సెయింట్‌ జోసెఫ్‌ జట్టుకు టైటిల్‌ | Saint joseph gets title | Sakshi
Sakshi News home page

సెయింట్‌ జోసెఫ్‌ జట్టుకు టైటిల్‌

Published Fri, Aug 25 2017 10:39 AM | Last Updated on Sun, Sep 17 2017 5:58 PM

సెయింట్‌ జోసెఫ్‌ జట్టుకు టైటిల్‌

సెయింట్‌ జోసెఫ్‌ జట్టుకు టైటిల్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ, ఏపీ రీజియన్‌ ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ స్కూల్స్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో సెయింట్‌ జోసెఫ్‌ (మలక్‌పేట్‌) వాలీబాల్‌ జట్టు సత్తా చాటింది. పేట్‌ బషీరాబాద్‌లోని సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌ వేదికగా జరిగిన ఈ టోర్నీలో జూనియర్‌ బాలికల విభాగంలో టైటిల్‌ను సాధించింది. వరుసగా మూడో ఏడాది ఈ టైటిల్‌ను సెయింట్‌ జోసెఫ్‌  బాలికల జట్టు గెలుచుకోవడం విశేషం.

 

గురువారం జరిగిన ఫైనల్లో సెయింట్‌ జోసెఫ్‌ 15– 25, 22–25తో సెయింట్‌ జోసెఫ్‌ పబ్లిక్‌ స్కూల్‌ (హబ్సిగూడ) జట్టుపై విజయం సాధించింది. ఈ సందర్భంగా విజేతగా నిలిచిన బాలికల జట్టును ఫిజికల్‌ డైరెక్టర్‌ వి. నాగ భద్రం, కోచ్‌ సిద్ధి రాజ్, స్కూల్‌ ప్రధానోపాధ్యాయిని సుందరి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement