నిరుద్యోగ యువతకు దరఖాస్తుల ఆహ్వానం | Good news for unemployed youth | Sakshi
Sakshi News home page

నిరుద్యోగ యువతకు దరఖాస్తుల ఆహ్వానం

Published Tue, Nov 29 2016 10:01 PM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM

నిరుద్యోగ యువతకు దరఖాస్తుల ఆహ్వానం

నిరుద్యోగ యువతకు దరఖాస్తుల ఆహ్వానం

రేపల్లె రూరల్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పనా మిషన్, డాక్టర్‌ రెడ్డీస్‌ లాబోరేటరీస్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్, వైజాగ్‌లలో ఉద్యోగులుగా పనిచేసేందుకు గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు డీఆర్‌డీఏ ఏరియా కోఆర్డినేటర్‌ ఎల్‌.వాల్మికి చెప్పారు. స్థానిక కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ 2015, 2016 సంవత్సరాలలో ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీ పూర్తి చేసి కనీసం 60శాతం మార్కుల ఉత్తీర్ణత కలిగి ఉండటంగానీ, ప్రస్తుతం బీఎస్సీ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 18 నుంచి 20 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలన్నారు. సంవత్సరానికి రూ.1,45,000 వేతనం అందిస్తామని పేర్కొన్నారు,  ఆసక్తి కలిగిన యువతీ యువకులు సంబంధిత విద్యార్హత సర్టిఫికెట్ల నకలు, రేషన్‌కార్డు జిరాక్స్, పాస్‌పోర్ట్‌ సైజు ఫోటోలతో గుంటూరు పట్టాభిపురంలోని టీజేపీఎస్‌ కళాశాలలో డిసెంబర్‌ 2వతేదీన నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని చెప్పారు. పూర్తి వివరాలకు 0863 2210757 నంబరును సంప్రదించాలని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement