చూస్తే గుమ్మడి.. చవి చూస్తే బొప్పాయి
రావులపాలెం :
గోపాలపురంలో ఓ బొప్పాయికి చెట్టుకు కాసిన కాయ గుమ్మడికాయ ఆకారంలో ఉండి ఆకట్టుకుంది. గ్రామానికి చెందిన గంగుమళ్ళ లక్ష్మణ్ స్థానికంగా గోదావరి లంకలో బొప్పాయి తోటలు కొనుగోలు చేసి వాటిని విక్రయిస్తుంటారు. రోజూ మాదిరిగానే ఒక చేలో పండిన కాయలను మార్కెట్‌కు తీసుకువెళ్ళేందుకు కోస్తుండగా వాటిలో ఒకటి గుమ్మడికాయ ఆకారంలో కనిపించడంతో ఆశ్చర్యపోయారు. ఈ కాయను చూసిన వారికి తమాషాగా అనిపించింది.
–