పారిస్ ఒలింపిక్స్‌లో చివరి రోజు సంచలన ఫలితం వచ్చి0ది. మహిళల వాలీబాల్ ఈవెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ అమెరికా జట్టుకు ఊహించని పరాజయం ఎదురైంది. తొలిసారి ఫైనల్ చేరిన ఇటలీ జట్టు 25–18, 25–20, 25–17తో అమెరికా జట్టును ఓడించి మొదటిసారి ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
మ్యాచ్ అనంతరం ఇటలీ సీనియర్ క్రీడాకారిణి, నాలుగోసారి ఒలింపిక్స్‌లో పోటీపడ్డ మోనికా డి జెనారోను సభ్యులంతా గాల్లో ఎగరేసి సంబరం చేసుకున్నారు. మాజీ చాంపియన్ బ్రెజిల్ 25–21, 27–25, 22–25, 25–15తో టర్కీ జట్టును ఓడించి కాంస్య పతకం సాధించింది.
ఫైనల్లో అమెరికా జట్టు ఓడిపోయినా ఒలింపిక్స్ మహిళల వాలీబాల్‌లో అత్యధికంగా ఏడు పతకాలు సాధించిన జట్టుగా అవతరించింది. అమెరికా జట్టు ఒలింపిక్స్‌లో ఒక స్వర్ణం, నాలుగు రజతాలు, రెండు కాంస్యాలు దక్కించుకుంది. సోవియట్ యూనియన్, చైనా, జపాన్, బ్రెజిల్ ఆరు పతకాల చొప్పున నెగ్గాయి.
Comments
Please login to add a commentAdd a comment