
విలక్షణమైన పాత్రలతో తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన అద్భుతమైన నటుల్లో గుమ్మడి వెంకటేశ్వరావు ఒకరు. ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి మెప్పించగల ఆయన తెలుగుతో పాటు తమిళంలోనూ నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ముఖ్యంగా అప్పటి నటీనటులందరికి తండ్రిగా నటించి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
నాన్న పాత్రలు అంటే గుమ్మడి కశ్చితంగా గుర్తొస్తారు. అలాంటిది నిజజీవితంలోనూ పిల్లలను ప్రాణంగా చూసుకునేవారు. అలాంటి ఆయన కళ్లముందే ఒక కూతురు చనిపోవడం తట్టుకోలేకపోయారట.
ఈ విషయంపై గుమ్మడి నాలుగో కూతురు శారద ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మేం మొత్తం ఏడుగురు సంతానం. అయితే మా మూడో అక్క 44ఏళ్ల వయసులోనే క్యాన్సర్‌తో చనిపోయింది. తన కళ్లముందే కూతుర్ని అలా చూసి నాన్న చాలా బాధపడ్డారు. మా అక్క మరణం నాన్నను బాగా కుంగదీసింది అంటూ ఆమె పేర్కొంది. కాగా 2010, జనవరి 26న గుమ్మడి వెంకటేశ్వరావు కన్నుమూసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment