
కన్నమేస్తే అంతేమరి!
జుహై నగరం: అదో ఎలుక.. ప్రతిరోజు పిల్లిలా శబ్ధం చేయకుండా వచ్చి ధాన్యపు బస్తాలకు కన్నమేసి తినేస్తోంది. దీంతో యజమాని ఉచ్చు బిగించి దాన్ని పట్టుకున్నాడు. అంతటితో సరిపెట్టలేదు. ఆ ఎలుకకి శిక్ష అమలు చేశాడు. ఎవరైనా అదే చేస్తారు. కానీ, అతను కాస్త విచిత్రంగా చేశాడు. చైనాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పట్టుకున్న ఎలుక చేసిన నేరాన్ని దాని మెడలో బోర్డులా తగిలించాడు. ఈ ఫోటోలను నెట్‌లో పోస్టు చేయడంతో నెటిజన్లు దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు.
జుహై నగరంలోని తన కిరాణాదుకాణంలో ఓ ఎలుక ధాన్యపు బస్తాల నుంచి బియ్యం కాజేయడంపై యజమానికి ఆందోళన చెందాడు. తన స్నేహితుడి సాయంతో మొత్తానికి దాన్ని పట్టుకున్నాడు. దాని మెడలో ఓ బోర్డు తగిలించాడు. మొదటి ఫొటోలో ’నన్ను కొట్టిచంపినా.. బియ్యాన్ని దొంగిలించానన్న నిందను మాత్రం ఒప్పుకోను’ అని ఎలుక దృష్టితో యజమానిని తిడుతున్నట్టు రాయగా.. మరో ఫొటోలో ‘ఇలాంటి సాహసం మళ్లీ వదిలిపెట్టండి’ అని వేడుకుంటూ కామెంట్ రాసి పెట్టారు. వినోదాన్ని పంచుతున్న ఈ పోస్టులను చైనీయులు తెగ షేర్ చేసేస్తున్నారు.