Gummadi
-
‘అప్పుడు నాన్న తట్టుకోలేకపోయారు.. బాగా కుంగిపోయారు’
విలక్షణమైన పాత్రలతో తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన అద్భుతమైన నటుల్లో గుమ్మడి వెంకటేశ్వరావు ఒకరు. ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి మెప్పించగల ఆయన తెలుగుతో పాటు తమిళంలోనూ నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ముఖ్యంగా అప్పటి నటీనటులందరికి తండ్రిగా నటించి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. నాన్న పాత్రలు అంటే గుమ్మడి కశ్చితంగా గుర్తొస్తారు. అలాంటిది నిజజీవితంలోనూ పిల్లలను ప్రాణంగా చూసుకునేవారు. అలాంటి ఆయన కళ్లముందే ఒక కూతురు చనిపోవడం తట్టుకోలేకపోయారట. ఈ విషయంపై గుమ్మడి నాలుగో కూతురు శారద ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మేం మొత్తం ఏడుగురు సంతానం. అయితే మా మూడో అక్క 44ఏళ్ల వయసులోనే క్యాన్సర్‌తో చనిపోయింది. తన కళ్లముందే కూతుర్ని అలా చూసి నాన్న చాలా బాధపడ్డారు. మా అక్క మరణం నాన్నను బాగా కుంగదీసింది అంటూ ఆమె పేర్కొంది. కాగా 2010, జనవరి 26న గుమ్మడి వెంకటేశ్వరావు కన్నుమూసిన సంగతి తెలిసిందే. -
చివరి రోజుల్లో ‘మహానటి’ సావిత్రికి సెట్లో అవమానం, అన్నం కూడా పెట్టకుండా..
సావిత్రి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. నటనకే నటనను నేర్పిన సహజ నటి. పాత్రలకే ప్రాణం పోసిన మహానటి ఆమె. అందుకే తరాలు మారిన ఇండస్ట్రీలో సావిత్రి స్థానం సుస్థిరం. తెలుగు సినిమా గురించి చెప్పుకుంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల తర్వాత వినిపించే పేరు సావిత్రిదే. అప్పట్లోనే హీరోలకు ధీటుగా సినిమాలు చేయడమే కాదు, మెగాఫోన్ పట్టి డైరెక్టర్‌గా కూడా మారారు. చలన చిత్ర రంగంలో తనకంటూ చేరగని ముద్ర వేసుకున్న ఆమె నిజ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూశారు. హీరోయిన్గా కోట్ల ప్రజల అభిమానాన్ని పొందిన సావిత్రి చివరికి ఓ అనాథలా కన్నుమూశారు. చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన సుడిగాలి సుధీర్.. ఫుల్ ఖుషిలో ఫ్యాన్స్ అసలు సావిత్రి చివరి రోజుల్లో ఎలా ఉన్నారు, వందల కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న ఆమెకు చివరిలో రోజుల్లో ఓ మూవీ సెట్లో ఎదురైన చేదు అనుభవాన్ని దివంగత నటులు గుమ్మడి గతంలో చెప్పారు. ఆయన తన చివరి రోజుల్లో ఓ చానల్‌తో ముచ్చటించిన ఈ పాత వీడియోలో గుమ్మడి, సావిత్రిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన తీరు పలువురిని కదిలిస్తోంది. ‘‘నేను సావిత్రికి చాలా ఆత్మీయుడ్ని. నన్ను అన్న అని పిలిచేది. సావిత్రి చివరి రోజుల్లో ఆమె పడ్డ కష్టాలను స్వయంగా చూశాను. ఇందులో ఓ చేదు గుర్తు, తీపి గుర్తు రెండూ ఉన్నాయి. నాకు ఓ వారం రోజులు ఆరోగ్యం బాగోలేదు. అవి సావిత్రి చివరి రోజులు. ఆమె నన్ను పలకరించడానికి ఇంటికి వచ్చింది. డాక్టర్ నాకు ఇంజెక్షన్ ఇస్తే మగతగా పడుకుని ఉన్నా. సావిత్రి వచ్చి నన్ను పలకరించింది. నాతో కాసేపు మాట్లాడిన అనంతరం ఆమె వెళుతూ నా తలగడను సర్దినట్లు అనిపించింది. ఏంటా అని దాన్ని తీసి చూస్తే 2 వేల రూపాయలు ఉన్నాయి. ఫోన్ చేసి ఏంటమ్మా డబ్బులు పెట్టావు అని అడిగా.. ‘‘ మీరు మర్చిపోయారేమో అన్నయ్యా.. నేను మీ దగ్గర అప్పుడు 2 వేల రూపాయలు తీసుకున్నా..పోయే లోపల ఎవ్వరికీ దమ్మడి కూడా బాకీ ఉండకూడదు. నాకు 5 వేలు అడ్వాన్స్ వచ్చింది. దాంట్లోంచి ఇస్తున్నా’’ అంది. ఆమె వ్యక్తిత్వం చూసి నా కళ్లు చెమ్మగిల్లాయి’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ఆమెకు హీరోయిన్గా అవకాశాలు తగ్గిపోయిన తర్వాత.. సినిమాలు కూడా తగ్గిపోయాయి. చివరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేయసాగింది. అప్పుడే ఓ సినిమా కోసం ఆమెను తల్లి పాత్రకు తీసుకున్నారు. నేను కూడా ఆ సినిమాలో చేస్తున్నాను. చదవండి: ఫ్లైట్ నుంచి దూకేశా.. కోలుకోడానికి రెండున్నర ఏళ్లు పట్టింది: శర్వానంద్ ఆ సమయంలో అందరికీ ఇంటి దగ్గరి నుంచి భోజనాలు వస్తాయి. మాకు కొందరికి క్యారియర్లు వచ్చాయి. నా క్యారియర్ కూడా వచ్చింది. అప్పుడు సావిత్రి దూరాన ఒక్కతే అలా కూర్చుని ఉంది. సాధారణంగా ఇంటినుంచి క్యారియర్ రాని వాళ్లకు ప్రొడక్షన్ వాళ్లు భోజనం అరెంజ్ చేయాలి. ఆమె క్యారియర్ తెచ్చేవాళ్లు ఎవరు లేరు. నేను తన దగ్గరికి వెళ్లి ‘భోజనం చేయలేదా’ అని అడిగా.ఆకలిగా లేదని చెప్పింది. నాకు అంత అర్థమైంది. ప్రొడక్షన్ వాళ్లు భోజనం పెట్టలేదు. తనకు ఇంటి దగ్గరినుంచి రాలేదు. ‘‘రామ్మా.. భోజనం చేద్దాం’ అన్నా. ‘‘వద్దు’’ అని అంది. ‘‘లేదమ్మా! నువ్వు వస్తే తప్ప నేను కూడా భోజనం చేయను’’ అన్నాను. అప్పుడు ఏడ్చుకుంటూ వచ్చి భోజనం చేసింది’’ అని అన్నారు. అప్పట్లో మా సినిమాలో సావిత్రిగారే కావాలని పట్టుబట్టి మరి ఆమె కాల్షీట్ కోసం ఎదురు చూసేవాళ్లు.. చివరికి తను ఆ పరిస్థితి రాగానే ప్రోడక్షన్ బాయ్స్‌కు కూడా ఆమె చులక అయిపోయిందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
చూస్తే గుమ్మడి.. చవి చూస్తే బొప్పాయి
రావులపాలెం : గోపాలపురంలో ఓ బొప్పాయికి చెట్టుకు కాసిన కాయ గుమ్మడికాయ ఆకారంలో ఉండి ఆకట్టుకుంది. గ్రామానికి చెందిన గంగుమళ్ళ లక్ష్మణ్ స్థానికంగా గోదావరి లంకలో బొప్పాయి తోటలు కొనుగోలు చేసి వాటిని విక్రయిస్తుంటారు. రోజూ మాదిరిగానే ఒక చేలో పండిన కాయలను మార్కెట్‌కు తీసుకువెళ్ళేందుకు కోస్తుండగా వాటిలో ఒకటి గుమ్మడికాయ ఆకారంలో కనిపించడంతో ఆశ్చర్యపోయారు. ఈ కాయను చూసిన వారికి తమాషాగా అనిపించింది. – -
అపురూపం: విజయం వెనుక...
ఎస్వీ రంగారావు... గుమ్మడి... రేలంగి... స్వర్ణయుగపు టాప్ క్లాస్ క్యారెక్టర్ నటులు వీరు! తెలుగువారు గర్వించే కళామూర్తులు! అంతర్జాతీయ బహుమతులు పొందిన నటుడు ఎస్వీ రంగారావుగారైతే... డాక్టరేట్ గౌరవాన్ని పొందిన సహజ నటుడు శ్రీ గుమ్మడి. అలాగే ‘పద్మశ్రీ’ అందుకున్న తొలి హాస్యనటుడు మన రేలంగి! ఇలా అందరూ అందరే! ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీమూర్తి ఉంటుందంటారు పెద్దలు. అలా వీరి విజయం వెనుక వీరి శ్రీమతులున్నారు. ముఖ్యంగా సెలెబ్రిటీలకు ఎన్నెన్నో ఒత్తిడులు ఉంటాయి. ఎంతో బిజీగా ఉంటారు. కుటుంబ బాధ్యతలకు సమయం చిక్కదు. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్రా గగనమే. ఇటువంటి వాతావరణంలో నేర్పుతో, ఓర్పుతో ఇంటిని చక్కదిద్దే ఇల్లాలు ఉంటే తప్ప, వారు గొప్ప లక్ష్యాలను సాధించలేరు. అలాంటి సతీమణులను పొందారు కాబట్టే నటనకు పర్యాయపదంగా ఎదిగారు ఈ మహానటులు! ఆ కృతజ్ఞతను వివిధ సందర్భాలలో ప్రకటించేవారు కూడా. ఎస్వీ రంగారావుగారు తన మేనమామ కుమార్తె అయిన లీలావతిని వివాహం చేసుకున్నారు (1947). గుమ్మడిగారు లక్ష్మీసరస్వతిని (1944), రేలంగిగారు బుచ్చియమ్మను (1933) పరిణయమాడారు. ఆ ఆదర్శ దంపతుల అపురూప ఛాయాచిత్రాలివి. సినిమా వారి వైవాహిక జీవితాలు ఒడిదుడుకుల మయం... కానీ వీరివి ఆనందమయం! కారణం... ఒకరికొకరుగా జీవించారు... తోడు నీడగా సాగారు... సాటివారికి స్ఫూర్తిగా నిలిచారు! అన్యోన్య దాంపత్యం అంటే ఏమిటో చూపారు... తరువాతి తరానికి జీవితమంటే ఇదని తెలిపారు!!