
పశ్చిమ గోదావరి జిల్లా: ఎన్నికల వేళ తెలుగురాష్ట్రాల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఈరోజు ఒక పార్టీలో ఉన్న అభ్యర్థులు మరుసటి రోజు ఏ పార్టీలో ఉంటారో తెలియడం లేదు. ఇటీవలే ఏలూరు రేంజ్ డీఐజీగా పదవీ విరమణ చేసిన రవికుమార్ మూర్తి జనసేన పార్టీలో చేరారు. తన సొంత ప్రాంతమైన తిరుపతి ఎంపీ సీటును జనసేన నుంచి రవికుమార్ ఆశించారు.
తిరుపతి సీటు దక్కకపోవడంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచనతో బీఎస్పీ అభ్యర్గిగా కొవ్వూరుకు మారారు. పొత్తులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సీటును జనసేన బీఎస్పీకి కేటాయించిన సంగతి తెల్సిందే. నిన్నటి వరకు జనసేనలో ఉండి ఒక్క రోజులోనే కండువా మార్చి బీఎస్పీ అభ్యర్థిగా సోమవారం మాజీ డీఐజీ రవికుమార్ మూర్తి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో అవాక్కవడం పార్టీ నేతల వంతైంది.
Comments
Please login to add a commentAdd a comment