
‘‘ట్రాప్’ సినిమా ట్రైలర్ చూడగానే తెలుగు ప్రేక్షకులందర్నీ ట్రాప్‌లో పడేస్తుందనిపించింది’’ అని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మహేందర్ ఎప్పలపల్లి, కాత్యాయనీ శర్మ జంటగా బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో వీఎస్ ఫణీంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ట్రాప్’. స్వర్ణలత నిర్మించారు. ప్రేమ కవితాలయ పతాకం లోగోను నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ‘ట్రాప్’ లోగోను నిర్మాత సురేష్ చౌదరి, టీజర్‌ను రచయిత మోహన్ వడపట్ల, ట్రైలర్‌ని బాలకిషన్ విడుదల చేశారు. ‘‘హీరో, హీరోయిన్‌తో పాటు సాంకేతిక నిపుణులందరూ మంచి సపోర్ట్ అందించారు’’ అన్నారు స్వర్ణలత. ‘‘క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు విఎస్ ఫణీంద్ర. కాత్యాయనీ శర్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment