లారీ ఢీకొని బాలుడికి గాయాలు
గోపాలపురం : లారీ ఢీకొని మూడేళ్ల బాలుడి కాలికి తీవ్ర గాయమైంది. లారీడ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది. స్థానిక దుర్గమ్మ గుడి సమీపంలో ఉంటున్న షేక్ అహ్మద్ తనయుడు మూడేళ్ల సాజిత్ బుదవారం ఇంటి వద్ద ఆడుకుంటూ తల్లిదండ్రులకు తెలియకుండా రోడ్డుమీదకు వచ్చాడు. రోడ్డుపై వెళ్తున్న కంటైనర్ లారీకి అతను అడ్డువచ్చాడు. దీంతో డ్రైవర్ అప్రమత్తమై లారీని చాకచక్యంగా పక్కకుతిప్పాడు. ఈ ఘటనలో బాలుని కాలికి తీవ్రగాయమైంది. ప్రథమ చికిత్స అనంతరం అతడిని రాజమండ్రి తరలించారు. లారీ డ్రైవర్ అప్రమత్తత వల్ల బాలుడికి ప్రాణాపాయం తప్పిందని స్థానికులు చెప్పారు.