సాక్షి,హైదరాబాద్: శతకోటి అపాయాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు మనిషి తనకెదురయ్యే అపాయాలకు, కష్టాలకు మార్గాలను అన్వేషిస్తూనే ఉంటాడు. తనకున్న పరిధిలో ఎప్పటికపుడు అనేక ఉపాయాలను కనుక్కుంటూనే ఉంటాడు. ఇదొక నిరంతర ప్రక్రియ. ఆ అన్వేషణ, తపనే అనేక నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది. తాజాగా అలాంటి వీడియో ఒకటి ఆసక్తిని రేపుతోంది.
కాకులు, ఇతర పక్షుల బెడదనుంచి తన పొలాన్ని తప్పించుకునేందుకు ఒక రైతు చేసిన ప్రయోగం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. స్ప్రింగ్ ద్వారా ఒక బొమ్మను నిరంతరం కదులుతూ ఉండేలా, పక్షులను అదిలిస్తున్నట్టుగా ఏర్పాటు చేశాడు. ఇది చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు. అంతేకాదు కాకులేమోగానీ, మనుషులకు మాత్రం హార్ట్ ఎటాక్ రావడం గ్యారంటీ అంటూ చమత్కరిస్తున్నారు.
కాగా సాధారణంగా పొలంలో పశువులు, ఇతర పక్షులనుంచి పంటను రక్షించుకునేందుకు దిష్టిబొమ్మలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. పంట చేతికొచ్చే సమయానికి పక్షులు, పశువులు తినకుండా, నరదిష్టి తగులకుండా పంట చేలల్లో రకరకాల దిష్టిబొమ్మలు పెడుతుంటారు. ఈ క్రమంలో ఇటీవల టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్లు పోటోలు పొలంలో దిష్టి బొమ్మలుగా పెట్టుకున్న వైనం విచిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే.
O bhai saheb...did Ramsay brothers create this one??! crows ka toh nahi pata, insano ka heart attack guaranteed. https://t.co/sVFpd4bxo6
— Smita Sharma (@Smita_Sharma) July 12, 2021
Comments
Please login to add a commentAdd a comment