అమ్మాయిలను ఎరగా వేసి.. | robbers arrested, stolen property recovered | Sakshi
Sakshi News home page

అమ్మాయిలను ఎరగా వేసి..

Published Fri, Apr 28 2017 9:51 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

అమ్మాయిలను ఎరగా వేసి.. - Sakshi

అమ్మాయిలను ఎరగా వేసి..

మారేడుపల్లి: గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌ కు తరలించారు. నార్త్‌ జోన్‌ డీసీపీ సుమతి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బోయిన్‌ పల్లి బాపూజీ నగర్‌ కు చెందిన సంతోష్‌ యాదవ్‌ , క్లాక్‌ టవర్‌ ప్రాంతానికి చెందిన నాగారాజు, కాచిగూడకు చెందిన రంగయ్య ముఠాగా ఏర్పడ్డారు.

వీరు అర్ధరాత్రి వేళల్లో తమ గ్యాంగ్‌లో ఉన్న  అమ్మాయిలను రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో ఫుట్‌పాత్‌లపై నిలబెట్టి యువకులను ఆకర్శించేలా చేస్తారు. తమ వలలో పడిన వారిని తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించావంటూ దాడికి పాల్పడి  వారి  వద్ద ఉన్న డబ్బులు, వస్తువులను లాక్కుని పరారయ్యేవారు. దాడిక సమయంలో ఎవరైనా ఎదురు తిరిగితే నిందితులు తమంతట తామే బ్లేడ్‌తో కొసుకుని భయభ్రాంతులకు గురి చేస్తారు. గత మూడు నెలల్లో గోపాలపురం పోలీస్‌ స్టేసన్‌ పరిధిలో మూడు కేసులు నమోదయ్యాయి.దీనిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. వీరిపై పీడీ యాక్టు నమోదు చేయనున్నట్లు డీసీపీ తెలిపారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement