వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోనే సీమాంధ్ర అభివృద్ధి సాధ్యమని గోపాలపురం నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త తలారి వెంకట్రావు అన్నారు.
గోపాలపురం, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోనే సీమాంధ్ర అభివృద్ధి సాధ్యమని గోపాలపురం నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త తలారి వెంకట్రావు అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అధికారం కోసం ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసగిస్తున్నారని ధ్వజమెత్తారు.
స్థానిక కూసం గాంధీరెడ్డి, లక్ష్మీరాజేశ్వరి భవనం వద్ద బుధవారం కొవ్వూరుపాడుకు చెందిన కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ నేత చిలకా లక్ష్మణస్వామి ఆధ్వర్యంలో భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి తలారి వెంకట్రావు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూటకపు హామీలు ఇస్తున్న టీడీపీని ప్రజలు నమ్మడం లేదన్నారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన అమ్మఒడి, వృద్ధులకు పింఛన్లు, డ్వాక్రా రుణాల రద్దు, రైతులకు ధర ిస్థిరీకరణతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. చిలకా లక్ష్మణస్వామి మాట్లాడుతూ వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం ఉందన్నారు.
అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కొవ్వూరుపాడు ఎంపీటీసీ అభ్యర్థిగా లక్ష్మణస్వామి నామినేషన్ దాఖలు చేశారు. మండల కన్వీనర్ ముల్లంగి శ్రీనివాసరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ఇళ్ల భాస్కరావు, వెలగా శ్రీరామ్మూర్తి, పఠాన్ అన్సర్ బాషా, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు కాండ్రేకుల శ్రీహరి, వడ్లమూడి రాజేంద్రప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.