘ఉత్తర్వుల’ రాజకీయం

Published Sat, Sep 6 2014 2:00 AM | Last Updated on Wed, Sep 26 2018 5:59 PM

'Orders' politics

- దొంగోడి ఆస్తులకు కాపలాకాస్తారా అంటూ అధికారులు, పోలీసులపై మండిపాటు
- గేటెక్కి లోపలికి వెళ్లేందుకు యత్నించిన రైతులు  
- సీతానగరం తహశీల్దార్ నిర్బంధం
- చెరుకు బకాయిల కోసం ఉద్యమం ఉద్ధృతం చేస్తామన్న రైతు నేతలు
- నేడు నాటుబళ్లతో రహదారుల దిగ్బంధానికి పిలుపు

సాక్షి ప్రతినిధి, విజయనగరం : డీఆర్‌డీఎ పీడీగా పనిచేసిన జ్యోతిని వెనక్కి పంపించేయాలని జూలై 31న అటవీ శాఖాధికారులు రీపేట్రియేట్ ఉత్తర్వులు జారీ చేశారు.  కానీ ఆఉత్వర్వులు అమలు కాలేదు. దీంతో రీపేట్రియేట్ ఉత్తర్వులు నిలి చిపోయాయని అంతా భావించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 22న జ్యోతి ని రిలీవ్ చేయాలని సెర్ఫ్ అధికారులు వేరేగా ఉత్తర్వులు జారీ చేశారు. అదే ఉత్తర్వుల్లో ఇక్కడ అడిషనల్ పీడీగా పనిచేస్తున్న బి.సుధాకర్‌కు ఎఫ్‌ఏసీ ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన 24న బాధ్యతలు స్వీకరించారు. ఆ బాధ్యతలు చేపట్టిన మూడు రోజుల్లోనే ఆయన నియామక ఉత్తర్వులను రద్దు చేసి అదే శాఖలో మరో అడిషనల్ పీడీగా పనిచేస్తున్న పెద్దిరాజుకు అప్పగిస్తూ సెర్ఫ్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
 
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలో వ్యవహారం మరింత రసవత్తరంగా సాగింది. పంచాయతీరాజ్  ఇన్‌ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కె.శ్రీనివాస్‌కుమార్‌ను గతనెల 12న ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి  తొలగిస్తూ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ చీఫ్ సీవీఎస్ రామ్మూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే శ్రీనివాస్ ఈఈ హోదాలో అవుట్ సోర్సింగ్ టెక్నికల్ అసిస్టెంట్ల సర్వీసు పొడిగింపు ఉత్తర్వులపై సంతకాలు చేశారు. అయితే, ఆ ఉత్తర్వులు చెల్లవని, ఈఈ బాధ్యతల్ని విడిచిపెట్టాక వచ్చి పాత తేదీతో సంతకాలు పెట్టారని పేర్కొంటూ ఆయనపై విచారణ చేయడమే కాకుండా టెక్నికల్ అసిస్టెంట్ల పొడిగింపు ఉత్తర్వులను రద్దు చేశారు. ఇదేదో అయ్యిందనుకుంటే తాజాగా అదే డీఈఈ శ్రీనివాస్‌కుమార్‌కు పీఏ టూ ఎస్‌ఈ పోస్టింగ్ ఇస్తూ ఇంజనీరింగ్ చీఫ్ ఉత్తర్వులిచ్చారు. ఆ ఉత్తర్వులొచ్చిన నాలుగు రోజుల్లోనే వాటిని రద్దు చేస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు.  
 
దీన్ని బట్టి ఆ రెండు శాఖల్లో ఎంత గందరగోళం నెలకుందో అర్థం చేసుకోవచ్చు. దేన్ని అనుసరించాలో తెలి యక ఆ శాఖల్లోని ఉద్యోగులు తికమకకు గురయ్యారు.  దీనికంతటికీ సంబంధిత అధికారులో, ఆ శాఖ ఉన్నతాధికారులో కారణమనుకుంటే పప్పులో కాలేసినట్టే. అభిప్రాయ బేధాలతో కత్తులునూరుకుంటున్న టీడీపీ నాయకులే ప్రధాన కారణమని పరిస్థితులు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.  కావల్సిన అధికారులను కొనసాగించాలనో, నచ్చని అధికారులను పంపించాలనో, కాసులకు కక్కుర్తిపడో తెలియదు గాని ఒకరు అవునంటే మరొకరు కాదని లోపాయికారీగా చేస్తున్న యత్నాలతో ఈ పరిస్థితులు దాపురిస్తున్నాయి.
 
డీఆర్‌డీఏ పరిణామాలను తీసుకుంటే పీడీగా పనిచేసిన జ్యోతి... తనకు విలువ ఇవ్వలేదని, తాను నమ్మిన వ్యక్తి సన్నిహిత ఉద్యోగులను ఇబ్బంది పెట్టారన్న ఏకైక కారణంతో సా గనంపేందుకు ఓనేత విశ్వప్రయత్నాలు చేశా రు. జ్యోతి మాతృశాఖలోని ఉన్నతాధికారుల తో ఉన్న సంబంధాలను వినియోగించుకుని రీ పేట్రియేట్ ఉత్తర్వులు జారీ చేయించారు. ఈ నేపథ్యంలో జ్యోతికి ఓ టీడీపీ ఎమ్మెల్యే అండ గా నిలిచారని తెలిసింది. ఆఉత్తర్వులను ఆపేం దుకు ఆ ఎమ్మెల్యే తెగ ప్రయత్నించారు. కానీ ఆమాజీ మంత్రి...తనకే సవాల్ విసురుతారా అని మరింతగా పట్టుబిగించారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దల సాయంతో సెర్ఫ్ అధికారులపై ఒత్తిడి పెంచారు. దీంతో ఎందుకొచ్చిన తల నొప్పి జ్యోతిని రిలీవ్ చేయాలంటూ సెర్ఫ్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మాజీ మంత్రి లక్ష్యం మేరకు జ్యోతిని సాగనంపారు.
 
ఇదంతా ఒక ఎత్తు అయితే పీడీ ఇన్‌ఛార్జ్ బాధ్యతల విషయంలో కూడా రాజకీయం చోటు చేసుకుంది. జ్యోతిని రిలీవ్ చేయాలని జారీ చేసిన ఉత్తర్వుల్లోనే అడిషనల్ పీడీగా పని చేసిన బి.సుధాకర్‌కు ఎఫ్‌ఎసీ బాధ్యతలను అ ప్పగించాలని సెర్ఫ్ అధికారులు పేర్కొన్నారు. అయితే, ఆయన కన్నా మరో సీనియర్ అడిషనల్ పీడీగా ఉన్న పెద్దిరాజును కాదని సుధాకర్ కు ఎలా బాధ్యతలు అప్పగిస్తారని ఓ వర్గం ఫి ర్యాదులకు దిగింది. ఆ వర్గానికి అండగా టీడీపీకి చెందిన కొందరు నేతలు నిలిచారు. తప్పో ఒప్పో పక్కనపెడితే సెర్ఫ్ అధికారులు తన ని ర్ణయాన్ని మార్చుకుని పెద్దిరాజుకు ఎఫ్‌ఏసీ ఇ వ్వాలని  ఉత్తర్వులిచ్చారు. ఏ నిర్ణయమైనా ఆ లోచించి తీసుకోవల్సిన ఉన్నతాధికారులు జి ల్లా నుంచి వచ్చిన ఒత్తిళ్లతో రోజుల వ్యవధిలో నే పాత వాటిని రద్దుచేసి కొత్త ఉత్తర్వులిస్తున్నా రు. దీంతో ఉద్యోగులు  గందరగోళానికి గురవుతున్నారు.
 
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ పరిస్థితి కూడా అంతే. పలువురు టీడీపీ ఎమ్మెల్యేల భరోసాతో డీఈఈ శ్రీనివాస్‌కుమార్ జెడ్పీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణికి సవాల్ విసిరారు. అప్పటికే డీఈఈైపై కన్నెర్రతో ఉన్న కేంద్రమం త్రి అశోక్ గజపతిరాజును ఆశ్రయించి చైర్‌పర్స న్ తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. తొలుత ఈ ఈ బాధ్యతల్ని తొలగించేలా తెరవెనుక పావు లు కదిపిన చైర్‌పర్సన్ ఆనక శ్రీనివాస్‌కుమార్ చేసిన టెక్నికల్ అసిస్టెంట్ల సర్వీసు పొడిగింపు ఉత్తర్వులను వెలుగులోకి తెచ్చి కఠిన చర్యలు తీసుకునేలా పథక రచన చేశారు.

ఎమ్మెల్యేల అండతోనే డీఈఈ ఇష్టారీతిన వ్యవహరిస్తారని చివరికీ అశోక్ దృష్టికి తీసుకెళ్లకలిగారు. దీంతో టెక్నికల్ అసిస్టెంట్ల ఉత్తర్వులను రద్దు చేయించారు. అయితే, అందుకు ప్రతి సవాల్‌గా డీఈ ఈ శ్రీనివాస్‌కుమార్ ఏకంగా పీఏ టూ ఎస్‌ఈ పోస్టింగ్ ఉత్తర్వులను తెప్పించుకోగలిగారు. ఆయనకున్న ఎమ్మెల్యే అండదండలే పై స్థాయి లో సహకరించాయనే వాదనలు విన్పించాయి. దీంతో చిర్రెత్తిపోయిన చైర్‌పర్సన్ తనను ఓవర్ టేక్ చేసి, తనను చిన్నబోయేలా చేసిన డీఈఈ శ్రీనివాస్‌కు వేసిన పీఎ టూ ఎస్‌ఈ ఉత్తర్వులను రద్దు చేయించేలా కేంద్రమంత్రి ద్వారా ఉన్నత స్థాయిలో పావులు కదిపారు. ఆమేరకు రద్దు ఉత్తర్వులొచ్చాయి. ఇదంతా నవ్వులాటగా మారిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement