volleyball
-
విన్ వీధిలో మెరిసినా... పాదాలు నేల మీదే
చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా సరే... ఆత్మస్థైర్యంతో ఆకాశంకేసి చూడాలి. పెద్ద కలలు కనాలి. కష్టపడి సాధించాలి. కల నెరవేరిన తరువాత ఆకాశంలో ఉండిపోకూడదు. మన పాదాలెప్పుడూ నేల మీదే ఉండాలి. మన దేశంలోని జులేఖ, చైనా దేశానికి చెందిన యకిన్ ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు...పేవ్మెంట్ నుంచి ఒలింపిక్స్ వరకుపేవ్మెంట్ల దగ్గర భిక్షాటన చేసిన అమ్మాయి ఆ తరువాత కాలంలో ఒలింపిక్స్‌లో పాల్గొనే స్థాయికి చేరుకుంది. ఇది సినిమా కథ కాదు. నిజ జీవిత కథ. ముంబైకి చెందిన జులేఖ కథ. అనాథాశ్రమంలో పెరిగిన జులేఖ వాలీబాల్ ఆటలో ్రపావీణ్యం సంపాదించింది. ఆ ఆట ఆమెను అబుదాబి స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్‌లో పాల్గొనేలా చేసింది.మంచం మీద పడుకోవడం ‘లగ్జరీ’ విషయమేమీ కాదు. జులేఖ షేక్‌కు మాత్రం లగ్జరీనే! పదహారు సంవత్సరాల క్రితం శుక్రాపూర్ హైవేపై ఎనిమిదేళ్ల జులేఖా షేక్ కాలికి గాయమై పడి ఉండడాన్ని పోలీసులు గమనించి చికిత్స కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆ ఆసుపత్రిలో జులేఖ ఫ్యాన్ కింద బెడ్‌పై పడుకుంది.ఇది తనకు సరికొత్త అనుభవం. కటిక నేల మీద తప్ప ఆమె ఎప్పుడూ బెడ్ మీద పడుకోలేదు. భిక్షాటన చేయడం, ఏదో ఒకటి తిని కడుపు నింపుకోవడం, రాత్రి పడుకోవడానికి స్థలం వెదుక్కోవడం... స్థూలంగా ఇది తన జీవితం. ఆసుపత్రి నుంచి బయటికి వచ్చిన తరువాత జులేఖను ఒక అనాథాశ్రమంలో చేర్పించారు పోలీసులు. అలా ఆమెకు అనికేత్ సేవాభవి సంస్థ నిర్వాహకురాలు కల్పన వర్పే పరిచయ భాగ్యం కలిగింది. ఆ తరువాత జులేఖ జీవితమే మారిపోయింది.కట్ చేస్తే... అబుదాబి 2019 స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్‌లో వాలీబాల్‌లో మన దేశానికి ్రపాతినిధ్యం వహించడమే కాదు కాంస్య పతకం గెలుచుకుంది. ఇప్పుడు ఆ పతకం తనకు పతకం మాత్రమే కాదు... కొత్త జీవితం... కొత్త శక్తి! ఈ పతకం గురించి అడిగిన వారికి, అడగని వారికి అందరికీ చూపిస్తూ ఎంతోసేపు సంతోషంగా మాట్లాడుతుంది జులేఖ.గతంలోకి వెళితే...గ్రౌండ్లో అబ్బాయిలు వాలీబాల్ అడుతున్నారు. ‘సర్, నేను ఆడవచ్చా’ అని స్పోర్ట్స్ టీచర్ అశోక్ రామచంద్రన్ నాంగ్రాను అడిగింది జులేఖ. ‘కుదరదు’ అని ఆయన అని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఆయన పచ్చ జెండా ఊపడంతో గ్రౌండ్లోకి అడుగుపెట్టింది. రోజులు గడుస్తున్న కొద్దీ అబ్బాయిలతో సమానంగా, వారిని మించి వాలీబాల్ ఆడడం మొదలుపెట్టింది. ఆ ప్రతిభ తనని రాష్ట్ర, అంతర్రాష్ట్ర స్థాయిలో ఎన్నో గేమ్స్ ఆడేలా చేసింది. అబుదాబి ఒలింపిక్స్ కోసం తొలిసారి విమానం ఎక్కడం జులేఖ జీవితంలో మరచిపోలేని మధురమైన అనుభవం.‘బాల్యంలో ఎన్నో కష్టాలు పడి ఉండడం వల్ల మొదట్లో చాలా హైపర్‌గా కనిపించేది. ఆలోచనలు స్థిరంగా ఉండేవి కాదు. ఆ తరువాత ఆమెలో ఎంతో మార్పు వచ్చింది. ఏదైనా సాధించి తనను తాను నిరూపించుకోవాలనే పట్టుదల పెరిగింది’ అంటుంది జులేఖ గురించి కల్పనా వర్పే. ‘రాత్రి పడుకోవడానికి చోటు వెదుక్కోవడం ఒకప్పుడు కష్టంగా ఉండేది. అనాథాశ్రమంలో చేరిన తరువాత ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఉన్నట్లే ఉండేది. ఎన్నో పద్ధతులు నేర్చుకున్నాను. సెలవుల్లో అమ్మడానికి మట్టి ప్రమిదల నుంచి గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేయడం వరకు ఎన్నో చేశాను’ అని గతాన్ని గుర్తు చేసుకుంది జులేఖ. కొత్త జీవితాన్ని ఇచ్చిన అనికేత్ సేవాభవి సంస్థకు తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకుంది.‘ఇక్కడి వారి పట్ల ఆమె చూపుతున్న శ్రద్ధ, ప్రేమ అపురూపంగా అనిపిస్తుంది. చుట్టుపక్కల నుంచి వచ్చిన వారికి వేడి వేడి చాయి చేసి ఇస్తుంది. వారికి ధైర్యం చెబుతుంటుంది’ అని జులేఖ గురించి ప్రశంసాపూర్వకంగా చెబుతుంది కల్పనా వర్పే. ఒకప్పటి జులేఖలాంటి అమ్మాయిలు ఇప్పుడు కూడా ఫుట్‌పాత్‌ల మీద కఠినమైన జీవితాన్ని గడుపుతూ ఉండవచ్చు. అలాంటి వారికి కొత్త జీవితం ఇవ్వాలనేది జులేఖ కల.ఒలింపిక్స్ నుంచి రెస్టారెంట్లో పనికి!ఒలింపిక్స్‌లో పాల్గొనడం గొప్ప. పతకం గెల్చుకోవడం మరింత గొప్ప. అసలుసిసలు ఆటగాళ్లు విజయాన్ని ఆస్వాదిస్తారు తప్ప తల కెక్కించుకోరు అని చెప్పడానికి ఒలిపింక్స్‌లో రజత పతకం గెల్చుకున్న చైనా జిమ్నాస్ట్ యకిన్ ఒక ఉదాహరణ. పద్దెనిమిది సంవత్సరాల ఝౌ యకిన్ ఒలింపిక్స్ నుంచి ఇంటికి వచ్చిన తరువాత ఎప్పటిలాగే తన కుటుంబానికి చెందిన రెస్టారెంట్ పనుల్లో పడిపోయింది.ఒలింపిక్ యూనిఫామ్‌లో తమ రెస్టారెంట్లో ఎప్పటిలాగే కస్టమర్లకు వడ్డిస్తున్న వీడియోని చూస్తూ ‘షీ గాట్ ఏ సిల్వర్, బట్ గేవ్ ఏ గోల్డ్ సర్వీస్’ అంటున్నారు నెటిజనులు. సెంట్రల్ చైనాలోని హునాన్ ్రపావిన్స్లోని హెంగ్యాంగ్ సిటిలో ఈ రెస్టారెంట్ ఉంది. చైనా నుంచి ప్యారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న అయిదుగురు జిమ్నాస్ట్‌లలో యకిన్ ఒకరు.‘ఈ అందమైన చైనీస్ జిమ్నాస్ట్ గుర్తుందా?’ అనే కాష్షన్‌తో ‘ఎక్స్’లో షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఒలింపిక్స్ విజయాన్ని, కుటుంబ బాధ్యతలతో సమన్వయం చేసుకుంటున్న యకిన్పై నెటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్పారు. చేస్తున్న పని చిన్నదా, పెద్దదా అనేది పక్కన పెడితే పనిని గౌరవించడం మన బాధ్యత. పనికి మనం ఇచ్చే గౌరవం వృథా పోదు... ఉన్నత స్థాయికి తీసుకువెళుతుందని చెప్పడానికి కూడా ఝౌ యకిన్ నిలువెత్తు ఉదాహరణ. -
అమెరికాను బోల్తా కొట్టించి స్వర్ణం గెలిచిన ఇటలీ మహిళల వాలీబాల్ జట్టు
పారిస్ ఒలింపిక్స్‌లో చివరి రోజు సంచలన ఫలితం వచ్చి0ది. మహిళల వాలీబాల్ ఈవెంట్లో డిఫెండింగ్ చాంపియన్ అమెరికా జట్టుకు ఊహించని పరాజయం ఎదురైంది. తొలిసారి ఫైనల్ చేరిన ఇటలీ జట్టు 25–18, 25–20, 25–17తో అమెరికా జట్టును ఓడించి మొదటిసారి ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. మ్యాచ్ అనంతరం ఇటలీ సీనియర్ క్రీడాకారిణి, నాలుగోసారి ఒలింపిక్స్‌లో పోటీపడ్డ మోనికా డి జెనారోను సభ్యులంతా గాల్లో ఎగరేసి సంబరం చేసుకున్నారు. మాజీ చాంపియన్ బ్రెజిల్ 25–21, 27–25, 22–25, 25–15తో టర్కీ జట్టును ఓడించి కాంస్య పతకం సాధించింది. ఫైనల్లో అమెరికా జట్టు ఓడిపోయినా ఒలింపిక్స్ మహిళల వాలీబాల్‌లో అత్యధికంగా ఏడు పతకాలు సాధించిన జట్టుగా అవతరించింది. అమెరికా జట్టు ఒలింపిక్స్‌లో ఒక స్వర్ణం, నాలుగు రజతాలు, రెండు కాంస్యాలు దక్కించుకుంది. సోవియట్ యూనియన్, చైనా, జపాన్, బ్రెజిల్ ఆరు పతకాల చొప్పున నెగ్గాయి. -
Adudam Andhra 2023 Photos: అంతటా క్రీడా సంబరం.. ఆడుదాం ఆంధ్రాకు అద్భుత స్పందన (ఫొటోలు)
-
Adudam Andhra : ఆట సూపర్ హిట్ (ఫొటోలు)
-
ఏపీ క్రీడా సంబురం: టాలెంట్ హంట్‌లో CSK.. ఇంకా
సాక్షి, గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘‘ఆడుదాం ఆంధ్రా’’ పోటీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ప్రారంభించారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి పట్టం కట్టేందుకు వీలుగా ప్రవేశపెట్టిన అతిపెద్ద క్రీడోత్సవాన్ని గుంటూరులో ఆరంభించారు. నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్ ఇందుకు వేదికైంది. దేశచరిత్రలోనే మైలురాయి పోటీల ప్రారంభం సందర్భంగా సీఎం వైస్ జగన్ మాట్లాడుతూ.. ‘‘ఈ క్రీడా సంబురాలు దేశ చరిత్రలోనే మైలురాయి. ఈ రోజు నుంచి... 47 రోజులపాటు ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను నిర్వహించనున్నాం. ఆడుదాం ఆంధ్రా గొప్ప పండుగ. మంచి ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి వ్యాయామం వల్ల బీపీ, డయాబెటిక్.. అదుపులో ఉంటాయి. గ్రామస్థాయిలో క్రీడలు ఎంతో అవసరం. అందుకే..గ్రామస్థాయి నుంచి అడుగులేస్తున్నాం. గ్రామాల్లోని ఆణిముత్యాలను వెతికి .. దేశానికి అందిస్తాం. క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో.. తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో.. పోటీలు జరుగుతాయి. 9 వేల ప్లే గ్రౌండ్స్ రెడీగా ఉన్నాయి. 47 రోజుల్లో.. 5 దశల్లో పోటీల నిర్వహణ ఉంటుంది. ఈ క్రీడా సంబురాలు ప్రతి ఏడాది జరుగుతాయి. రూ.12 కోట్లకు పైగా నగదు బహుమతులు అందజేస్తాం’’ అని తెలిపారు. ఆడుదాం ఆంధ్ర పోటీల్లో భాగంగా.. ►తొలి దశలో.. జనవరి 9వ తేదీ వరకు.. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పోటీలు.. ►జనవరి 10 నుంచి 23 వరకు.. మండల స్థాయిలో పోటీలు.. ►జనవరి 24 నుంచి 30 వరకు.. నియోజకవర్గ స్థాయిలో పోటీలు.. ►ఫిబ్రవరి 6వ తేదీ నుంచి.. 10వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించనున్నారు. అదే విధంగా ఉదయం 5 గంటల నుంచి.. సాయంత్రం 7 గంటల వరకు.. పోటీలు నిర్వహించేలా షెడ్యూల్ ఖరారైంది. ఆడుదాం ఆంధ్ర- మరిన్ని విశేషాలు ►రిఫరీలుగా.. 1.50 లక్షల మంది వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ ►పోటీ పడనున్న.. 34.19 లక్షల క్రీడాకారులు ►వీరిలో.. 10 లక్షల మందికిపైగా మహిళలు.. రిజిస్ట్రేషన్ చేసుకోవడం విశేషం ►గ్రామీణ స్థాయిలో క్రీడా ప్రతిభను.. ప్రోత్సాహించాలనే లక్ష్యంతో.. రూ.119.19 కోట్లతో సీఎం జగన్ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా పోటీలను నిర్వహిస్తోంది. దాదాపు రూ.42 కోట్లతో..క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో.. కబడ్డీ క్రీడాకారులకు అవసరమైన.. 5.09 లక్షల స్పోర్ట్స్ కిట్లు ప్రతి సచివాలయానికి సరఫరా చేశారు. ►ప్రొఫెషనల్ టోర్నీ తరహాలో.. మండలస్థాయిలో 17.10 లక్షల .. టీ షర్టులు, టోపీలతో కూడిన కిట్లు. ప్రొఫెషనల్స్‌ను గుర్తించేందుకు..ప్రణాళిక సిద్ధం చేసిన ప్రభుత్వం ►క్రికెట్లో చెన్నై సూపర్ కింగ్స్.. ఆంధ్రా క్రికెట్ ఆసోషియేషన్ ►బ్యాడ్మింటన్‌లో సింధు.. శ్రీకాంత్ బృందాలు ►వాలీబాల్‌లో ప్రైమ్ వాలీబాల్.. ►కబడ్డీలో- ప్రొకబడ్డీ ఆర్గనైజర్లు.. ►ఖోఖోలో- రాష్ట్ర క్రీడా సంఘాల ప్రతినిధులు.. టాలెంట్ హంట్ చేయనున్నారు. ►ఆన్లైన్, ఆఫ్ లైన్లో.. ప్రతిభగల క్రీడాకారులను గుర్తించేందుకు.. ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అనంతరం.. వివిధ స్థాయిల్లో అంతర్జాతీయ శిక్షణ ఇప్పించి.. ఐపీఎల్ లాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లలో.. అవకాశం కల్పించే దృక్పథంతో.. పోటీలను సీఎం జగన్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. -
అదరగొట్టిన కడప బాలికలు
కడప: మైదుకూరులో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్–17 బాలుర, బాలికల వాలీబాల్ పోటీల్లో కడప, విజయనగరం జట్లు అదరగొట్టాయి. మైదుకూరు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరిగిన ఈ పోటీలు సోమవారం ఫైనల్ మ్యాచ్‌లతో ఘనంగా ముగిశాయి. స్థానిక మేథా డిఫెన్స్ అకాడమి మైదానంలో ఒకటో కోర్టులో సోమవారం బాలుర విభాగంలో విజయనగరం – పశ్చిమగోదావరి జిల్లాల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగగా విజయనగరం విజేతగా నిలిచింది. రెండో కోర్టులో బాలికల విభాగంలో కడప– గుంటూరు జిల్లాల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కడప జట్టు ఘన విజయం సాధించింది. బాలుర విభాగంలో సెమీ ఫైనల్లో విజయనగరం జట్టు చేతిలో ఓడిపోయిన శ్రీకాకుళం, బాలికల విభాగంలో సెమీ ఫైనల్లో గుంటూరు జట్టుతో ఓడిపోయిన ప్రకాశం మూడో స్థానంలో సరిపెట్టుకున్నాయి. క్రీడా స్ఫూర్తితో పోటీలు జరగడం హర్షణీయం రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు మైదుకూరులో క్రీడా స్ఫూర్తితో జరగడం హర్షణీయమని ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి తనయుడు, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త శెట్టిపల్లె నాగిరెడ్డి తెలిపారు. వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు సమావేశంలో ఆయన అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలు మైదుకూరులో నిర్వహించడం నియోజకవర్గానికి ప్రతిష్టగా నిలిచిందన్నారు. టోర్నమెంట్ ప్రారంభ వేడుకల్లో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆయన తనయుడు నాగిరెడ్డి సోమవారం పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లకు నగదు బహుమతులను అందజేశారు. బాలికల, బాలుర విభాగంలో విజేతలుగా నిలిచిన కడప, విజయనగరం జట్లకు రూ.20 వేల చొప్పున, రెండో స్థానంలో నిలిచిన పశి్చమగోదావరి, గుంటూరు జట్లకు రూ.10 వేల చొప్పున నగదు బహుమతులను ఆయా జట్ల కెపె్టన్, కోచ్ మేనేజర్లకు అందజేశారు. మూడో స్థానంలో నిలిచిన శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల జట్లకు రూ.5 వేల నగదును అందించారు. మైదుకూరు మున్సిపల్ వై.రంగస్వామి మాట్లాడుతూ పోటీల్లో గెలుపోటములు సహజమేనని అన్నారు. మైదుకూరులో వాలీబాల్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ చూపి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తేవాలని సూచించారు. శెట్టిపల్లె నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్‌తోపాటు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల కార్యనిర్వాహక కార్యదర్శులు అరుణకుమారి, వసంత, మేధా డిఫెన్స్ అకాడమి చైర్మన్ సి.నరసింహులు, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర నాయకులు విజేతలుగా నిలిచిన జట్లలోని క్రీడాకారులకు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ బహూకరించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాల సంఘం నాయకులు సాజిద్, రమేష్ యాదవ్, నిత్య ప్రభాకర్, ప్రవీణ్ కుమార్, కిరణ్, శ్రీకాంత్, రమేష్ బాబు, గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర జట్లకు ఎంపిక శ్రీనగర్‌లో వచ్చే నెలలో జరిగే జాతీయ స్థాయి అండర్–17 బాలుర, బాలికల వాలీబాల్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్లను ఎంపిక చేశారు. అండర్–17 బాలుర, బాలికల వాలీబాల్ టోర్నమెంట్ ముగిసిన అనంతరం రాష్ట్ర బాలుర, బాలికల జట్లను ఎంపిక చేశారు. బాలికల జట్టు : జి.ప్రవల్లిక (విశాఖపట్నం), ఎం.విజయలక్ష్మి (విజయనగరం), వి.కుసుమప్రియ, పావని (కడప), సోని, ఎం.సుమశ్రీ(గుంటూరు), పి.జశి్వత(అనంతపురం), ఇ.షణ్ముఖ ప్రియ (చిత్తూరు), కె.ప్రీతి (తూర్పుగోదావరి), ఎస్.పూజిత (ప్రకాశం), సీహెచ్ శ్రీపద్మజ(కృష్ణ), స్టాండ్ బైగా డి.కీర్తన (గుంటూరు), ఎస్.మానస (అనంతపురం), ఎం.వెంకటలక్ష్మి (నెల్లూరు), ఎస్.ఉన్నత సత్యశ్రీ(కృష్ణ), డి.సమైక్య (ప్రకాశం). బాలుర జట్టు : ఎ.ప్రేమ్ కుమార్, ఎస్.తోషన్ రాము (శ్రీకాకుళం), టి.రాహుల్, ఎన్.మౌర్య (విశాఖపట్నం), బి.రంజిత్ (విజయనగరం), వి.రాజు (పశ్చిమ గోదావరి), టి.సు«దీర్ (అనంతపురం), కె.డేవిడ్ రాజు (గుంటూరు), పి.కిరణ్‌బాబు (ప్రకాశం), ఎన్.అజయ్‌కుమార్ (కడప), స్టాండ్‌బైగా ఎస్.భరత్ (కృష్ణ), వై.రోహిత్(కడప), ఎం.ఆర్యన్ (నెల్లూరు), బి.కార్తీక్(అనంతపురం), వై.రాంబాబు (తూర్పుగోదావరి), కె.రాము (పశ్చిమ గోదావరి). -
వాలీబాల్‌లో భారత్ సంచలనం
హాంగ్జూ (చైనా): మూడున్నర దశాబ్దాల పతక నిరీక్షణకు తెరదించాలనే లక్ష్యంతో ఆసియా క్రీడల్లో బరిలోకి దిగిన భారత పురుషుల వాలీబాల్ జట్టు తొలి అడ్డంకిని అధిగమించింది. గ్రూప్ ‘సి’లో టాప్ ర్యాంక్‌లో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించింది. మంగళవారం కంబోడియా జట్టును ఓడించిన భారత జట్టు బుధవారం పెను సంచలనం సృష్టించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 27వ స్థానంలో ఉన్న దక్షిణ కొరియా జట్టును భారత్ బోల్తా కొట్టించింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో భారత జట్టు 25–27, 29–27, 25–22, 20–25, 17–15తో దక్షిణ కొరియాపై గెలిచింది. 1966 నుంచి ప్రతి ఆసియా క్రీడల్లో దక్షిణ కొరియా స్వర్ణ, రజత, కాంస్య పతకాల్లో ఏదో ఒక పతకం సాధిస్తూ వస్తోంది. భారత జట్టు చివరిసారి 1986 సియోల్ ఆసియా క్రీడల్లో కాంస్య పతకం గెలిచింది. కొరియాతో 2 గంటల 38 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు సమష్టి ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా అమిత్ అత్యధికంగా 24 పాయింట్లు స్కోరు చేశాడు. వినిత్ కుమార్, అశ్వల్ రాయ్ 19 పాయింట్ల చొప్పున సాధించారు. మనోజ్ ఎనిమిది పాయింట్లు, ఎరిన్ వర్గీస్ ఏడు పాయింట్లు అందించారు. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో కొరియా రజత పతకం నెగ్గగా, భారత్ 12వ స్థానంలో నిలిచింది. రోయింగ్‌లో జోరు... రోయింగ్‌లో భారత క్రీడాకారులు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. జస్విందర్ సింగ్, భీమ్ సింగ్, పునీత్ కుమార్, ఆశి‹Ùలతో కూడిన భారత పురుషుల జట్టు కాక్స్‌లెస్ ఫోర్ ఈవెంట్లో ఫైనల్‌కు చేరింది. మహిళల కాక్స్డ్ ఎయిట్ ఈవెంట్లో అశ్వతి, మృణమయి సాల్గావ్కర్, ప్రియా దేవి, రుక్మిణి, సొనాలీ, రీతూ, వర్ష, తెన్దోన్తోయ్ సింగ్, గీతాంజలిలతో కూడిన భారత జట్టు కూడా ఫైనల్లోకి ప్రవేశించింది. నేడు మలేసియాతో భారత మహిళల పోరు మహిళల టి20 క్రికెట్లో భారత నేరుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. మలేసియాతో నేడు జరిగే పోరులో స్మృతి మంధాన బృందం బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సెమీఫైనల్‌కు చేరడంతోపాటు పతకం రేసులో నిలుస్తుంది. ఉదయం గం. 6:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. -
భారత వాలీబాల్ జట్టుకు నిరాశ
మనామా (బహ్రెయిన్): ప్రపంచ అండర్–21 పురుషుల వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు నిరాశ ఎదురైంది. గ్రూప్ లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు పరాజయం చవిచూసింది. తద్వారా నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోయింది. పూల్ ‘సి’లో ఉన్న భారత జట్టు తొలి మ్యాచ్‌లో 17–25, 14–25, 25–20, 19–25తో పోలాండ్ చేతిలో... రెండో మ్యాచ్‌లో 19–25, 25–22, 27–29, 13–25తో బల్గేరియా చేతిలో... మూడో మ్యాచ్‌లో 25–18, 27–29, 20–25, 22–25తో కెనడా చేతిలో ఓడిపోయింది. పదేళ్ల తర్వాత మళ్లీ ఈ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించిన భారత జట్టు తదుపరి 9 నుంచి 16 స్థానాల కోసం వర్గీకరణ మ్యాచ్‌లు ఆడుతుంది. -
రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ 2022 వేలం
రూపే ప్రైమ్ వాలీబాల్ 2022 వేలం గురువారం కోల్‌కతాలోని హయత్ రీజెన్సీ సాల్ట్ లేక్ వద్ద జరిగింది. ఈ వేలానికి 523 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకోగా 45 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. రెండవ ఎడిషన్ రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ ఇంటర్నేషనల్,ప్లాటినమ్,గోల్డ్ విభాగాల్లో ఎనిమిది జట్లు ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఈ సీజన్ కోసం కొలంబియాకు చెందిన కార్లోస్ ఆండ్రెస్ జమోరా (ఎటాకర్), ఆస్ట్రేలియాకు చెందిన ట్రెంట్ ఓ డియా (మిడిల్ బ్లాకర్)ను అంతర్జాతీయ ప్లేయర్ విభాగంలో సొంతం చేసుకుంది. ఈ ఫ్రాంచైజీ రంజిత్ సింగ్ (సెట్టర్)ను 12.25 లక్షల రూపాయలకు ప్లాటినమ్ విభాగంలో కొనుగోలు చేసింది.హైదరాబాద్ ఫ్రాంచైజీ ఈ వేలంలో అంగముత్తు (యూనివర్శిల్) 7.40 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ ఫ్రాంచైజీ లాల్ సుజన్ ఎంవీ (సెట్టర్)ను 4.50 లక్షల రూపాయలకు, అషాముతుల్లా (ఎటాకర్)ను 5.30 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. బ్లాక్ హాక్స్ ఈ సీజన్ వేలంలో అరుణ్ జచారియస్ సిబీ (యూనివర్శిల్)ను 4 లక్షల రూపాయలు, సౌరభ్ మాన్ (మిడిల్ బ్లాకర్)ను మూడు లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ హోస్ట్ బ్రాడ్‌కాస్టర్‌గా కొనసాగనుంది. రెండవ సీజన్ రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ పవర్డ్ బై ఏ23 లో అభిమానులు ఆసక్తికరమైన 31 గేమ్స్ వీక్షించవచ్చు. ఆటగాళ్ల జాబితా: (మొదటి రెండు రౌండ్ల వేలం వరకు) రిటైన్డ్ ఆటగాళ్లు: గురు ప్రశాంత్ (యూనివర్శిల్), జాన్ జోసెఫ్ ఈజె (బ్లాకర్), ఆనంద్ కె (లిబెరో) వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: కార్లోస్ ఆండ్రెస్ ల్లానోస్ జమోరా (ఎటాకర్), ట్రెంట్ ఓ డియా (మిడిల్ బ్లాకర్), రంజిత్ సింగ్ (సెట్టర్), అంగముత్తు (యూనివర్శిల్), లాల్ సుజన్ ఎంవీ (సెట్టర్), అషామతుల్లా (ఎటాకర్), అరుణ్ జచారియాస్ సిబి(యూనివర్శిల్), సౌరభ్ మాన్ (మిడిల్ బ్లాకర్) -
పోరాడి ఓడిన బ్లాక్ హాక్స్
సాక్షి, హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బ్లాక్ హాక్స్ జట్టు 2–3 (12–15, 15–14, 12–15, 15–11, 13–15) సెట్ల తేడాతో బెంగళూరు టార్పోడస్ జట్టు చేతిలో పోరాడి ఓడిపోయింది. లవ్మీత్, పంకజ్ శర్మ బెంగళూరు జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించారు. మరో మ్యాచ్‌లో కోల్‌కతా థండర్‌బోల్ట్స్ 4–1తో (10–15, 15–11, 15–10, 15–12, 15–13) చెన్నై బ్లిట్జ్ జట్టుపై గెలిచింది. -
హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జెర్సీ ఆవిష్కరణ
Rupay Prime Volleyball League: Hyderabad Black Hawks- సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలలో హైదరాబాద్ వేదికగా జరిగే రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో పాల్గొనే హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు జెర్సీని తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, వీఎం అబ్రహమ్, హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు యజమాని అభిషేక్ రెడ్డి, బేస్‌లైన్ వెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్ తుహిన్ మిశ్రా, డైరెక్టర్ యశ్వంత్ బియ్యాల తదితరులు పాల్గొన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో ఫిబ్రవరి 5 నుంచి 27 వరకు జరిగే ఈ లీగ్‌కు ఏ23 కంపెనీ సహ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. మొత్తం 24 మ్యాచ్‌లను సోనీ–టెన్ స్పోర్ట్స్ చానెల్స్‌లో ప్రసారం చేస్తారు. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ లీగ్‌లో మొత్తం ఏడు జట్లు హైదరాబాద్ బ్లాక్ హాక్స్, కాలికట్ హీరోస్, కొచ్చి బ్లూ స్పైకర్స్, అహ్మదాబాద్ డిఫెండర్స్, చెన్నై బ్లిట్జ్, బెంగళూరు టార్పెడోస్, కోల్‌కతా థండర్‌బోల్ట్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. చదవండి: టీమిండియాకు భారీ షాక్.. కరోనా బారిన పడిన స్టార్ ఆటగాడు -
ప్లేయర్లతో కలిసి సరదాగా వాలీబాల్ ఆడిన రోజా
-
వాలీబాల్ ఆడిన రోజా
-
వాలీబాల్ గేమ్ ఆడిన ఎమ్మెల్యే రోజా
-
రాజమౌళితో ఎన్టీఆర్ వాలీబాల్.. వీడియో వైరల్
Jr NTR And Rajamouli Playing Volleyball Video: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నారు. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్స్ కారణంగా షూటింగ్‌కి ఆటంకం కలిగినప్పటికీ.. పరిస్థితులు చక్కబడగానే చిత్రీకరణ మొదలు పెట్టారు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ తుది దశకు చేరింది. ఆగస్ట్ 1న తొలి పాటను కూడా విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే.. నిత్యం షూటింగ్లో బిబీగా ఉంటే.. ఎన్టీఆర్, రాజమౌళి కొంత ఖాళీ సమయంలో దొరకడంతో వాలీబాల్ ఆడారు. ఈ దృశ్యాన్ని వీడియోలో బంధించిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇందులో ఎన్టీఆర్, రాజమౌళి చాలా ఎనర్జిటిక్‌తో వాలీబాల్ ఆడుతున్నారు. ఈ వీడియోను యంగ్ టైగర్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండగా, భారీ ఎత్తున లైకులు, షేర్లు లభిస్తున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి మంచి స్నేహితులన్న సంగతి అందరికి తెలిసిందే. ఇక ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొదలైనప్పటి నుంచి తుది దశ వరకు వారి స్నేహం మరింత బలపడింది. ఇక అప్పుడప్పుడు షూటింగ్ గ్యాప్ లో రాజమౌళి, హీరోలతో కలిసి ఆటలు ఆడుతుంటాడు. అయితే ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఏ గేమ్ ఆడుతూ కనిపించలేదు. తొలిసారి ఆయన వాలీబాల్ ఆడుతూ కనిపించడంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్‌తో పాటు మిగతా సినీ ప్రేక్షకులు ఈ వీడియోలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. Hero @tarak9999 playing volleyball with @ssrajamouli ❤❤❤. pic.twitter.com/MXybRAjfG5 — Sai Mohan #JrNtr #RRR 🌊 (@Sai_Mohan_999) July 26, 2021 -
బాల్ సరిగా వెయ్.. కరోనా బాధితులతో జేసీ వాలీబాల్
బొబ్బిలి: కరోనా వైరస్ బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కిశోర్‌కుమార్ ముందడుగు వేశారు. కోవిడ్ కేర్ సెంటర్‌కు వెళ్లి వారితో కలిసి ఆటలాడి వారిలో ఆందోళన పోగొట్టారు. ఆయన బుధవారం బొబ్బిలి గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలోని కోవిడ్ కేర్ సెంటర్‌ను పరిశీలించారు. అక్కడున్న 123 మంది కరోనా వైరస్ బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వారు చెప్పిన చిన్నచిన్న సమస్యల పరిష్కారానికి అక్కడే ఉన్న తహసీల్దార్ ఆర్.సాయికృష్ణ, సీఎస్‌డీటీ బలివాడ గౌరీశంకర్‌లకు ఆదేశాలిచ్చారు. కరోనా వల్ల ఏం కాదని, జాగ్రత్తలు మాత్రం ముఖ్యమని చెబుతూ బాధితులతో కలిసి వాలీబాల్ ఆడారు. బాల్ సరిగా వెయ్.. అంటూ వారిని ఉత్సాహపరిచారు. దీంతో కోవిడ్ బాధితులు కూడా ఉత్సాహంగా ఆయనతో ఆడారు. రోజూ మూడు షిఫ్ట్‌ల్లో వైద్యులు, సిబ్బంది ఉండాలని, త్వరితగతిన రికవరీ అయ్యేలా వారిలో ధైర్యాన్ని నూరిపోయాలని జేసీ అధికారులకు సూచించారు. చదవండి: ‘జగనన్న ప్రాణవాయువు’ రథచక్రాలు ప్రారంభం ఆత్మ బంధువులు: మానవత్వమే ‘చివరి తోడు’ -
మేమున్నామని, మీకేం కాదని..
సాక్షి, అనంతపురం: ఆపదలో ఉన్న క్రీడాకారులకు నేనున్నానంటూ సాయమందిస్తున్నారు వాలీబాల్ క్రీడాకారులు. ఇందుకోసం ప్రత్యేకంగా అనంతపురం సిటీ వాలీబాల్ పేరుతో ఓ వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ గ్రూప్ ద్వారా ఆపదలో ఉన్న వారిని గుర్తించి, వారికి తమకు తోచిన ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. సేవ చేయడమే లక్ష్యంగా.. అనంతపురం సిటీ వాలీబాల్ పేరుతో రూపొందించిన వాట్సాప్ గ్రూప్‌లో వివిధ రంగాల్లో స్థిరపడిన చిన్ననాటి స్నేహితులు, పాఠశాల, కళాశాల, ఉన్నత విద్యలో క్లాస్మేట్స్గా ఉన్న వారు సభ్యులుగా ఉన్నారు. తమ క్రీడాంశాలకు సంబంధించిన విషయాలతో పాటు, ఇతర సమాచారాన్ని చేరవేస్తూ తమ మధ్య స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే వీరి దృష్టి సేవ వైపు మళ్లింది. ఆపదలో ఉన్న స్నేహితులను ఆదుకునేలా బృహత్ కార్యాచరణను రూపొందించుకుని, ఆ దిశగా సభ్యులు అడుగులేస్తున్నారు. రూ.లక్షల్లోనే సాయం ► పామిడికి చెందిన వాలీబాల్ క్రీడాకారుడు ముజాహిద్దీన్.. అదే పట్టణం వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, చికిత్సలకు సైతం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకుని రూ. లక్ష సాయం అందించారు. అలాగే అనంతపురం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సకు అయ్యే ఖర్చును తగ్గించేలా యాజమాన్యంతో చర్చించి ఓ సీనియర్ క్రీడాకారుడు ఒప్పించారు. ► అంబులెన్స్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న వాలీబాల్ క్రీడాకారుడు మణికంఠ... గతేడాది గుత్తి సమీపంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఏటీపీ సిటీ వాలీబాల్ గ్రూప్, ఏపీ వాలీబాల్ మెన్స్ గ్రూప్ సభ్యులు రూ. 1.5 లక్షల ఆర్థిక సాయాన్ని ఆ కుటుంబానికి అందించారు. ► పొట్టకూటి కోసం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి అనంతపురానికి వచ్చి తోపుడు బండ్లపై ఉసిరి, జామ వంటి సీజనల్ పండ్ల విక్రయాలు చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి చేతికందిన కొడుకు (వాలీబాల్ క్రీడాకారుడు) మరణిస్తే, ఆ కుటుంబానికి అన్నీ తామై తోడునీడుగా నిలిచారు. ► ఈ నెల 1వ తేదీ కూడేరు సమీపంలో ఆటో బోల్తాపడి గార్లదిన్నె మండలం తరిమెల గ్రామానికి చెందిన వాలీబాల్ క్రీడాకారుడు లక్ష్మీపతితో పాటు కుటుంబసభ్యులూ తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న గ్రూప్ సభ్యులు తక్షణమే స్పందించారు. లక్ష్మీపతి చికిత్సల కోసం అవసరమైన రూ. 2 లక్షలు సర్దుబాటు చేసేందుకు ముందుకు వచ్చారు. తక్షణ సాయం కింద రూ. 60 వేలు అందజేశారు. తక్షణం స్పందిస్తూ.... వాలీబాల్ క్రీడాకారుల గ్రూప్‌లో జూనియర్లు, సీనియర్లు అనే భేదభావం లేదు. వాలీబాల్ క్రీడ గురించి తెలిసిన ఉత్సాహవంతులైన ప్రతి క్రీడాకారుడిని ఈ గ్రూప్‌లో సభ్యులుగా చేర్చుకుంటుంటారు. సభ్యుల్లో ఉన్న వారికే కాకుండా వారి కుటుంబసభ్యుల్లో ఎవరికైనా ప్రమాదం వాటిల్లినా.. విపత్కర పరిస్థితుల్లో ఉన్నా సభ్యులు తక్షణమే స్పందిస్తుంటారు. ఈ గ్రూప్ ద్వారా ఇప్పటికే ముగ్గురు వాలీబాల్ క్రీడాకారులకు ఆపన్న హస్తమందించారు. వీరిలో ఇద్దరు ప్రమాదం బారిన పడి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయంలో ఆర్థిక చేయూతనందించారు. ప్రమాదాల్లో మృతి చెందిన సీనియర్ క్రీడాకారుల కుటుంబాలకు అన్నీ తామై తోడునీడుగా ఉంటూ వస్తున్నారు. గొప్ప చెప్పుకోవాలని కాదు అనంతపురంలోని అరవిందనగర్‌లో ఉంటున్న నేను జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారుడిగా రాణించా. కుటుంబ పోషణ కోసం అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్నా. క్రీడాకారులంటే చాలా గౌరమిస్తా. ఎవరైనా క్రీడాకారుడికి ఆరోగ్య పరిస్థితి విషమిస్తే నా అంబులెన్స్‌లోనే బెంగళూరుకు తీసుకెళుతుంటా. లక్ష్మీపతి విషయంలోనే ఇదే జరిగింది. ఆ సమయంలో వారి కుటుంబసభ్యులు పడ్డ వేదన మాటల్లో చెప్పలేను. వారికి మేమున్నామంటూ మా వాలీబాల్ వాట్సాప్ గ్రూప్ సభ్యులు ధైర్యం చెప్పారు. ఇదంతా మేమేదో గొప్పలు చేస్తున్నామని చెప్పుకునేందుకు కాదు. ఆపదలో ఉన్న క్రీడాకారులను మా వంతు సాయంగా ఆదుకుంటున్నామనే తృప్తి మాకు ఎంతో సంతృప్తినిస్తోంది. – ప్రభు, వాలీబాల్ క్రీడాకారుడు, అనంతపురం కరుణించే హృదయాలు స్పందిస్తున్నాయి మా తోటి క్రీడాకారుడు అపాయంలో ఉన్నాడనే విషయాన్ని వాట్సాప్ గ్రూప్‌లో మిగిలిన సభ్యులకు తెలియపరుస్తుంటాం. ఆ సమయంలో చాలా మంది స్పందించి తమ వంతుగా ఎంతో కొంత ఆర్థిక సాయం అందిస్తుంటారు. ఈ సేవా కార్యక్రమం భవిష్యత్తులోనూ కొనసాగించేలా అన్ని చర్యలూ తీసుకున్నాం. క్రీడల ద్వారా మాకంటూ ఈ సమాజంలో ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నాం. ఈ ఆటల ద్వారానే మాకు ఉద్యోగావకాశాలు వచ్చాయి. ఇలాంటి సమయంలో క్రీడాభివృద్ధికే కాక, క్రీడాకారుల వ్యక్తిగత సమస్యలనూ పరిష్కరించే వేదికగా మా వాట్సాప్ గ్రూప్‌ను తీర్చిదిద్దాం. – దినేష్, సీనియర్ క్రీడాకారుడు, అనంతపురం -
వాలిబాల్ ఆడుతున్న పక్షులు.. గెలిచేదెవరు?
న్యూఢిల్లీ: మనుషులను ఆశ్చర్యపరిచే జంతువులు, పక్షుల వీడియోలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ట్విటర్లో షేర్ చేసిన చిన్న చిన్న పక్షుల వీడియో నెటిజన్లను వీపరీతంగా ఆకట్టుకుంటోంది. పచ్చ, పసుపు రంగుల్లో ఉన్న పక్షులు రెండు టీంలు విడిపోయి పోటీ పోటీగా వాలిబాల్ ఆడుతున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటా చక్కర్లు కొడుతోంది. దీనికి ‘ప్రపంచవ్యాప్తంగా క్రీడలు రద్దయ్యాయి.. కానీ ఈ బార్డీబాల్ మాత్రం కాదు’ అనే ఫన్ని క్యాప్సన్‌తో షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటి వరకు వేలల్లో వ్యూస్ వందల్లో కామెంట్స్ వచ్చాయి. ఈ గ్రీన్ అండ్ ఎల్లో టీమ్‌లో ఎవరూ గెలుస్తారు అని అడిగిన ప్రశ్నకు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. (చదవండి: యజమానికి పెంపుడు పిల్లి వింత బహుమతి) Sports are mainly cancelled... but some Birdyball will do! 🤣👍 pic.twitter.com/zBgwGM8nlX — Madeyousmile (@Thund3rB0lt) October 18, 2020 ‘రెండు టీమ్‌లు గెలుస్తాయి’, ‘గ్రీన్ టీమ్ చీటింగ్ చేస్తుంది’, ‘ఈ పక్షులు ఎంత ముద్దుగా ఉన్నాయో. వాటిని మా ఇంటికి తీసుకువెళ్లాలని ఉంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 11 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఈ పక్షులు ఎల్లో, గ్రీన్ టీమ్‌లుగా విడిపోయాయి. ఈ రెండు టీమ్‌ల పక్షులు ముక్కుతో బాల్‌ను కరుచుకుని ఆటు ఇటూ నెట్‌పై నుంచి తోస్తున్నాయి. ఎల్లో పక్షి బాల్‌ను గ్రీన్ పక్షుల వైపు వేస్తుంటే ఓ గ్రీన్ పక్షి ఎల్లో పక్షివైపే నెడుతూ చీటింగ్ చేస్తుంది. (చదవండి: 516కు పైగా ఆపరేషన్స్.. అయినా కానీ..) -
పాలమూరులో వాలీబాల్ అకాడమీ?
సాక్షి, మహబూబ్‌నగర్ క్రీడలు: వాలీబాల్ క్రీడను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో 2004లో రాష్ట్ర క్రీడాప్రాధికారిక సంస్థ వాలీబాల్ అకాడమీని ఏర్పాటు చేసింది. అకాడమీ ఉన్న రోజుల్లో ఉమ్మడి జిల్లాలో ఎంతో మంది క్రీడాకారులు వెలుగులోకి వచ్చారు. ఇక్కడ శిక్షణపొందిన జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు అంతర్జాతీయ, జాతీయస్థాయిల్లో సత్తాచాటారు. మరికొంత మంది క్రీడాకారులు శిక్షణ పొంది మేటి క్రీడాకారులుగా జాతీయ సీనియర్ వాలీబాల్ పోటీల్లో రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అకాడమీ ఉన్న సమయంలో క్రీడాకారులకు ఎంతో అనువుగా ఉండేది. అయితే నిధుల నిర్వహణ భారం కావడంతో 2008లో శాప్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) అకాడమీని మూసివేశారు. అకాడమీకి కోచ్‌ల కొరత, నిధులలేమి, నిర్వహణ భారంతో రాష్ట్రస్థాయిలో ఉన్న వాలీబాల్ అకాడమీలను తీసివేశారు. దీంతో మహబూబ్‌నగర్‌లోని వాలీబాల్ క్రీడాకారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. త్వరలో అకాడమీ ఏర్పాటు దశాబ్దకాలం దాటిన తర్వాత మళ్లీ మహబూబ్‌నగర్‌లో వాలీబాల్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రత్యేక దృష్టి సారించారు. అకాడమీ ఏర్పాటుపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇటీవల మంత్రి సంబంధిత డీవైఎస్ఓ శ్రీనివాసును ఆదేశించారు. అకాడమీలో ఏర్పాటు చేసే సదుపాయాలు, సౌకర్యాలపై డీవైఎస్ఓ ఈనెల 17న రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీకి ప్రతిపాదనలు పంపారు. దీంతో వచ్చేనెలలో వాలీబాల్ అకాడమీకి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. క్రీడాకారులకు మహర్దశ.. వాలీబాల్ అకాడమీ ఏర్పాటుతో ఔత్సాహిక క్రీడాకారులకు మహర్దశ కలగనుంది. దాదాపు 40మంది క్రీడాకారులకు అకాడమీలో అవకాశం లభిస్తుంది. ప్రత్యేక ఎంపికలు, ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి ప్రతిభ చూపే వారికి అకాడమీలో తీసుకుంటారు. ఎంపికైన క్రీడాకారులకు అకాడమీలోనే వసతి సౌకర్యం ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకంగా కోచ్‌లను నియమించి.. ప్రతి రోజు ఉదయం వేళల్లో ప్రత్యేక వ్యాయామం, సాయంత్రం వేళల్లో వాలీబాల్ శిక్షణ ఇస్తారు. ఉదయం గ్రౌండ్ రన్నింగ్, వెయిట్ రన్నింగ్, స్ట్రెచ్చింగ్, బాల్ త్రో వంటిపై శిక్షణ అందజేసి, రాష్ట్ర, జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచేలా క్రీడాకారులను తీర్చిదిద్దుతారు. క్రీడాకారులకు మెరుగైన శిక్షణ... వాలీబాల్ అకాడమీ వస్తే ఔత్సాహిక క్రీడాకారులకు మెరుగైన శిక్షణ లభిస్తుంది. అకాడమీ ఏర్పాటుతో వాలీబాల్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయవచ్చు. క్రీడాకారులకు అన్ని రకాల వసతులు లభిస్తాయి. త్వరలో మహబూబ్‌నగర్‌కు వాలీబాల్ అకాడమీ వస్తుండడం సంతోషంగా ఉంది. –మహ్మద్ హనీఫ్, జిల్లా వాలీబాల్ సంఘం కార్యదర్శి -
భళా.. బాల్కా!
మోతుగూడెం (రంపచోడవరం) : వాలీ బాల్ క్రీడలో రాణిస్తున్నాడు మన్యం కుర్రాడు. మెరుపు వేగంతో కదులుతూ అవతలి జట్టును చిత్తు చేస్తున్నాడు. తమ జట్టు సభ్యులకు బాల్ అందిస్తూ టీమ్‌కే కీలకంగా మారాడు. మండల స్థాయి నుంచి జాతీయ పోటీల్లో పాల్గొనే స్థాయికి చేరాడు. డీఏవీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న పార్ధివ్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర డీఏవీ స్కూల్స్ వాలీబాల్ టోర్నీలో ఉత్తమ ప్రతిభ కనబరిచి, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే జట్టులో స్థానం దక్కించుకున్నాడు. నాడు చోటు దక్కక.. గత ఏడాది హైదరాబాద్‌లో డీఏవీ స్కూల్స్ స్టేట్ మీట్లో ఉత్తమ ప్రతిభ చూపినా జాతీయ స్థాయి జట్టులో స్థానం దక్కలేదు. ఎత్తు సరిపోకపోవడంతో ఆడే అవకాశాన్ని కోల్పోయాడు. ఆ ఏడాది జార్ఖండ్‌లో జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు జరిగాయి. ఈ ఏడాది హైదరాబాద్‌లో జరిగే జాతీయ స్థాయి డీఏవీ స్కూల్ వాలీబాల్ పోటీలకు స్థానం దక్కించుకున్నాడు. సౌత్ ఇండియా తరఫున జట్టులో స్థానం దేశ వ్యాప్తంగా 900 డీఏవీ స్కూల్స్ ఉన్నాయి. మోతుగూడెం డీఏవీ పాఠశాల విద్యార్థి పార్ధివ్ సౌత్ ఇండియా తరఫున పాల్గొనే జట్టులో స్థానం దక్కింది. సౌత్ ఇండియాలో తొమ్మిది క్లష్టర్లు ఉంటాయి. క్లష్టర్‌లో పది డీఏవీ స్కూల్స్ ఉంటాయి. వీటి పరిధిలో 12 మందిని ఎంపిక చేసి జాతీయ స్థాయి పోటీల్లో సౌత్ ఇండియా తరఫున ఆడిస్తారు. డిసెంబర్ 11, 12 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలు జరుగుతాయి. మండల స్థాయి నుంచి జాతీయ స్థాయిపోటీలకు క్రీడలపై ఆసక్తి ఉన్న పార్ధివ్‌ను పాఠశాల పీఈటీ భద్రయ్య ప్రోత్సహించారు. షటిల్ నుంచి వాలీబాల్ ఆడేలా శిక్షణ ఇచ్చారు. ఏడో తరగతిలోనే మండల స్థాయిలో జరిగిన సీఎం కప్‌లో జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మండల స్థాయి నుంచి జోనల్ స్థాయి వరకు జరిగిన వాలీబాల్ పోటీల్లో పాల్గొన్నాడు. ఆగస్టు నెలలో కడపలో జరిగిన క్లష్టర్ స్థాయి జట్టుకు ఎంపికయ్యాడు. జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తాడు ముందు నుంచి వాలీబాల్‌లో ప్రతిభ చూపుతున్నాడు. జట్టులో మిగిలిన సభ్యులను లీడ్ చేస్తూ అనేక సందర్భాల్లో జట్టు విజయానికి కృషి చేశాడు. హైదరాబాద్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తాడనే నమ్మకం ఉంది. ఎంతో భవిష్యత్తు ఉంది.–భద్రయ్య, పీఈటీ, డీఏవీ స్కూల్ మోతుగూడెం -
చాంపియన్ గజ్వేల్ యూత్ క్లబ్
సాక్షి, హైదరాబాద్: నెహ్రూ యువ కేంద్ర, గాంధీనగర్ స్పోర్ట్స్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన హైదరాబాద్ జిల్లా ఓపెన్ వాలీబాల్ టోర్నమెంట్లో గజ్వేల్ యూత్ క్లబ్ చాంపియన్‌గా నిలిచింది. గాంధీనగర్‌లో జరిగిన టైటిల్ పోరులో గజ్వేల్ యూత్ క్లబ్ 25–23, 25–18తో మాసబ్ ట్యాంక్‌పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో మాసబ్ ట్యాంక్ 25–10, 17–25, 15–11తో జీవైసీ టీమ్‌పై గెలుపొందగా, గజ్వేల్ యూత్ క్లబ్ 25–15, 15–25, 15–13తో శాట్స్ టీమ్‌ను ఓడించింది. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా వాలీబాల్ సంఘం కార్యదర్శి మురళీ మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ మాజీ క్రీడాకారుడు రాజ్ కుమార్, హైదరాబాద్ జిల్లా వాలీబాల్ సంఘం సంయుక్త కార్యదర్శి కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ప్రొ వాలీబాల్ లీగ్
కొచ్చి: లీగ్ తెరపైకి కొత్తగా వాలీబాల్ వచ్చింది. స్కూల్, కాలేజ్ గ్రౌండ్లతో పాటు అక్కడక్కడ కనిపించే ఈ క్రీడ టీవీల్లో కనువిందు చేసేందుకు సిద్ధమైంది. నేటి నుంచి ప్రొ వాలీబాల్ లీగ్ తొలి సీజన్ మొదలవుతోంది. ఆరు ఫ్రాంచైజీ జట్లు రెండు వేదికలు కొచ్చి, చెన్నైలో తలపడతాయి. మొదట 12 లీగ్ మ్యాచ్‌లు ఇక్కడ జరుగుతాయి. మరో ఆరు మ్యాచ్‌లు, సెమీఫైనల్స్, ఫైనల్ పోటీలు చెన్నైలో నిర్వహిస్తారు. ఈ నెల 22న టైటిల్ పోరు జరుగుతుంది. శనివారం కొచ్చి బ్లూ స్పైకర్స్, యూ ముంబా వాలీ జట్ల మధ్య ఇక్కడి రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగుతుంది. ఈ రెండు జట్లతో పాటు బ్లాక్‌హాక్స్ హైదరాబాద్, అహ్మదాబాద్ డిఫెండర్స్, కాలకట్ హీరోస్, చెన్నై స్పార్టన్స్ బరిలో ఉన్నాయి. లీగ్ దశను 15 పాయింట్ల విధానంలో ఐదు సెట్ల మ్యాచ్‌లుగా నిర్వహిస్తారు. విజయానికి 2 పాయింట్లు లభిస్తాయి. ఐదు సెట్లూ గెలిస్తే వైట్‌వాష్‌గా పేర్కొంటారు. ఇలా చేస్తే అదనంగా మూడు పాయిట్లు లభిస్తాయి. ప్లే ఆఫ్ మ్యాచ్‌లను 25 పాయింట్ల విధానంలో నిర్వహిస్తారు. ప్రొ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)కు రూపే స్పాన్సర్షిప్ చేస్తోంది. -
వాలీబాల్ యోధుడు ఇక లేడు
శ్రీకాకుళం, రేగిడి: జిల్లాలో వాలీబాల్ ఆట పేరుచెప్పగానే గుర్తుకొచ్చే తెంటు రామజోగినాయుడు(65) ఇకలేరు. ఎన్నో ఏళ్లపాటు ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తూ అటు క్రీడాకారులను, ఇటు ఉద్యోగులను తయారుచేసిన ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శిగా సేవలందిస్తూ వస్తున్న ఆయన సోమవారం వరకు ఆరోగ్యంగానే ఉన్నారు. ఉనుకూరు గ్రామంలోని తన ఇంటి వద్ద సోమవారం బాత్రూమ్కు వెళ్లి కూలబడ్డారు. వెంటనే కుటుంబీ కులు విశాఖపట్నానికి తరలించారు. అక్కడ ఓ ప్రైవేట్ ఆçస్పత్రిలో వైద్యులు పరీక్షలు చేయగా హైబీపీ ఉండడంతో చికిత్స ప్రారంభించారు. మంగళవారం చికిత్సపొందుతుండగానే ఆయన మృతిచెందారు. హైబీపీ కారణంగా తలలో నరాలు చిట్లిపోవడంతో మృతిచెందినట్లు అక్కడి వైద్యులు ధృవీకరించారని కుటుంబీకులు పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఒక్క టాబ్లెట్ కూడా ఎరుగరు రామజోగినాయుడు మాస్టారు తనకు ఊహ తెలిసినప్పట్టి నుంచి ఇప్పటివరకూ ఒక్కదఫా కూడా టాబ్లెట్ వేసి ఎరుగరని కుటుంబీకులు తెలిపారు. ఇంతవరకూ జ్వరం అనే మాట లేదని అన్నారు. నిత్యం యోగా, వ్యాయామం చేసేవారన్నారు. ఎన్నో సేవలు రామజోగినాయుడు మాస్టారు 35 సంవత్సరాలు పాటు వ్యాయామ ఉపా«ధ్యాయునిగా సేవలు అందించారు. 1979లో మెరకముడిదాం పాఠశాలలో విధుల్లో చేరిన ఆయన 2013లో వంగర మండలం అరసాడ జెడ్పీ హైస్కూల్లో పీడీగా పదవీ విరమణ చేశారు. వందల సంఖ్యలో విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ పోటీలకు తయారుచేశారు. వాలీబాల్ అసోసియేషన్ ఎలక్షన్ కమిటీ చైర్మన్‌గా, వాలీబాల్ అంతర్జాతీయ టీమ్‌కు మేనేజర్‌గా, చివరి సమయంలో జిల్లా కార్యదర్శిగా సేవలు అందిస్తూ వచ్చారు. శోకసంద్రంలో ఉనుకూరు తెంటు రామజోగినాయుడు మృతితో ఉనుకూరు గ్రామం మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. ఈయన మరణవార్త విని భార్య తవుడమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహం ఇంటికి చేరుకోగానే కుటుంబీకుల ఆర్తనాదాలు మిన్నంటాయి. పలు ప్రాంతాల నుంచి ఇక్కడకు చేరుకున్న ఆయన శిష్యగణం మాస్టారు లేవండి అంటూ మృతదేహంపై పడి కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు కంటతడిపెట్టింది. రామజోగినాయుడుకు ఇద్దరు కుమారులు ఉండగా పెద్ద కుమారుడు రవి వంగర మండలం మరువాడలో పీఈటీగా విధులు నిర్వహిస్తుండగా, రెండవ కుమారుడు శ్రీధర్ శ్రీహరిపురంలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. వేలాదిమంది అభిమానులు మధ్య రామజోగినాయుడు మృతదేహానికి మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. పలువురి సంతాపం రామజోగినాయుడు మృతిచెందిన విషయం తెలియగానే జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. తెంటు కుటుంబీకులుకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.సుందరరావు, డీఎస్డీఓ బి.శ్రీనివాసకుమార్, అ«థ్లెటిక్ కోచ్ కె.శ్రీధర్‌రావు, పీఈటీల జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ఎంవీ రమణ, ఎస్జీఎఫ్ కార్యదర్శి కె.రాజారావు, గ్రిగ్స్ కార్యదర్శి కె.మాధవరావు, జిల్లా వాలీబాల్ సంఘం ఉపాధ్యక్షులు బడగల హరిధరరావుతో పాటు అసోసియేషన్ సభ్యులు వై.పోలినాయుడు, ఎం.తవిటయ్య, కె.హరిబాబు, ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు మజ్జి మదన్మోహన్, రేగిడి మండలం ఏపీటీఎఫ్ అధ్యక్షులు మురపాక వెంకటరమణ, ఏఎంసీ మాజీ చైర్మన్ గేదెల వెంకటేశ్వరరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టంకాల అచ్చెన్నాయుడు, వావిలపల్లి జగన్మోహన్రావు, నెల్లి పెంటన్నాయుడు, గంటా మోహనరావుతో పాటు జిల్లా నలుమూలలు నుంచి పీఈటీలు, ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉనుకూరు చేరుకుని అంతిమయాత్రలో పాల్గొన్నారు. రామజోగినాయుడు మాస్టారు మృతికి ఎమ్మెల్యే సంతాపం రాజాం: రేగిడి మండలం ఉనుకూరు గ్రామానికి చెందిన జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి తెంటు రామజోగినాయుడు మృతికి మంగళవారం ఎమ్మెల్యే కంబాల జోగులు సంతాపం తెలిపారు. ఈయన మృతిచెందిన విషయం తెలుసుకుని దిగ్బ్రాంతికి గురయ్యారు. పార్టీ కార్యాలయం వద్ద సంతాప సూచికగా మౌనం పాటించారు. కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వాలీబాల్ క్రీడాభివృద్ధికి, జిల్లా క్రీడరంగానికి ఎనలేని సేవలు అందించారని పేర్కొన్నారు. -
కోదండరామయ్య అస్తమయం
విశాఖ స్పోర్ట్స్: ప్రముఖ వాలీబాల్ క్రీడాకారుడు, క్రీడా కురువృద్ధుడు కోదండరామయ్య (81) గురువారం తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయన అస్వస్థతకు గురయ్యారు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో మృతిచెందారు. ఆయన వాలీబాల్ క్రీడాకారునిగానే కాకుండా శిక్షకునిగా, వాలీబాల్ సంఘం ప్రతినిధిగా క్రీడాభిమానులకు సుపరిచితులు. నందిగామలోని సెనగపాడుకు చెందిన కోదండరామయ్యను తల్లిదండ్రులు క్రీడల వైపు ప్రోత్సహించారు. గుంటూరు లయోలా కళాశాలలో ఇంటర్, ఉస్మానియా వర్సిటీలో డిగ్రీ అభ్యసించారు. 1958లో బుచ్చిరామయ్య వద్ద వాలీబాల్‌లో ఓనమాలు నేర్చుకుని ఏడాదిలోనే ఆంధ్ర జట్టు సభ్యుడయ్యారు. చేరి మరో మూడేళ్లలో (1962) జట్టుకు నాయకత్వం వహించారు. 1963లో పటియాలాలోని భారత క్రీడా శిక్షణా సంస్థలో డిప్లొమా అందుకున్న ఆయన 1970లో జర్మనీలో డిప్లొమా చేశారు. 1971లో ఆంధ్ర విశ్వకళాపరిషత్‌లో వాలీబాల్ శిక్షకునిగా బాధ్యతలు చేపట్టారు.1982 నుంచి 2015 వరకు ఆంధ్రప్రదేశ్ వాలీబాల్ సంఘానికి అధ్యక్షునిగా సుదీర్ఘ కాలం సేవలందించారు. అవిభాజ్య ఏపీలో వాలీబాల్ క్రీడ అభివృద్ధి చెందడంలో కోదండరామయ్య కీలక పాత్ర పోషించారు. ఆయనకు భార్య అనసూయాదేవి, కుమారుడు శ్రీధర్, కుమార్తె జానకి ఉన్నారు. -
ప్రొ వాలీబాల్ లీగ్‌లో హైదరాబాద్ జట్టు ‘బ్లాక్ హాక్స్’
తొలిసారి నిర్వహించనున్న ప్రొ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)లో ఆరు జట్లు పాల్గొంటున్నాయి. టోర్నీకి సంబంధించిన వివరాలను లీగ్ సీఈఓ జాయ్ భట్టాచార్య సోమవారం ప్రకటించారు. హైదరాబాద్ బ్లాక్ హాక్స్, చెన్నై స్పార్టన్స్, యు ముంబా వాలీ, అహ్మదాబాద్ డిఫెండర్స్, కాలికట్ హీరోస్, కొచ్చి బ్లూ స్పైకర్స్ పేర్లతో ఆరు టీమ్‌లు బరిలోకి దిగనున్నాయి. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) టీమ్ హైదరాబాద్ హంటర్స్ యజమానులే ప్రొ వాలీబాల్ హైదరాబాద్ టీమ్‌ను కూడా కొనుగోలు చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 22 వరకు చెన్నై, కొచ్చిలలో ఈ టోర్నీ జరుగుతుంది. ఒక్కో జట్టులో 12 మంది ఆటగాళ్లు ఉంటారు. డిసెంబర్ 13, 14 తేదీల్లో వేలం జరుగుతుంది.