రూపే ప్రైమ్ వాలీబాల్ 2022 వేలం గురువారం కోల్‌కతాలోని హయత్ రీజెన్సీ సాల్ట్ లేక్ వద్ద జరిగింది. ఈ వేలానికి 523 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకోగా 45 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. రెండవ ఎడిషన్ రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ ఇంటర్నేషనల్,ప్లాటినమ్,గోల్డ్ విభాగాల్లో ఎనిమిది జట్లు ఆటగాళ్లను కొనుగోలు చేశాయి.
హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఈ సీజన్ కోసం కొలంబియాకు చెందిన కార్లోస్ ఆండ్రెస్ జమోరా (ఎటాకర్), ఆస్ట్రేలియాకు చెందిన ట్రెంట్ ఓ డియా (మిడిల్ బ్లాకర్)ను అంతర్జాతీయ ప్లేయర్ విభాగంలో సొంతం చేసుకుంది. ఈ ఫ్రాంచైజీ రంజిత్ సింగ్ (సెట్టర్)ను 12.25 లక్షల రూపాయలకు ప్లాటినమ్ విభాగంలో కొనుగోలు చేసింది.హైదరాబాద్ ఫ్రాంచైజీ ఈ వేలంలో అంగముత్తు (యూనివర్శిల్) 7.40 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ ఫ్రాంచైజీ లాల్ సుజన్ ఎంవీ (సెట్టర్)ను 4.50 లక్షల రూపాయలకు, అషాముతుల్లా (ఎటాకర్)ను 5.30 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది.
బ్లాక్ హాక్స్ ఈ సీజన్ వేలంలో అరుణ్ జచారియస్ సిబీ (యూనివర్శిల్)ను 4 లక్షల రూపాయలు, సౌరభ్ మాన్ (మిడిల్ బ్లాకర్)ను మూడు లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ హోస్ట్ బ్రాడ్‌కాస్టర్‌గా కొనసాగనుంది. రెండవ సీజన్ రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ పవర్డ్ బై ఏ23 లో అభిమానులు ఆసక్తికరమైన 31 గేమ్స్ వీక్షించవచ్చు.
ఆటగాళ్ల జాబితా: (మొదటి రెండు రౌండ్ల వేలం వరకు)
రిటైన్డ్ ఆటగాళ్లు: గురు ప్రశాంత్ (యూనివర్శిల్), జాన్ జోసెఫ్ ఈజె (బ్లాకర్), ఆనంద్ కె (లిబెరో)
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: కార్లోస్ ఆండ్రెస్ ల్లానోస్ జమోరా (ఎటాకర్), ట్రెంట్ ఓ డియా (మిడిల్ బ్లాకర్), రంజిత్ సింగ్ (సెట్టర్), అంగముత్తు (యూనివర్శిల్), లాల్ సుజన్ ఎంవీ (సెట్టర్), అషామతుల్లా (ఎటాకర్), అరుణ్ జచారియాస్ సిబి(యూనివర్శిల్), సౌరభ్ మాన్ (మిడిల్ బ్లాకర్)
Comments
Please login to add a commentAdd a comment