న్యూఢిల్లీ: మనుషులను ఆశ్చర్యపరిచే జంతువులు, పక్షుల వీడియోలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ట్విటర్‌లో షేర్ చేసిన చిన్న చిన్న పక్షుల వీడియో నెటిజన్‌లను వీపరీతంగా ఆకట్టుకుంటోంది. పచ్చ, పసుపు రంగుల్లో ఉన్న పక్షులు రెండు టీంలు విడిపోయి పోటీ పోటీగా వాలిబాల్ ఆడుతున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటా చక్కర్లు కొడుతోంది. దీనికి ‘ప్రపంచవ్యాప్తంగా క్రీడలు రద్దయ్యాయి.. కానీ ఈ బార్డీబాల్ మాత్రం కాదు’ అనే ఫన్ని క్యాప్సన్‌తో షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటి వరకు వేలల్లో వ్యూస్ వందల్లో కామెంట్స్ వచ్చాయి. ఈ గ్రీన్ అండ్ ఎల్లో టీమ్‌లో ఎవరూ గెలుస్తారు అని అడిగిన ప్రశ్నకు నెటిజన్‌లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. (చదవండి: యజమానికి పెంపుడు పిల్లి వింత బహుమతి)
Sports are mainly cancelled... but some Birdyball will do! 🤣👍 pic.twitter.com/zBgwGM8nlX
— Madeyousmile (@Thund3rB0lt) October 18, 2020
‘రెండు టీమ్‌లు గెలుస్తాయి’, ‘గ్రీన్ టీమ్ చీటింగ్ చేస్తుంది’, ‘ఈ పక్షులు ఎంత ముద్దుగా ఉన్నాయో. వాటిని మా ఇంటికి తీసుకువెళ్లాలని ఉంది’ అంటూ నెటిజన్‌లు కామెంట్స్ పెడుతున్నారు. 11 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఈ పక్షులు ఎల్లో, గ్రీన్ టీమ్‌లుగా విడిపోయాయి. ఈ రెండు టీమ్‌ల పక్షులు ముక్కుతో బాల్‌ను కరుచుకుని ఆటు ఇటూ నెట్‌పై నుంచి తోస్తున్నాయి. ఎల్లో పక్షి బాల్‌ను గ్రీన్ పక్షుల వైపు వేస్తుంటే ఓ గ్రీన్ పక్షి ఎల్లో పక్షివైపే నెడుతూ చీటింగ్ చేస్తుంది. (చదవండి: 516కు పైగా ఆపరేషన్స్.. అయినా కానీ..)
Comments
Please login to add a commentAdd a comment