తూర్పుగోదావరిజిల్లా రావులపాలెం మండలంలో పోలీసుల తీరుకు నిరసనగా గోపాలపురం గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు.
రావులపాలెం: తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలంలో పోలీసుల తీరుకు నిరసనగా గోపాలపురం గ్రామస్తులు మంగళవారం ఆందోళన నిర్వహించారు. గోగులమ్మ జాతరకు పోలీసులు ఆటంకం కలిగిస్తున్నారంటూ గ్రామస్తులు ఆందోళన చేయగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీనికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆందోళనకు దిగారు. దాంతో ఆయనను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.