Jagapathi Babu Periodic Drama Movie Rudrangi Trailer Launch, Deets Inside - Sakshi
Sakshi News home page

Rudrangi trailer: నేను ఎరేసి వేటాడతా

Published Tue, Jun 27 2023 1:59 AM | Last Updated on Tue, Jun 27 2023 10:45 AM

Jagapathi Babu Rudrangi trailer Launch - Sakshi

జగపతిబాబు, మమతా మోహన్‌ దాస్, విమలా రామన్, ఆశిష్‌ గాంధీ, గానవి లక్ష్మణ్, ‘బాహుబలి’ ప్రభాకర్, ఆర్‌ఎస్‌ నంద ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. ‘బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాలకు డైలాగ్స్‌ రాసిన అజయ్‌ సామ్రాట్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ నిర్మించిన ఈ సినిమా జూలై 7న విడుదలకానుంది.

తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని యూనిట్‌ విడుదల చేసింది. తెలంగాణ చారిత్రక నేపథ్య కథతో పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో భీమ్‌ రావ్‌ దొరగా జగపతిబాబు, జ్వాలా భాయిగా మమతా మోహన్‌ దాస్, మల్లేష్‌గా ఆశిష్‌ గాంధీ నటించారు. ‘ఒకడు ఎదురుపడి వేటాడతాడు.. ఒకడు వెంటపడి వేటాడతాడు.. నేను ఎరేసి వేటాడతా’ అంటూ జగపతిబాబు చెప్పే డైలాగ్స్‌తో ట్రైలర్‌ సాగుతుంది. ఈ చిత్రానికి కెమెరా: సంతోష్‌ శనమోని, సంగీతం: నాఫల్‌ రాజా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement