ప్రాణాలు పణంగా పెట్టి మరీ ఆ తోడేలుని..: వీడియో వైరల్‌ | Viral Video: Man Risks His Life To Rescue Trapped Wolf | Sakshi
Sakshi News home page

Viral Video: ప్రాణాలు పణంగా పెట్టి మరీ ఆ తోడేలుని..: వీడియో వైరల్‌

Published Wed, May 10 2023 8:51 PM | Last Updated on Wed, May 10 2023 9:16 PM

Viral Video: Man Risks His Life To Rescue Trapped Wolf - Sakshi

ఇంతవరకు ఎన్నో జంతువులను రక్షించిన ఘటనలు చూసి ఉంటాం. కొన్ని క్రూరమృగాలు అనుకోకుండా ఏ ప్రమాదంలోనో చిక్కుకుంటే.. రక్షించేందుకు అంతతేలికగా ఎవరూ ముందుకు రాలేరు. ఎందుకంటే వాటిని రక్షించేలోపే మనకు హాని చేసే అవకాశం లేకపోదు కాబట్టి. ఐతే ఇక్కడొక వ్యక్తి మాత్రం అవేమి పట్టించుకోకుండా ఓ తోడేలు కోసం ప్రాణాలు పణంగా పెట్టి మరీ రక్షించేందుకు రెడీ అయ్యాడు.

అందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఆ వీడియోలో ఒక చోట తోడేలు కాలుకి ఏదో రాడ్‌లాంటి దానిలో రెండు కాళ్లు ఇరుకుపోయాయి. పాపం అది కదిలేందుకు లేక అలా ఉండిపోయింది. సడెన్‌ ఓ వ్యక్తి వచ్చి దాన్ని చాలా తెలిగా చిన్న కర్రతో ట్రాప్‌ చేస్తూ.. ఓ పక్క నుంచి దాన్ని కాపాడే యత్నం చేశాడు. ఆ తర్వాత అది బతుకు జీవుడా అంటూ అడవిలోకి పారిపోతున్నట్లు వీడియోలో కనిపించింది. దీంతో నెటిజన్లు అతను చాలా ధైర్యవంతుడు అని ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు.

(చదవండి:  నడిరోడ్డుపై కారుని ఆపి దౌర్జన్యం: వీడియో వైరల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement