లిఫ్ట్లో నెల రోజుల తర్వాత శవమై.. | Chinese woman found dead after month trapped in elevator | Sakshi
Sakshi News home page

లిఫ్ట్లో నెల రోజుల తర్వాత శవమై..

Published Mon, Mar 7 2016 8:33 AM | Last Updated on Sun, Mar 10 2019 8:23 PM

లిఫ్ట్లో నెల రోజుల తర్వాత శవమై.. - Sakshi

లిఫ్ట్లో నెల రోజుల తర్వాత శవమై..

బీజింగ్: చైనాలో దారుణం చోటుచేసుకుంది. ఓ అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం ఒక మహిళ ప్రాణాలు తీసింది. లిఫ్ట్లో ఇరుక్కున్న విషయం సిబ్బంది గుర్తించకపోవడంతో నెల రోజుల తర్వాత ఆమె శవమై తేలింది. జియాన్ నగరంలో జనవరి 30న ఓ మహిళ లిఫ్ట్ ఎక్కింది. అది సరిగ్గా 10 నుంచి 11 అంతస్థుల మధ్యలోకి రాగానే ఆగిపోయింది.

ఆ సమయంలో దానిని తనిఖీ చేయకుండానే మెయింటెన్స్ సిబ్బంది పవర్ ఆపేశారు. అనంతరం వారం రోజులపాటు న్యూఇయర్ వేడుకలకోసం వెళ్లిన వారు తిరిగి మార్చి 1వరకు ఆ లిప్ట్ జోలికి వెళ్లలేదు. దీంతో ఆమె అందులో ప్రాణాలు విడిచింది. లిఫ్ట్ ఓపెన్ చేసి చూడగా ఈ విషయం వెలుగుచూసింది. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement