Greedy
-
కొంప ముంచుతున్న అత్యాశ
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాలపై పోలీసులు ఎంత ప్రచారం చేసినా కొందరిలో మార్పు రావటం లేదు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశ, చిన్న మొత్తంలో పొదుపు చేస్తే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని వాట్సాప్‌లలో లింకులు పంపిస్తూ సైబర్ నేరస్తులు అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. సైబర్ నేరస్తుల చేతిలో చిక్కి డబ్బులు పోగొట్టుకుంటున్న వాటిలో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులే అధికంగా ఉంటున్నాయి. నేరస్తులు ఇతర రాష్ట్రీయులే.. రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల నుంచి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బహుళ జాతి కంపెనీల్లో పనిచేస్తున్న ఐటీ నిపుణులు, బ్యాంకింగ్ రంగం ఉద్యోగులు సైతం గ్రామీణ ప్రాంతాల్లో పదో తరగతి కూడా పాస్‌కాని సైబర్ మాయగాళ్ల వలలో పడి మోసపోతున్నారు. ఇప్పుడు పెట్టుబడితో వారంలో డబుల్, త్రిబుల్ అవుతుందని చెప్పగానే నమ్మి మోసపోతున్నారు. సైబర్ బాధితుల్లో 60 శాతానికి పైగా ఐటీ ఉద్యోగులు ఉండటమే ఇందుకు నిదర్శనం. 200 శాతం పెరిగిన మోసాలు.. ఇతర సైబర్ నేరాలతో పోలిస్తే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ 200 శాతం మేర పెరిగాయని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు అధికారి తెలిపారు. వ్యక్తిగత సమాచారాన్ని గుర్తు తెలియని వ్యక్తులకు ఇవ్వడమే మోసాలకు ప్రధాన కారణం. ఉద్యోగిణులు, ఐటీ ఉద్యోగులు, పెన్షన్‌దారులు కూడా నేరస్తులో వలలో పడిపోతున్నారు. వర్చువల్‌గా లాభాలు వచి్చనట్లు చూపించి, రూ.5 లక్షల నుంచి కోటి వరకు పెట్టుబడి పెట్టిస్తున్నారు. ఆ తర్వాత కాంటాక్ట్ కట్ చేస్తున్నారని వివరించారు. యాప్‌లలో పెట్టుబడితో లక్షల లాభం వచి్చనట్లు ఫోన్లో కనిపించినా అవి బ్యాంక్ ఖాతాలో జమ కావని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. (చదవండి: పండుగ ముగిసింది.. తిరుగు పయనం) -
అత్యాశ పడ్డారా... అంతే సంగతులు!
ఆత్మీయం జజీవితంలో మనం అనేకరకాలైన కోరికలను కోరుకోవడం, అది కావాలి, ఇది కావాలి అని ఆశపడటం, చివరకు అవి లభించకపోతే నిరాశకు లోనవడం చాలామందికి ఎదురయ్యే అనుభవమే. అయితే బతికినంతకాలం సుఖంగా జీవించాలంటే నిరాశను జయించడం నేర్చుకోవలసిందే. దానికి ముందు అసలు మనం ఏమి కోరికలు కోరుకుంటున్నాం? అవి తీరగలిగేవా కావా? మనం దేనిని ఆశిస్తున్నాం? అది మనకు సాధ్యమయ్యేదా కాదా? అని ఆలోచించాలి, పగటికలలు కనడం మాని ప్రాక్టికల్‌గా ఉండటం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మనం నిరాశకు లోను కాకుండా ఉండటం తగ్గుతుంది. ఉదాహరణకు మండుటెడారిలో గులాబీలు గుబాళించాలని కోరుకోవడం, పళ్లు గిట్టకరిచే చలికాలంలో మామిడిపళ్లు తినాలని తహతహలాడటం, చిన్నపాటి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటున్నవాడు ఒక్కసారిగా నగరం నడిబొడ్డున అతి ఖరీదైన ప్రాంతంలో డ్యూప్లెక్ హౌస్‌లోకి మారాలనుకోవడం అలాంటివన్నమాట. వీటినే ఓ శతక కారుడు ఇసుకనుంచి తైలాన్ని తియ్యాలనుకోవడంతో పోల్చి చెప్పాడు. అటువంటి దుస్సాధ్యమైన కోరికలను, ఆలోచనలను మనసులోకి రానివ్వనే కూడదు. అయితే ఆశ అనేదే లేకపోతే... కోరికలేమీ కోరుకోకపోతే... అటువంటి స్థితి మామూలు మనుషులకు అసాధ్యం. అందువల్ల నిరాశను మనం ఉన్నతస్థానానికి ఎదగడానికి భగవంతుడిచ్చిన సదవకాశంగా భావించి, దానినే ఆయుధంగా మలుచుకోవాలి. ఆశకు, అత్యాశకు మధ్య తేడాను తెలుసుకోవాలి. ఆశపడటం తప్పు కాదు కానీ, అత్యాశ ఉంటే మాత్రం ముందుగా నిరాశకు లోనవడం, ఆ తర్వాత కుంగుబాటు అంటే డిప్రెషన్లు... ఆ తర్వాత హాస్పిటళ్ల చుట్టూ తిరగడం తప్పదు. -
అవార్డుల కోసం అత్యాశ పడొదు
భారత క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ కోల్‌కతా: ఏ క్రీడాకారుడైనా తమ ప్రదర్శన ద్వారానే గుర్తింపు తెచ్చుకోవాలి కానీ అవార్డుల కోసం అత్యాశ పడకూడదని స్నూకర్ అండ్ బిలియర్డ్స్ ఆటగాడు పంకజ్ అద్వానీ అభిప్రాయపడ్డాడు. ‘నేనెన్నటికీ అవార్డులు ఇవ్వాలని బయటికెళ్లి నిరసన వ్యక్తం చేయను. వాటిని సాధించాలి కానీ వెంపర్లాడకూడదు. నేను కూడా దరఖాస్తు చేసుకున్నాను. అయితే నేను అర్హుడిని కాదని ప్రభుత్వం అనుకుంటే నాకేమీ దిగులు లేదు. గుర్తింపును మనం డిమాండ్ చేయకూడదు. ఇక్కడ మనముంది దేశం తరఫున పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచేందుకు. ఏ ఆటలోనైనా ప్రతిభ చాటుకుంటే ఏదో ఒక రోజు గుర్తింపు దానంతటదే వస్తుంది. అయితే ఇటీవలి పరిణామాల నేపథ్యంలో పద్మ అవార్డు విశ్వసనీయత ఏమీ తగ్గలేదు. కొద్ది మంది బహిరంగంగా తమ ఆక్రోషాన్ని వెల్లడించినంత మాత్రాన వీటి గుర్తింపుకొచ్చిన ప్రమాదమేమీ లేదు. ఇక సైనా ప్రతిఘటనపై కామెంట్ చేయలేను కానీ వ్యక్తిగతంగా నేను అలాంటి చేష్టలకు మాత్రం దిగను’ అని అద్వానీ స్పష్టం చేశాడు. -
ఫేస్బుక్లో పరిచయం కొంపముంచింది
అత్యాశ కొంపముంచింది ఫేస్బుక్లో పరిచయం డైమండ్ నగలు పంపుతున్నానని ఎర కస్టమ్స్ టాక్స్ పేరిట రూ. 8 లక్షకు ఎసరు పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు బంజారాహిల్స్: అత్యాశ కొంపముంచింది.. ఫేస్బుక్లో పరిచయమైన అగంతకుడు వజ్రాల ఆభరణాలు పంపుతున్నానని ఉపాధ్యాయురాలికి రూ. 8 లక్షలకు మోసం చేశాడు. జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. రహ్మత్‌నగర్‌కు చెందిన ప్రైవేట్ స్కూల్ టీచర్‌కు లండన్‌లో ఉండే జాన్సన్ హెన్రీ అనే వ్యక్తితో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. నెల రోజుల పాటు ఇద్దరూ చాటింగ్ చేసుకున్నారు. ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. క్రిస్మస్ పండగకు డైమండ్ ఆభరణాలతో పాటు 250 లక్షల పౌండ్లు పంపుతున్నానని హెన్రీ ఆమెకు చెప్పాడు. ఈనెల 8న సదరు టీచర్‌కు న్యూఢిల్లీలోని కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నానని ఓ మహిళ కాల్ చేసింది. మీకు ఇంగ్లాండ్ నుంచి 250 లక్షల పౌండ్లతో పాటు బంగారు వజ్ర వైడూర్యాల బహుమతిగా వచ్చాయని చెప్పింది. అయితే కస్టమ్స్ చార్జీల కింద రూ. 68 వేలు చెల్లించాలని చెప్పింది. వెంటనే టీచర్ ఆమె చెప్పిన అకౌంట్లో డబ్బులు వేసింది. మరో రెండు గంటల తర్వాత అదే మహిళ మళ్లీ ఫోన్ చేసి కమర్షియల్ ట్యాక్స్ కింద రూ. 1.20 లక్షలు వెంటనే చెల్లించాలని చెప్పగా.. ఆ మొత్తాన్ని కూడా టీచర్ ఆమె అకౌంట్ లో వేసింది. కొద్దిసేపటి తర్వాత కస్టమ్స్ అధికారిణి పేరుతో మళ్లీ ఆమెకు ఫోన్ చేసి పార్శిల్ స్కానింగ్‌లో రూ. 7 లక్షలు డబ్బులున్నట్లు గుర్తించామని, ఆ మొత్తాన్ని కూడా వేయాలని కోరింది. వెంటనే టీచర్ తన ఇంటి యజమానుల వద్ద రూ. 7 లక్షలు అప్పు తీసుకొని, ఇందుకు ప్రతిఫలంగా తనకు డబ్బులురాగానే రూ.20 లక్షలు ఇస్తానని చెప్పింది. ఆ మేరకు రూ. 7 లక్షలను వివిధ బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఢిల్లీ నుంచి తనకు ఫోన్ చేసిన మహిళ చెప్పిన అకౌంట్లలో వేసింది. బహుమతి ఒక గంటసేపట్లో వస్తుందని నమ్మించిన ఆమె తిరిగి ఫోన్ చేసి సర్వీస్ బాయ్ అందుబాటులో లేడని, మరుసటి రోజు పంపిస్తానని చెప్పింది. నమ్మిన టీచర్ మరుసటి రోజు చెప్పిన సమయానికి బహుమతి రాకపోవడంతో ఆ అధికారిణికి మళ్లీ ఫోన్ చేసింది. మరో రూ. 5 లక్షలు వేస్తేగాని బహుమతి పంపడం కుదరదని ఆమె చెప్పడంతో టీచర్ తన స్నేహితుడు హెన్రీని సంప్రదించగా.. తాను మరుసటి రోజు న్యూఢిల్లీ వస్తున్నానని ఆందోళన చెందవద్దని చెప్పాడు. ఆ తెల్లవారే హెన్రీ ఆమెకు ఫోన్ చేసి తాను ఢిల్లీకి వచ్చానని, సదరు అధికారిణితో మాట్లాడగా రూ. 5 లక్షలు డిమాండ్ చేసిందని, ఆ మొత్తాన్ని తప్పకుండా పంపించాలని కోరాడు. ఇంటి యజమానికి చెల్లించాల్సిన రూ. 20 లక్షలు తనకు అకౌంట్ నంబర్ ఇస్తే వేస్తానని నమ్మించాడు. తాను ఇక్కడ అకౌంట్ తెరవడానికి రూ. 20 వేలు ఇవ్వాలని కూడా డిమాండ్చేశాడు. దీంతో అనుమానం వచ్చిన రోజారాణి జూబ్లీహిల్స్ పోలీసులకు శుక్రవారం ఉదయం ఫిర్యాదు చేసింది. పోలీసులు ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.