రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలకు ఇనుగుర్తి విద్యార్థులు | Inugurti students at state competitions in volleyball | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలకు ఇనుగుర్తి విద్యార్థులు

Published Mon, Aug 15 2016 12:37 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM

రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలకు ఇనుగుర్తి విద్యార్థులు

రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలకు ఇనుగుర్తి విద్యార్థులు

కేసముద్రం : మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఈనెల 21వ తేదీ నుంచి 23 వరకు జరిగే రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలకు ఇనుగుర్తి జిల్లా పరిషత్‌ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎంపికైనట్లు పీఈటీ కొమ్ము రాజేందర్‌ తెలిపారు. పాఠశాలలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వరంగల్‌ రంగశాయిపేట జూనియర్‌ కళాశాలలో స్టూడెంట్‌ ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో విద్యార్థులు కిరణ్‌కుమార్, వినయ్, గణేష్, మధు, ప్రణయ్‌ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా వారు రాణించి జాతీయస్థాయికి అర్హత సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం పోటీలకు ఎంపికైన విద్యార్థులను వద్దిరాజు సోదరులు, ఎంపీటీసీ సభ్యురాలు దీకొండ యాకలక్ష్మీ, సీనియర్‌ క్రీడాకారుడు సట్ల బిక్షపతి అభినందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement