ఏడవకు తల్లీ | Replied the woman endured injustice | Sakshi
Sakshi News home page

ఏడవకు తల్లీ

Published Fri, Jan 24 2014 3:20 AM | Last Updated on Sat, Sep 2 2017 2:55 AM

Replied the woman endured injustice

ఇంద్రప్రస్థం నడివీధిలో ఓ యువతి అన్యాయానికి గురై ముష్కరుల అకృత్యానికి బలవ్వడంతో పుట్టిన ‘నిర్భయ’ చట్టం ఇంకా మహిళలకు రక్షాకవచం కాలేకపోతోంది. కఠినతరమైన సెక్షన్ల చట్రం ఉన్నా నేరగాళ్ల మైండ్‌సెట్ మారడం లేదు. కేసుల నమోదు వారిని భయపెట్టడం లేదు. మృగాళ్ల దాష్టీకానికి అడ్డుకట్ట పడడం లేదు. ఇందుకు జిల్లాలో సంభవిస్తున్న ఆ తరహా నేరాల పరంపరే సాక్ష్యమిస్తున్నాయి. ఆడపడుచుల కంట కన్నీరు తుడవలేకపోతున్నాయి. దీంతోటే గురువారం అడ్డాకులలో స్థానికులు ‘నిర్భయ’ కేసు పెట్టిన నిందితులను అరెస్టుచేయాలని పోలీసు స్టేషను ఎదుట ఆందోళన చేశారు.
 
 పాలమూరు, న్యూస్‌లైన్ : ఆడపిల్లల పట్ల అనుచితంగా వ్యవహరించే వారిపై చట్టపరంగా ఎన్ని చర్యలు చేపట్టినా.. జరగాల్సిన దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. వారిపై లైంగిక వేధింపుల కు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపట్టేం దుకు ఉద్ధేశించిన ‘నిర్భయ’  అమలులో ఉన్నప్పటికీ మహిళలు, యువతులు, చిన్నారులపై అత్యాచార సంఘటనలు తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి.
 
 ఇలా 2013 జనవరి నెల నుంచి డిసెంబర్ వరకు జిల్లాలో దాదాపు 70 వరకు  కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఈ మధ్య కాలంలో జరుగుతున్న దారుణాలు అందరికీ విస్మయాన్ని కలిగిస్తున్నాయి. పదేళ్లలోపు చిన్నారులపై మైనార్టీ తీరని బాలురు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అత్యాచార బాధితులైన బాలికలు ఈ సంఘటన తర్వాత తీవ్ర మానసిక వేదనకు గురయ్యే ప్రమాదం ఉంది. గత నెల జరిగిన దారుణాలు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే.. అభం శుభం ఎరుగని చిన్నారులపై మైనర్ బాలురు అత్యచారానికి పాల్పడిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.
 
 కల్వకుర్తిలోనూ ఆతర్వాత జిల్లా కేంద్రంలోని హనుమాన్‌పుర కాలనీ సంఘటనల్లోనూ నిందితులు మైనర్లే.., అందరిపైనా నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఫలితంగా వారి విలువైన జీవితం జైలులో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా కేంద్రం లో గత నెల అయిదు రోజుల వ్యవధిలోనే రెండు, మూడు సంఘటనలు చో టుచేసుకున్నాయి. ఈ చట్టం కింద ఎ క్కువ సంఖ్యలో కింద కేసులు నమోదు చేస్తున్నా.. ఎక్కడా ఇలాంటి సంఘటనలకు అడ్డుకట్ట పడటంలేదు. పోలీసులు ఇలాంటి నేరాల పట్ల క ఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ... అస లు ఈ సంఘటనలు జరుగకుండా అ డ్డుకట్ట వేసేందుకు అవగాహన కార్యక్రమాలపై ఏమాత్రం దృష్టి పెట్టడంలేదు.
 
 70వరకు కేసుల నమోదు
 2012 అక్టోబరు నెలలో అమలులోకి వచ్చిన నిర్భయ చట్టం పరిధిలో ఆ ఏడాదిలో పోలీస్ శాఖకు చెందిన నారాయణపేట సబ్ డివిజన్ పరిధిలో 2 కేసులు నమోదయ్యాయి. 2013 జనవరి నుంచి నవంబర్ చివరి వరకు మొత్తం 58 కేసులు నమోదయ్యాయి.
 
 జిల్లాలో చోటుచేసుకున్న
 సంఘటనలు..!
  2013 నవంబర్ 23:  పాన్‌గల్ మండలం గోప్లాపూర్‌లో ఓ మైనర్ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడి కటకటాల పాలయ్యాడు.
 
  డిసెంబర్ 7: కల్వకుర్తి మండలం తుర్కలపల్లి గ్రామానికి చెందిన ఏడేళ్ల చిన్నారిపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. దీనికి 14, 16 ఏళ్లున్న మరో ఇద్దరు బాలురు సహకరించారు. బాలిక తల్లిదండ్రులకు  చెప్పడంతో విషయం బయటపడింది.
 
  డిసెంబర్ 14: జిల్లా కేంద్రంలోని హనుమాన్‌పుర కాలనీకి చెందిన ఆరేళ్ల బాలికపై 14, 16 ఏళ్లలోపు వయసున్న నలుగురు బాలురు అత్యాచారం చేశా రు. వారం రోజులుగా వీరు ఆమెపై అ త్యాచారం చేస్తుండగా.. చివరకు తల్లిదండ్రులు గుర్తించి మొదటి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే విషయం వెలుగులోకి వచ్చింది.
 
  డిసెంబర్ 18 : జిల్లా కేంద్రంలోని బం డ్ల గేరిలో అయిదేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఆ అమ్మాయికి తీవ్ర రక్తస్రావం  కావడం గుర్తించి జిల్లా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువచ్చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు.
  2014 జనవరి 17: పాన్‌గల్ మండలం గుడిసిరెడ్డి పల్లి ఓ యువకుడు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
 జనవరి 18 : అడ్డాకుల మండలంలోని వేముల కొజెంట్ గ్లాస్ కంపెనీలో పనికి వెళ్లిన యువతి పట్ల అక్కడి మేనేజర్ అసభ్యకరంగా ప్రవర్తించిన కారణంగా సద రు మేనేజర్‌పై కేసు నమోదు చేశారు.
 
  నిందితులను వెంటనే అరెస్టు చేయాలి
 అడ్డాకుల, న్యూస్‌లైన్: మండల పరిధిలోని వేముల కొజెంట్ గ్లాస్ కంపెనీకి చెందిన నిర్భయ కేసు నిందితులను వెంటనే అరెస్టు చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ముందు గురువారం ఉదయం బాధిత కుటుంబీకులతో పాటు టీఆర్‌ఎస్ నాయకులు ధర్నా చేశారు. కంపెనీలో పనికి వెళ్లిన యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యూనిట్ ఆఫీసర్ ప్రసన్నకుమార్ శ్రీజిత్‌తో పాటు కంపెనీ మేనేజర్ వైద్యనాథన్, సూపర్‌వైజర్ దామోదర్‌రెడ్డిలపై పోలీసులు ఈనెల 18న నిర్భయ కేసు నమోదు చేశారు. అయితే నిందితులను  అరెస్టు చేయడంలేదని ఆరోపిస్తూ స్టేషన్ ముందు ఆందోళన చేశారు.
 
 గంటకు పైగా స్టేషన్ గేటు ముందు భైఠాయించి  నినాదాలు చేశారు. దీంతో శిక్షణ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, ఏఎస్‌ఐ అబ్దుల్ ఫయాజ్, హెడ్ కానిస్టేబుల్ నర్సింహులు ఆందోళనకారులతో చర్చించినా ఫలితం లేకపోయింది. చివరికి రెండు రోజుల్లో నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు ధర్నాను విరమించారు. ఈ ధర్నాలో నాయకులు నాగార్జున్‌రెడ్డి, మహిమూద్, ఇంద్రయ్యసాగర్, భీమన్నయాదవ్, శ్రీకాంత్, రామన్‌గౌడ్, అరుణ, చెన్నమ్మ, రఘు, దేవేందర్‌రావు, నరేందర్, చల్మారెడ్డి, రాములు, శ్రీశైలం, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement