సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాలపై పోలీసులు ఎంత ప్రచారం చేసినా కొందరిలో మార్పు రావటం లేదు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశ, చిన్న మొత్తంలో పొదుపు చేస్తే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని వాట్సాప్‌లలో లింకులు పంపిస్తూ సైబర్ నేరస్తులు అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. సైబర్ నేరస్తుల చేతిలో చిక్కి డబ్బులు పోగొట్టుకుంటున్న వాటిలో ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ కేసులే అధికంగా ఉంటున్నాయి.
నేరస్తులు ఇతర రాష్ట్రీయులే..
రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల నుంచి ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బహుళ జాతి కంపెనీల్లో పనిచేస్తున్న ఐటీ నిపుణులు, బ్యాంకింగ్ రంగం ఉద్యోగులు సైతం గ్రామీణ ప్రాంతాల్లో పదో తరగతి కూడా పాస్‌కాని సైబర్ మాయగాళ్ల వలలో పడి మోసపోతున్నారు. ఇప్పుడు పెట్టుబడితో వారంలో డబుల్, త్రిబుల్ అవుతుందని చెప్పగానే నమ్మి మోసపోతున్నారు. సైబర్ బాధితుల్లో 60 శాతానికి పైగా ఐటీ ఉద్యోగులు ఉండటమే ఇందుకు నిదర్శనం.
200 శాతం పెరిగిన మోసాలు..
ఇతర సైబర్ నేరాలతో పోలిస్తే ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్ 200 శాతం మేర పెరిగాయని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు అధికారి తెలిపారు. వ్యక్తిగత సమాచారాన్ని గుర్తు తెలియని వ్యక్తులకు ఇవ్వడమే మోసాలకు ప్రధాన కారణం. ఉద్యోగిణులు, ఐటీ ఉద్యోగులు, పెన్షన్‌దారులు కూడా నేరస్తులో వలలో పడిపోతున్నారు. వర్చువల్‌గా లాభాలు వచి్చనట్లు చూపించి, రూ.5 లక్షల నుంచి కోటి వరకు పెట్టుబడి పెట్టిస్తున్నారు. ఆ తర్వాత కాంటాక్ట్ కట్ చేస్తున్నారని వివరించారు. యాప్‌లలో పెట్టుబడితో లక్షల లాభం వచి్చనట్లు ఫోన్‌లో కనిపించినా అవి బ్యాంక్ ఖాతాలో జమ కావని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
(చదవండి: పండుగ ముగిసింది.. తిరుగు పయనం)
Comments
Please login to add a commentAdd a comment