
సాక్షి, పశ్చిమగోదావరి : గోపాలపురం మండలం కరగ పాడులో దారుణం చోటుచేసుకుంది. అన్నదమ్ముల మధ్య చిన్నపాటి వివాదం హత్యకు దారి తీసింది. కరక పాడు గ్రామానికి చెందిన మద్దాల సుధీర్, సతీష్ అన్నదమ్ములు. ఈ క్రమంలో తమ్ముడు సతీష్ చెడు వ్యసనాలకు బానిసై పని చేసిన సొమ్మును ఇంటి దగ్గర ఇవ్వడం లేదని ఇటీవల అన్న సుధీర్ మందలించాడు. దీంతో అన్నపై కోపం పెంచుకున్న తమ్ముడు సతీష్ ఆదివారం రాత్రి తన స్నేహితుడైన దుర్గాప్రసాద్ సహాయంతో అన్న గొంతుకు ఉరివేసి హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు గోపాలపురం ఎస్సై సుబ్రహ్మణ్యం తెలియజేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment