సాక్షి, హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బ్లాక్ హాక్స్ జట్టు 2–3 (12–15, 15–14, 12–15, 15–11, 13–15) సెట్‌ల తేడాతో బెంగళూరు టార్పోడస్ జట్టు చేతిలో పోరాడి ఓడిపోయింది. లవ్‌మీత్, పంకజ్ శర్మ బెంగళూరు జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించారు. మరో మ్యాచ్‌లో కోల్‌కతా థండర్‌బోల్ట్స్ 4–1తో (10–15, 15–11, 15–10, 15–12, 15–13) చెన్నై బ్లిట్జ్ జట్టుపై గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment