సాక్షి, పశ్చిమ గోదావరి : ఏపీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకున్న జాతీయ పార్టీ బీఎస్పీలో రగడ మొదలైంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నేతలు ఏపీలో బీఎస్పీ టికెట్లు అమ్ముకుంటున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కారెం లెనిన్ ఆరోపించారు. స్థానిక కేడర్‌ను సంప్రదించకుండా కొవ్వూరు, గోపాలపురం అభ్యర్థులను ఎంపిక చేశారని ఆదివారం జరిగిన బీఎస్పీ జిల్లా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు ఇచ్చిన వ్యక్తులకు మాత్రమే పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శలు గుప్పించారు. జనసేన ప్రకటించిన అభ్యర్థులకు మద్దతివ్వబోమని, ప్రచారంలోపాల్గొనమని తేల్చిచెప్పారు. ఇదిలాఉండగా.. ‘పార్టీలో కొన్ని ఇబ్బందులు ఎదురవడం మామూలే. నాయకులు సంయమనం పాటించాలి’ అని జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు నేతల రమేష్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment