సాక్షి, విజయవాడ : జనసేన పార్టీ, బీఎస్పీల మధ్య పొత్తు కుదిరింది. ఎస్పీకి మూడు లోక్ సభ, 21 అసెంబ్లీ స్థానాలను కేటాయించామని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. చిత్తూరు, తిరుపతి, బాపట్ల లోక్ సభ నియోజకవర్గాల్లో బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేయబోతున్నారని చెప్పారు. ఈ మూడు చోట్లా తాము అభ్యర్థులను నిలపట్లేదని, బీఎస్పీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తామని ప్రకటించారు.
ఈ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. 2008లోనే బీఎస్పీకి ఏపీ అధ్యక్షుడుగా ఉండాలని తనకు ఆహ్వానం అందింది, కానీ అప్పుడు కుదలేదన్నారు, మళ్లీ ఇన్నాళ్ల తర్వాత బీఎస్పీతో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందన్నారు. మాయావతిని ప్రధానమంత్రిగా చూడాలని కోట్లాడి మంది ఆకాంక్షిస్తున్నారని, అందులో తాను కూడా ఒకడిని అని అన్నారు. 21 అసెంబ్లీ స్థానాలు ఏవనేది ఇంకా తెలియాల్సి ఉంది.
సంబంధిత కథనాలు
ఆమెను ప్రధానిగా చూడాలనేదే నా కోరిక!
జనసేన తొలి జాబితా విడుదల
జనసేనలోకి మాజీ జేడీ లక్ష్మీనారాయణ
Comments
Please login to add a commentAdd a comment