ఊరంతా ఉద్దండులే..! | vallyball players special story | Sakshi
Sakshi News home page

ఊరంతా ఉద్దండులే..!

Published Sun, Jul 10 2016 9:03 PM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM

ఊరంతా ఉద్దండులే..! - Sakshi

ఊరంతా ఉద్దండులే..!

వాలీబాల్ క్రీడాకారులే.. ఏకలవ్యుడే ఆదర్శం..గెలుపే లక్ష్యం
బరిలోకి దిగారంటే ప్రత్యర్థి మట్టికరవాల్సిందే
జాతీయ, రాష్ట్ర స్థాయిలో రాణింపు
ఇప్పటికే నలుగురికి పీఈటీ ఉద్యోగాలు
11మంది ఎస్‌ఐలు, 14మంది కానిస్టేబుళ్లుగా అర్హత
ఇది సర్ధన యువకుల ప్రత్యేకత మాటే మంత్రము... మనసే బంధము..

 అన్నట్టుగా సర్ధన గ్రామ యువకులంతా ఆటపై మనసు పెట్టారు. మంచి ఆట గాళ్లుగా పేరుతెచ్చుకున్నారు. వీరికి ఈ ఆట అంటే ప్రాణం.  కోచ్ లేకపోయినా ఎవరికి వారు ఏకలవ్యులుగా మారి పట్టుదలతో నేర్చుకున్నారు. ఆటలో ఆరితేరారు. కోర్టులోకి దిగారంటే ప్రత్యర్థులను మట్టికరిపిస్తారు. వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలోనూ పేరు తెచ్చుకున్నారు. ఆటలో ప్రావీణ్యం కారణంగా నలుగురు పీఈటీలయ్యారు. మరో 25 మంది ఫిజికల్ ఎడ్యుకేషన్ శిక్షణ పూర్తిచేశారు. 11 మంది ఎస్‌ఐలుగా, 14 మంది కానిస్టేబుళ్లుగా అర్హత సాధించారు. ఆటే కాదు చదువులోనూ సత్తాచాటుతున్నారు. దట్ ఈజ్ సర్ధన.. అంటూ తమ గొప్పతనాన్ని చాటుతున్నారు ఇక్కడి యువకులు.

మెదక్: ఏకలవ్యుడిని ఆదర్శంగా తీసుకున్నారో ఏమో.. ఆ ఊరంగా వాలీబాల్ క్రీడాకారులే! శిక్షకుడు లేకుండానే ఆట లో రాణిస్తున్నారు. గెలుపే లక్ష్యం గా ప్రత్యర్థులపై షాట్‌లతో ఎటాక్ చేస్తారు. ఇదీ సర్ధన గ్రామస్తుల సక్సెస్ స్టోరీ.  మెదక్ మండలం సర్ధన గ్రామంలో 1969లో హైస్కూల్ ఏర్పాటుచేశారు. అప్పటి నుంచి గ్రామస్తులకు వాలీబాల్‌పై క్రీడపై మక్కువ పెరిగింది. ఆ ఆట రాని యువకులు లేరంటే అతిశయోక్తి కాదు. గ్రామానికి చెందిన నలుగురు పీఈటీలుగా ఉ ద్యోగం సంపాదించగా, మరో 25 మం ది పీఈటీ ట్రైనింగ్ పూర్తిచేసుకొని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. వీరంతా వాలీబాల్ క్రీడాకారులు కావడం విశేషం. 1994లో ఆ గ్రామ యువకులు ‘సర్ధన స్పోర్ట్స్ అండ్ రిక్రియేషన్ క్లబ్’ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి సుమారు 22 ఏళ్లుగా వాలీబాల్ క్రీడలో అద్భుతంగా రాణిస్తున్నారు. మండల, జిల్లా స్థాయిలోనూ ఆడి లెక్కలేనన్ని పథకాలు కైవసం చేసుకున్నారు. రాష్ట్రస్థాయిలో  నిర్మల్, అనంతపూర్, విజయవాడ, నిజామాబాద్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో  ఆడారు. 2013 సంవత్సరంలో చత్తీస్‌ఘడ్‌తో జాతీయస్థాయిలో ఆడారు.

 చదువులోనూ రాణింపు
ఆటపైనే కాదు చదువులోనూ అనేక మంది రాణిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుల్ అర్హత పరీక్షల్లో కొందరు ఉత్తమ ఫలితాలు సాధించారు. 11 మంది ఎస్సైలుగా, 14 మంది కానిస్టేబుల్స్‌గా అర్హత సాధించారు.

ఆటే ప్రాణం
47 ఏళ్లుగా గ్రామంలో వాలీబాల్ ఆడుతున్నారు. 22 ఏళ్ల క్రితం సర్ధన స్పోర్ట్స్ అండ్ రిక్రియేషన్ క్లబ్ ఏర్పాటు చేశాం. జిల్లాలో వాలీబాల్ క్రీడాకారుల సంఖ్య అధికంగా ఉండేది ఒక్క సర్ధనలోనే. వాలీబాల్ కోర్టు వద్ద లైటింగ్ కోసం రూ.20 వేలు సొంతంగా వినియోగించా.  - రాంచందర్‌రావు, క్రీడాకారుడు, సర్ధన

జాతీయస్థాయిలో ఆడా
2013లో చత్తీస్‌ఘడ్-ఆంధ్రప్రదేశ్ మధ్య హైదరాబాద్‌లో జరిగిన పోటీల్లో రాష్ట్రం తరపున వాలీబాల్ ఆడా. ఇంకా ఉన్నతస్థాయిలో రాణించాలన్నదే నా లక్ష్యం. ఇందుకోసం ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రాక్టీస్ చేస్తున్నా. - ఎండి.ముజాయిద్, క్రీడాకారుడు, సర్ధన

ఆటతో ఉద్యోగం సాధించా
స్పోర్ట్స్ కోటాలో నాకు ఉద్యోగం వచ్చింది. పదేళ్ల క్రితం పీఈటీగా సెలెక్ట్ అయ్యా. గ్రామంలో నాతో పాటు అనేక మంది వాలీబాల్ క్రీడాకారులు ఉన్నారు. ఇప్పటికి నలుగురం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం చేస్తున్నాం. మరో 25మంది శిక్షణ పూర్తిచేసుకున్నారు.  - ఎస్.శ్రీనివాస్‌రావు, పీడీ, సర్ధన

వాలీబాల్‌కు సర్ధన కేరాఫ్
మా గ్రామంలోని యువకులంతా వాలీబాల్ క్రీడాకారులే. చదువులోనూ రాణించడం మా ఊరికి ఎంతో పేరు వచ్చింది. ప్రస్తుతం నేను టీచర్‌గా పనిచేస్తున్నా. అయినా, ప్రతి రోజు కోర్టుకు వెళ్లి ప్రాక్టీస్ చేస్తా. - ఎండీ ఫయాజ్ అలీ, టీచర్,సర్ధన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement