mla rasamai balakishan
-
Rudrangi trailer: నేను ఎరేసి వేటాడతా
జగపతిబాబు, మమతా మోహన్ దాస్, విమలా రామన్, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, ‘బాహుబలి’ ప్రభాకర్, ఆర్ఎస్ నంద ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ చిత్రాలకు డైలాగ్స్ రాసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ సినిమా జూలై 7న విడుదలకానుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని యూనిట్ విడుదల చేసింది. తెలంగాణ చారిత్రక నేపథ్య కథతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో భీమ్ రావ్ దొరగా జగపతిబాబు, జ్వాలా భాయిగా మమతా మోహన్ దాస్, మల్లేష్‌గా ఆశిష్ గాంధీ నటించారు. ‘ఒకడు ఎదురుపడి వేటాడతాడు.. ఒకడు వెంటపడి వేటాడతాడు.. నేను ఎరేసి వేటాడతా’ అంటూ జగపతిబాబు చెప్పే డైలాగ్స్‌తో ట్రైలర్ సాగుతుంది. ఈ చిత్రానికి కెమెరా: సంతోష్ శనమోని, సంగీతం: నాఫల్ రాజా. -
ట్రాప్‌లో పడేస్తారు
‘‘ట్రాప్’ సినిమా ట్రైలర్ చూడగానే తెలుగు ప్రేక్షకులందర్నీ ట్రాప్‌లో పడేస్తుందనిపించింది’’ అని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మహేందర్ ఎప్పలపల్లి, కాత్యాయనీ శర్మ జంటగా బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో వీఎస్ ఫణీంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ట్రాప్’. స్వర్ణలత నిర్మించారు. ప్రేమ కవితాలయ పతాకం లోగోను నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ‘ట్రాప్’ లోగోను నిర్మాత సురేష్ చౌదరి, టీజర్‌ను రచయిత మోహన్ వడపట్ల, ట్రైలర్‌ని బాలకిషన్ విడుదల చేశారు. ‘‘హీరో, హీరోయిన్‌తో పాటు సాంకేతిక నిపుణులందరూ మంచి సపోర్ట్ అందించారు’’ అన్నారు స్వర్ణలత. ‘‘క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు విఎస్ ఫణీంద్ర. కాత్యాయనీ శర్మ పాల్గొన్నారు. -
రసమయికి కేబినెట్ హోదా
హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక శాఖ సారథి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గురువారం దీనికి సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు. త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.