పొగాకు బ్యారన్ దగ్ధం
పొగాకు బ్యారన్ దగ్ధం
Published Thu, Mar 30 2017 12:09 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
కొయ్యలగూడెం: కొయ్యలగూడెం మండలం దిప్పకాయలపాడు గొల్లగూడెంలో బుధవారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో వర్జీనియా పొగాకు బ్యారన్ దగ్ధమైంది. బ్యారన్‌తో పాటు పొగాకు అగ్నికి ఆహుతైంది. వివరాలిలా ఉన్నాయి.. కౌలు రైతు బుట్టా చంద్రం అనే రైతుకు చెందిన బ్యారన్ క్యూరింగ్ దశలో ఉండగా, రేషన్‌కర్ర విరిగి పొగ గొట్టంపై పడటంతో ప్రమాదం జరిగింది. దీంతో బ్యారన్‌లో కూరింగ్ చేస్తున్న పొగాకు కొంత మేర కాలిబూడిదైంది. జంగారెడ్డిగూడెం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. సుమారు రూ.లక్షన్నర నష్టం వాటిల్లినట్టు సర్పంచ్ గొడ్డటి రాణి తెలిపారు.
tobbaco byaren burned
Advertisement
Advertisement