కామారెడ్డి కేసులో అవన్నీ ఊహాగానాలే! | Police Are Investigating The Kamareddy Case From Multiple Angles | Sakshi
Sakshi News home page

కామారెడ్డి కేసులో అవన్నీ ఊహాగానాలే!

Published Tue, Dec 31 2024 11:33 AM | Last Updated on Tue, Dec 31 2024 2:53 PM

Police Are Investigating The Kamareddy Case From Multiple Angles

సాక్షి, కామారెడ్డి: జిల్లాలో కలకలం సృష్టించిన ఎస్‌ఐ, కానిస్టేబుల్, మరో యువకుడి మృతి కేసులో సస్పెన్స్‌ వీడలేదు. ఘటన జరిగిన ఏడు రోజులు కావొస్తున్న ట్రై యాంగిల్ సూసైడ్‌ మిస్టరీ ఇంకా పురోగతి సాధించలేదు. ఎస్‌ఐ సాయికుమార్, మహిళా కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ మృతిపై ఎన్నో అనుమానాలున్నాయి. ముగ్గురు మృతి కేసులో విభిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి ఘటనను ప్రత్యక్షంగా చుసినవారు ఐ విట్ నెస్ లేదని  ఎస్పీ సింధు శర్మ స్పష్టం చేశారు.

ముందుగా ఒకరు చెరువులో దూకడంతో మరో ఇద్దరు కాపాడేందుకు వెళ్లి మృతి చెందారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  నిఖిల్ ప్రాణహాని ఫిర్యాదు విషయంలో కూడా విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. 

మరో వైపు కామారెడ్డి(Kamareddy) పోలీసులపై కేసు పురోగతిపై ఒత్తిడి పెరుగుతుంది. సైబర్‌ ఫోరెన్సిక్‌ రిపోర్టు కీలకంగా మారనుంది. కేసు దర్యాప్తులో అంతా ఊహగానాలే వ్యక్తమవుతున్నాయి.

ఈ కేసులో వారి ఫోన్‌కాల్, వాట్సాప్‌ చాటింగ్‌ డేటా కీలకంగా మారింది. చనిపోయే రోజు భిక్కనూరు ఎస్‌ఐ సాయికుమార్, బీబీ పేట కానిస్టేబుల్‌ శ్రుతి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ నిఖిల్‌ ఫోన్‌ లో గంటలకొద్దీ మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు ముగ్గురు ఈ నెల 25న కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని అడ్లూర్‌ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో నీటమునిగి చనిపోయిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: ఎస్సై ఐ ఫోన్‌ వాట్సాప్‌ చాటింగ్‌లో ఏముందో..

బుధవారం వేకువజాము నుంచే వీరు ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు కాల్‌ డేటా ద్వారా స్పష్టమైంది. సాయికుమార్‌ రెండు ఫోన్లలో కలిపి మూడు సిమ్‌లు వాడగా, నిఖిల్‌ రెండు ఫోన్లు వాడాడు. శ్రుతి ఒక ఫోన్‌ వాడుతుండేది. చనిపోయే వారం రోజుల ముందు నుంచి ఎక్కువ సార్లు ఫోన్‌లో మాట్లాడుకు న్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం నుంచి ఒక్క చోటు కి చేరుకునేదాకా వీరు ఫోన్‌లో మాట్లాడినట్టు గుర్తించారు. జిల్లా అధికారులతో ఫోన్‌ కాన్ఫరెన్స్‌లో ఉన్న సమయంలో తప్ప.. మిగతా సమయమంతా శ్రుతి(Shruthi), నిఖిల్‌తో సాయికుమార్‌ ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నట్టు తెలుస్తోంది.

శ్రుతి, నిఖిల్‌ వాట్సాప్‌(Whatsapp) మెసేజ్‌లను పోలీసులు పరిశీలించారు. వీరి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్టు వాట్సాప్‌ మెసేజ్‌ లు స్పష్టం చేస్తున్నాయని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, వీరి ప్రేమ వ్యవహారంలో సాయికుమార్‌ ఎందుకు తలదూర్చాడన్నది ఇప్పుడు కీలకంగా మారింది. నిఖిల్, శ్రుతి పెళ్లి చేసుకోవాలనుకున్నారని.. కానీ విభేదాలు తలెత్తి పెళ్లి వాయిదా వేయడం వల్లే గొడవ ముదిరింది అన్న ప్రచారం కూడా జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement