Players auction
-
ఎల్పీఎల్ వేలం.. రైనాను మరిచిపోయారా? పట్టించుకోలేదా?
శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్వహించే లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్ 2023) చరిత్రలో తొలిసారి వేలం జరిగింది. జూన్ 14న(బుధవారం) ఎల్పీఎల్లో వేలం నిర్వహించారు. మొత్తం 360 మంది ప్లేయర్లు వేలంలో తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో భారత్ తరపున రిజిస్టర్ చేసుకుంది కేవలం సురేశ్ రైనా మాత్రమే. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం.. ఐపీఎల్లో కూడా ఏ జట్టు తరపున ఆడకపోవడంతో రైనాకు లైన్ క్లియర్ అయింది. ఐపీఎల్లో తనదైన ముద్ర వేసిన సురేశ్ రైనాకు లంక ప్రీమియర్ లీగ్‌లో మంచి ధర పలుకుతుందని అభిమానులు ఊహించారు. ఒక దశలో సురేశ్ రైనా పేరును లంక క్రికెట్ బోర్డు ఎల్‌పీఎల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉపయోగించుకుంటుందని భావించారు. కానీ వేలం సమయానికి సీన్ మొత్తం రివర్స్ అయింది. వేలం జరుగుతున్న సమయంలో సురేశ్ రైనా పేరు ఎక్కడా వినిపించలేదు. అలా అని అన్‌సోల్డ్ లిస్ట్‌లో ఉన్నాడా అంటే అది లేదు. మరి రైనా పేరు ఏమైనట్లు అని అభిమానులు కన్ఫూజ్కు గురయ్యారు. అయితే విషయమేంటంటే వేలంలో హోస్ట్‌గా వ్యవహరించిన చారుశర్మ సురేశ్ రైనా పేరును మరిచిపోయాడా లేక కావాలనే పట్టించుకోలేదా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై అటు రైనా కానీ ఇటు లంక క్రికెట్ బోర్డు గాని ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో రైనా లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడతాడా లేదా అనే అనుమానం వ్యక్తమవుతోంది. వాస్తవానికి రైనా తన బేస్‌ప్రైస్ ధరతో సెట్ నెంబర్ 11లో ఉన్నాడు. ఇదే సెట్లో రాసీ వాండర్ డుసెన్(సౌతాఫ్రికా), ఇమాముల్ హక్(పాకిస్తాన్), ఎవిన్ లూయిస్(వెస్టిండీస్) వంటి స్టార్లు ఉన్నారు. వీరిందరి పేర్లను పలికిన చారు శర్మ రైనా పేరు పలకడం మాత్రం మరిచిపోయాడు. అయితే ఇదే అభిమానులను కన్ఫూజ్న్కు గురయ్యేలా చేసింది. నిజంగా చారుశర్మ రైనా పేరును పలకడం మరిచిపోయారా.. లేదంటే చివరి నిమిషంలో రైనా పేరును వేలంలో తొలగించారా అనేది క్లారిటీ లేదు. టి20 క్రికెట్లో సురేశ్ రైనాకు మంచి రికార్డు ఉంది. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన క్రికెటర్‌గా పేరు పొందిన రైనా 205 మ్యాచ్‌లాడి 5528 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సీఎస్కే నాలుగుసార్లు ఛాంపియన్‌గా(మొత్తంగా ఐదుసార్లు) నిలవడంలో రైనా పాత్ర కీలకం. అంతేకాదు టీమిండియా తరపున 78 టి20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 1609 పరుగులు చేసిన రైనా ఖాతాలో ఒక సెంచరీ సహా ఐదు హాఫ్ సెంచరీలు ఉండడం విశేషం. మరి ఇంతటి ట్రాక్ రికార్డు కలిగిన సురేశ్ రైనాకు లంక ప్రీమియర్ లీగ్‌లో చేదు అనుభవం ఎదురైందని చెప్పొచ్చు. అయితే దీనిపై క్లారిటీ వచ్చేవరకు రైనా ఎల్పీఎల్ ఆడతాడా లేదా అనేది తెలియదు. ఇప్పటికైతే రైనా ఎల్పీఎల్లో ఆడనట్లే. ఇక ఎల్పీఎల్లో ఈసారి పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ఒక్కడే ఐకాన్ ప్లేయర్‌గా ఉన్నాడు. కొలంబో స్ట్రైకర్స్‌కు బాబర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక నిన్నటి వేలంలో దిల్షాన్ మధుషనక అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా నిలిచాడు. మధుషనకను లైకా జఫ్నా కింగ్స్ 92వేల డాలర్లకు సొంతం చేసుకుంది. ఆ తర్వాత రెండో స్థానంలో చరిత్ అసలంక 80వేల డాలర్లకు(బేస్ ప్రైస్ 40వేల డాలర్లు) జఫ్నా కింగ్స్.. మూడో స్థానంలో ధనుంజయ డిసిల్వా(బేస్ ప్రైస్ 40వేల డాలర్లు)ను దంబుల్లా ఆరా 76వేల డాలర్లకు కొనుగోలు చేసింది. చదవండి: ఎల్పీఎల్ చరిత్రలో తొలిసారి వేలం.. అందరి దృష్టి ఆ క్రికెటర్‌పైనే -
ఎల్పీఎల్ చరిత్రలో తొలిసారి వేలం.. కళ్లన్నీ ఆ క్రికెటర్‌పైనే
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అంత కాకపోయినా లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్) కూడా బాగానే ప్రజాధరణ పొందుతుంది. గత సీజన్ ఇందుకు ఉదాహరణ. ఇప్పటివరకు ఐపీఎల్ మినహా మిగతా లీగ్‌ల్లో ఆడేందుకు సముఖత చూపని టీమిండియా మాజీ క్రికెటర్లు ఇప్పుడు బయటి లీగుల్లోనూ దర్శనమిస్తున్నారు. తాజాగా 2023 సీజన్‌కు సంబంధించి జూన్ 14న(బుధవారం) లంక ప్రీమియర్ లీగ్‌లో తొలిసారి వేలం జరగనుంది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ వేలానికి 500 మంది ఆటగాళ్లు తమ పేరును రిజిస్టర్ చేసుకున్నారు. వేలంలో ఐదు ఫ్రాంచైజీలు పాల్గొననుండగా.. ఐపీఎల్లో అనుసరించిన విధానాన్నే ఇక్కడ అమలు చేయనున్నారు. మొత్తం ఆటగాళ్ల కోసం 5లక్షల అమెరికన్ డాలర్డు ఖర్చు చేయనున్నారు. ఇక తొలిసారి జరగనున్న వేలానికి చారు శర్మ హోస్ట్‌గా వ్యవహరించనుండడం విశేషం. ఇక టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు తన పేరును రిజిస్టర్ చేసుకోవడం ఆసక్తి కలిగించింది. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా పేరు పొందిన రైనాకు మంచి ధర పలికే అవకాశం ఉంది. 50వేల యూఎస్ డాలర్ల కనీస ధరతో రైనా వేలంలోకి రానున్నాడు. సెప్టెంబర్ 2022లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రైనా ఆ తర్వాత 2023లో అబుదాబి టి10 టోర్నీలో పాల్గొన్నాడు. అయితే వేలానికి ముందే ఆయా ఫ్రాంచైజీలు కొందరు స్టార్ ప్లేయర్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. వారిలో బాబర్ ఆజం, షకీబ్ అల్ హసన్ లాంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. వేలానికి ముందు ఆయా ఫ్రాంచైజీలు ఒప్పందం చేసుకున్న ఆటగాళ్లు వీరే.. ► కొలంబో స్ట్రైకర్స్: బాబర్ ఆజం, మతీషా పతిరనా, నసీమ్ షా, చమికా కరుణరత్నే ► దంబుల్లా ఆరా: మాథ్యూ వేడ్, కుసల్ మెండిస్, లుంగి ఎన్గిడి, అవిష్క ఫెర్నాండో ► జాఫ్నా కింగ్స్: మహేశ్ తీక్షణ, డేవిడ్ మిల్లర్, తిసర పెరీరా, రహ్మానుల్లా గుర్బాజ్ ► క్యాండీ ఫాల్కన్స్: వనిందు హసరంగా, ఏంజెలో మాథ్యూస్, ముజీబ్ ఉర్ రెహమాన్, ఫఖర్ జమాన్ ► గాలే గ్లాడియేటర్స్: భానుక రాజపక్స, దసున్ షనక, షకీబ్ అల్ హసన్, తబ్రైజ్ షమ్సీ ఇప్పటివరకు మూడు సీజన్లు విజయవంతం కాగా నాలుగో సీజన్ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కాగా జూలై 30 నుంచి ఆగస్టు 20 వరకు లంక ప్రీమియర్ లీగ్ నాలుగో ఎడిషన్ జరగనుంది. Charu Sharma thrilled to be auctioneer for LPL 2023, the league's first ever auction! 🏏🔨https://t.co/xu1EFeab3C #lpl2023 — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 12, 2023 చదవండి: ఒక రాధా.. ఇద్దరు కృష్ణులు! -
వేలంలో 405 మంది ఆటగాళ్లు.. షార్ట్‌లిస్ట్ చేసిన ఫ్రాంచైజీలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 కోసం డిసెంబర్ 23న మినీవేలం జరగనుంది. వేలంలో పాల్గొనబోయేవారిని ఆయా ఫ్రాంచైజీలు షార్ట్‌లిస్ట్ చేశాయి. మొత్తంగా 991 ప్లేయర్లలో 405 మంది వేలంలోకి రానున్నారు. ఇంతకుముందు 369 మందిని షార్ట్ లిస్ట్ చేయగా.. తాజాగా ఫ్రాంఛైజీలు మరో 36 మందిని ఇందులో చేర్చాల్సిందిగా కోరాయి. దీంతో మొత్తం వేలంలో పాల్గొనే ప్లేయర్స్ సంఖ్య 405కి చేరింది. ఈసారి మినీ వేలానికి కొచ్చి వేదిక కానుంది. ఈ మొత్తం 405 మంది ప్లేయర్స్‌లో 273 మంది ఇండియన్ ప్లేయర్స్ కాగా.. 132 మంది విదేశీ ప్లేయర్స్. వీళ్లలో నలుగురు ఐసీసీ అసోసియేట్ దేశాలకు చెందిన వాళ్లు. ఈ మొత్తం 405 మంది ప్లేయర్స్‌లో 119 మంది ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ ఆడిన వాళ్లు. ఇక 282 మంది తమ నేషనల్ టీమ్స్‌కు ఆడని వాళ్లు ఉన్నారు. ప్రస్తుతం పది ఫ్రాంఛైజీలకు మొత్తం 87 మంది ప్లేయర్స్‌ను తీసుకునే అవకాశం ఉంది. వీళ్లలో 30 వరకూ విదేశీ ప్లేయర్స్‌ను తీసుకోవచ్చు. ఇక వేలంలో అత్యధిక బేస్ ప్రైస్ అయిన రూ.2 కోట్లతో 19 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు. ఇందులో ఇండియన్ ప్లేయర్స్ ఎవరూ లేరు. 11 మంది రూ.1.5 కోట్ల కనీస ధరతో ఉన్నారు. ఇక రూ.కోటి బేస్‌ప్రైస్‌తో 20 మంది ఉండగా.. అందులో మయాంక్ అగర్వాల్, మనీష్ పాండేలాంటి ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. ఐపీఎల్ వేలం డిసెంబర్ 23న మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతుంది. రూ.2 కోట్ల లిస్ట్‌లో ప్లేయర్స్: కౌల్టర్ నైల్, కామెరున్ గ్రీన్, ట్రెవిస్ హెడ్, క్రిస్ లిన్, టామ్ బాంటన్, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, టైమాల్ మిల్స్, జేమీ ఓవర్టన్, క్రెయిగ్ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, ఆడమ్ మిల్న్, జిమ్మీ నీషమ్, కేన్ విలియమ్సన్, రైలీ రూసో, రాసీ వెండెర్ డుసెన్, ఏంజెలో మాథ్యూస్, నికోలస్ పూరన్, జేసన్ హోల్డర్. రూ.1.5 కోట్ల లిస్ట్‌లోని ప్లేయర్స్: సీన్ అబాట్, రైలీ మెరెడిత్, జై రిచర్డసన్, ఆడమ్ జంపా, షకీబుల్ హసన్, హ్యారీ బ్రూక్, విల్ జాక్స్, డేవిడ్ మలన్, జేసన్ రాయ్, షెర్ఫానె రూథర్‌ఫర్డ్ రూ.కోటి లిస్ట్‌లోని ప్లేయర్స్: మయాంక్ అగర్వాల్, కేదార్ జాదవ్, మనీష్ పాండే, మహ్మద్ నబీ, ముజీబుర్ రెహమాన్, మోయిసిస్ హెన్రిక్స్, ఆండ్రూ టై, జో రూట్, లూక్ వుడ్, మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, మార్టిన్ గప్టిల్, కైల్ జేమీసన్, మాట్ హెన్రీ, టామ్ లేథమ్, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్, తబ్రైజ్ షంసీ, కుశాల్ పెరీరా, రోస్టన్ చేజ్, రఖీమ్ కార్న్‌వాల్, షెయ్ హోప్, అకీల్ హొస్సేన్, డేవిడ్ వీస్ 🚨 NEWS 🚨: TATA IPL 2023 Player Auction list announced. #TATAIPLAuction Find all the details 🔽https://t.co/fpLNc6XSMH — IndianPremierLeague (@IPL) December 13, 2022 చదవండి: Steve Smith: ఎలుకలపై కోపం.. అందుకే చిరిగిన క్యాప్‌తో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై కన్నెర్ర చేసిన ఐసీసీ.. 8 నెలల్లో రెండోసారి -
రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ 2022 వేలం
రూపే ప్రైమ్ వాలీబాల్ 2022 వేలం గురువారం కోల్‌కతాలోని హయత్ రీజెన్సీ సాల్ట్ లేక్ వద్ద జరిగింది. ఈ వేలానికి 523 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకోగా 45 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. రెండవ ఎడిషన్ రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ ఇంటర్నేషనల్,ప్లాటినమ్,గోల్డ్ విభాగాల్లో ఎనిమిది జట్లు ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఈ సీజన్ కోసం కొలంబియాకు చెందిన కార్లోస్ ఆండ్రెస్ జమోరా (ఎటాకర్), ఆస్ట్రేలియాకు చెందిన ట్రెంట్ ఓ డియా (మిడిల్ బ్లాకర్)ను అంతర్జాతీయ ప్లేయర్ విభాగంలో సొంతం చేసుకుంది. ఈ ఫ్రాంచైజీ రంజిత్ సింగ్ (సెట్టర్)ను 12.25 లక్షల రూపాయలకు ప్లాటినమ్ విభాగంలో కొనుగోలు చేసింది.హైదరాబాద్ ఫ్రాంచైజీ ఈ వేలంలో అంగముత్తు (యూనివర్శిల్) 7.40 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ ఫ్రాంచైజీ లాల్ సుజన్ ఎంవీ (సెట్టర్)ను 4.50 లక్షల రూపాయలకు, అషాముతుల్లా (ఎటాకర్)ను 5.30 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. బ్లాక్ హాక్స్ ఈ సీజన్ వేలంలో అరుణ్ జచారియస్ సిబీ (యూనివర్శిల్)ను 4 లక్షల రూపాయలు, సౌరభ్ మాన్ (మిడిల్ బ్లాకర్)ను మూడు లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ హోస్ట్ బ్రాడ్‌కాస్టర్‌గా కొనసాగనుంది. రెండవ సీజన్ రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ పవర్డ్ బై ఏ23 లో అభిమానులు ఆసక్తికరమైన 31 గేమ్స్ వీక్షించవచ్చు. ఆటగాళ్ల జాబితా: (మొదటి రెండు రౌండ్ల వేలం వరకు) రిటైన్డ్ ఆటగాళ్లు: గురు ప్రశాంత్ (యూనివర్శిల్), జాన్ జోసెఫ్ ఈజె (బ్లాకర్), ఆనంద్ కె (లిబెరో) వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: కార్లోస్ ఆండ్రెస్ ల్లానోస్ జమోరా (ఎటాకర్), ట్రెంట్ ఓ డియా (మిడిల్ బ్లాకర్), రంజిత్ సింగ్ (సెట్టర్), అంగముత్తు (యూనివర్శిల్), లాల్ సుజన్ ఎంవీ (సెట్టర్), అషామతుల్లా (ఎటాకర్), అరుణ్ జచారియాస్ సిబి(యూనివర్శిల్), సౌరభ్ మాన్ (మిడిల్ బ్లాకర్) -
సిద్ధార్థ్ దేశాయ్‌కు రూ.1.45 కోట్లు
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ –7 కోసం జరిగిన వేలంలో 27 ఏళ్ల సిద్ధార్థ్ శిరీష్ దేశాయ్ పంట పండింది. సోమవారం ఇక్కడ జరిగిన వేలంలో తెలుగు టైటాన్స్ జట్టు సిద్ధార్థ్‌ను రూ. 1 కోటి 45 లక్షలకు సొంతం చేసుకుంది. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన సిద్ధార్థ్ గత సీజన్లో యు ముంబాకు ప్రాతినిధ్యం వహించాడు. ఆరో సీజన్లో అతను అత్యధిక పాయింట్ల జాబితాలో మూడో స్థానంలో (221 పాయింట్లు) నిలిచాడు. వేలంలో కోటి రూపాయలు దాటిన జాబితాలో రెండో ఆటగాడిగా నితిన్ తోమర్ నిలిచాడు. పుణేరీ పల్టన్ రూ. 1.20 కోట్లు చెల్లించి ‘ఫైనల్ బిడ్ మ్యాచ్’ ద్వారా తోమర్‌ను రిటైన్ చేసుకుంది. వేలంలో జరిగిన ప్రధాన మార్పులలో హర్యానా స్టీలర్స్ టాప్ రైడర్ మోను గోయత్... యూపీ యోధ (రూ. 93 లక్షలు)కు తరలి వెళ్లగా... ప్రొ కబడ్డీ లీగ్ ప్రారంభమమైన నాటినుంచి తెలుగు టైటాన్స్‌తోనే ఉన్న స్టార్ ఆటగాడు రాహుల్ చౌదరి ఈ సారి తమిళ్ తలైవాస్ (రూ. 94 లక్షలు)కు మారాడు. మరో ఆటగాడు సందీప్ నర్వాల్‌ను యు ముంబా (రూ. 89 లక్షలు) దక్కించుకుంది. విదేశీ ఆటగాళ్లలో ఇరాన్‌కు చెందిన మొహమ్మద్ ఇస్మాయిల్ నబీ బ„Š కు అత్యధిక మొత్తం దక్కింది. బెంగాల్ వారియర్స్ రూ. 77.75 లక్షలకు ఇస్మాయిల్‌ను తీసుకుంది. ఇరాన్‌కే చెందిన అబోజర్ మొహజల్ మిగానికి రూ. 75 లక్షలు చెల్లించి తెలుగు టైటాన్స్ అట్టిపెట్టుకోవడం విశేషం. విదేశీ ఆటగాళ్లలో జంగ్ కున్ లి (పట్నా– రూ. 40 లక్షలు), మొహమ్మద్ ఇస్మాయిల్ మగ్సూదు (పట్నా – రూ. 35 లక్షలు), డాంగ్ గియోన్ లీ (యు ముంబా – రూ. 25 లక్షలు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. తెలుగు టైటాన్స్ అబోజర్‌తో పాటు విశాల్ భరద్వాజ్‌ను కొనసాగించింది. జూలై 19నుంచి టోర్నీ ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ జూలై 19 నుంచి అక్టోబర్ 9 వరకు జరుగుతుంది. గత సీజన్లో ప్రేక్షకాదరణ తగ్గడంతో మళ్లీ పాత షెడ్యూలునే ఖారారు చేశారు. ఆరో సీజన్ చాలా ఆలస్యంగా అక్టోబర్‌లో ప్రారంభించారు. అయితే ఆ సమయంలో వరుసగా పెద్ద పండగలు ఉండటంతో వీక్షకుల శాతం తగ్గింది. దీంతో ఏడో సీజన్‌ను గతంలోలాగే జూలైలోనే మొదలుపెట్టి ఫెస్టివల్స్‌కు ముందే ముగిస్తామని లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి తెలిపారు. -
వేలం వేళా విశేషం
►నేడు ఐపీఎల్–10 వేలం ► బరిలో 357 మంది ఆటగాళ్లు ► 76 మందికే అవకాశం ► ఉదయం గం.9.00 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం ప్రపంచ వ్యాప్తంగా గొప్ప హిట్టర్‌గా గుర్తింపు ఉండవచ్చు... కానీ ఐపీఎల్ ఫ్రాంచైజీలు పట్టించుకోకపోవచ్చు. ఎవరికీ తెలియని అనామకుడు కావచ్చు... ప్రతిభ ఉంటే చాలు కోట్లు వచ్చి పడవచ్చు. పాత పేరు ప్రఖ్యాతులకు ఇక్కడ చోటు లేదు... రికార్డులు కొల్లగొట్టిన వారికి కూడా రూపాయి ఇచ్చేందుకు యజమానులు వెనుకాడవచ్చు... జట్టుకు అతని అవసరం ఎంతవరకు ఉందన్నదే ముఖ్యం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడితే చాలు సుడి తిరుగుతుందనే కల కుర్రాళ్లది అయితే, డబ్బులు ఎన్ని వచ్చినా ఫర్వాలేదు, లీగ్‌లో భాగమైతే చాలని భావించే అంతర్జాతీయ క్రికెటర్లు కోకొల్లలు. ఐపీఎల్ మహిమ అలాంటిది మరి. ఈ నేపథ్యంలో కొత్త, పాత ఆటగాళ్లు మరోసారి ఐపీఎల్లో భాగమయ్యేందుకు సిద్ధమయ్యారు. 2017 సీజన్ కోసం సోమవారం జరిగే వేలంలో వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈసారి బంపర్ ఆఫర్ ఎవరికో... బ్యాడ్‌లక్ ఎవరిదో? బెంగళూరు: క్రికెట్ అభిమానులకు తొమ్మిది సీజన్లుగా ఫుల్ వినోదాన్ని అందిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో ఏడాదిలోకి ప్రవేశించింది. 2017 సీజన్ కోసం తమ ఆటగాళ్లను ఎంచుకునేందుకు ఎనిమిది ఫ్రాంచైజీలు సన్నద్ధమయ్యాయి. పదేళ్ల ఐపీఎల్ అంకం ముగిసిన తర్వాత వచ్చే సంవత్సరం నుంచి ఫ్రాంచైజీలు, ఆటగాళ్లలో పూర్తి స్థాయిలో మార్పులు చోటు చేసుకుంటాయి. అందువల్ల తమ జట్టులో మిగిలిన స్థానాల కోసం ఈ ఒక్క ఏడాదికే జట్లు క్రికెటర్లను సొంతం చేసుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్–10 కోసం నేడు (సోమవారం) జరిగే వేలం ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. రూ.10 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు కనీస ధరతో ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. రూ. 2 కోట్ల కనీస ధరతో ఏడుగురు ప్రధాన ఆటగాళ్లు ఉన్నారు. వేలంలో తొలిసారి ఐదుగురు అఫ్ఘానిస్థాన్ ఆటగాళ్లు కూడా పోటీ పడుతుండటం ఈసారి విశేషం. ఐపీఎల్ ఫ్రాంచైజీలను కేవలం ఆటగాళ్ల ప్రదర్శన, స్ట్రైక్‌రేట్, ఎకానమీలాంటివే కాకుండా ఇతర అంశాలు కూడా ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో ఈసారి కూడా వేలంలో అనూహ్య ఎంపికలు ఉండవచ్చు. జట్లు ఏం కోరుకుంటున్నాయి... అందుబాటులో ఉన్న క్రికెటర్లు, ఫ్రాంచైజీల అవసరాన్ని బట్టి చూస్తే కొన్ని విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విదేశీ ఆల్‌రౌండర్లు, విదేశీ పేస్ బౌలర్ల కోసం ఎక్కువగా బిడ్డింగ్ జరగవచ్చు. స్పిన్నర్లకు పెద్ద మొత్తం పలికే అవకాశం చాలా తక్కువ కాగా... బ్యాట్స్‌మెన్ కోసం కూడా యజమానులు వెచ్చించే మొత్తం తక్కువగా ఉండనుంది. ఎందుకంటే ఎనిమిది టీమ్‌లలో ఎవరికీ కూడా ఇప్పుడు బ్యాట్స్‌మన్ అవసరం పెద్దగా లేదు. చేతిలో ఉన్న మొత్తం, ఆటగాళ్ల అవసరం చూస్తే ఈసారి కోల్‌కతా నైట్‌రైడర్స్ చురుగ్గా వేలంలో పాల్గొనవచ్చని అంచనా. ఒక జట్టుకు అత్యధికంగా అనుమతించిన ఆటగాళ్ల సంఖ్య 27 కాగా, చాలా జట్లు 22 నుంచి 24కే పరిమితం చేసుకునే ఆలోచనతో ఉన్నాయి. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా క్రికెటర్లు లీగ్ మధ్యలోనే వెళ్లిపోయే అవకాశం ఉండటంతో టీమ్‌లు ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ (అందుబాటులో రూ. 20.90 కోట్లు): డిఫెండింగ్ చాంపియన్‌గా ఈ జట్టు పెద్దగా మార్పులు కోరుకోవడం లేదు. గాయం నుంచి కోలుకుంటున్న ముస్తఫిజుర్‌కు ప్రత్యామ్నాయంగా ఒక విదేశీ ఫాస్ట్ బౌలర్ అవసరం ఉంది. జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్ కూడా కావాలి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (రూ. 17.82 కోట్లు): తరచుగా గాయపడుతున్న వాట్సన్‌కు ప్రత్యామ్నాయంగా మరో విదేశీ ఆల్‌రౌండర్ అవసరం ఉంది. మిషెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) దూరం కావడంతో ప్రధాన పేసర్ అవసరం ఉంది. రబడ (దక్షిణాఫ్రికా) సరైన బౌలర్ కాగలడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ (రూ. 19.75 కోట్లు): విదేశీ ఆటగాళ్ల అవసరం చాలా ఉంది. షకీబ్ మినహా మరో ఆల్‌రౌండర్ లేడు. అంతగా గుర్తింపు లేని లిన్ మినహా విదేశీ బ్యాట్స్‌మెన్ ఎవరూ లేకపోగా, ఒక్క విదేశీ పేసర్ కూడా జట్టులో లేడు. భారీ మొత్తం వెచ్చించేందుకు సిద్ధం. ఢిల్లీ డేర్‌డెవిల్స్ (రూ. 23.10 కోట్లు): ఐపీఎల్ మధ్యలోనే వెళ్లిపోయే ముగ్గురు దక్షిణాఫ్రికా క్రికెటర్ల స్థానాల్లో ఆటగాళ్లు కావాలి. విదేశీ ఆల్‌రౌండర్, ఒక మంచి పేస్ బౌలర్‌తో పాటు అగ్రశ్రేణి మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అవసరం కూడా చాలా ఉంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (రూ. 23.35 కోట్లు): గత ఏడాది ఆఖరి స్థానంలో నిలిచినా పంజాబ్ 19 మంది ఆటగాళ్లపై నమ్మకముంచి కొనసాగించడం విశేషం. విదేశీ ఆల్‌రౌండర్, విదేశీ ఫాస్ట్ బౌలర్ కావాలి. భారత్‌కు చెందిన ఒక బ్యాట్స్‌మన్ అవసరం ఉంది. ముంబై ఇండియన్స్ (రూ.11.55 కోట్లు): ఫ్రాంచైజీ వద్ద పెద్దగా డబ్బులు లేవు. కొత్తగా ఆటగాళ్ల అవసరం కూడా ఎక్కువగా లేదు. రిజర్వ్‌లలో కూడా మంచి భారత ఆటగాళ్లు ఇప్పటికే ఉన్నారు. ఒక విదేశీ ఓపెనర్, గాయపడితే పొలార్డ్‌కు ప్రత్యామ్నాయంగా ఒక విదేశీ ఆల్‌రౌండర్ చాలు. రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ (రూ. 17.50 కోట్లు): ఆరుగురు విదేశీ ఆటగాళ్లను విడుదల చేసింది. కాబట్టి ఇప్పుడు కనీసం ఇద్దరు విదేశీ ఆల్‌రౌండర్లు, ఒక విదేశీ పేసర్ అవసరం ఉంది. అశ్విన్‌కు అండగా మరో దేశవాళీ నాణ్యమైన స్పిన్నర్ కావాలి. గుజరాత్ లయన్స్ (రూ.14.35 కోట్లు): ఇద్దరు భారత స్పిన్నర్లతో పాటు భారత పేసర్ అవసరం కూడా చాలా ఉంది. గాయాలతో కోలుకుంటున్న బ్రేవో, ఫాల్క్‌నర్‌లకు ప్రత్యామ్నాయంగా విదేశీ ఆల్‌రౌండర్ కావాలి. స్టెయిన్‌ను తప్పించడంతో విదేశీ పేసర్ కూడా అవసరం. వీరిపైనే అందరి దృష్టీ... బెన్‌స్టోక్స్: తాజా వేలంలో అందరికంటే ఎక్కువ మొత్తం పలికే అవకాశం ఉన్న ఆల్‌రౌండర్. 6 లేదా 7 స్థానాల్లో దూకుడుగా ఆడటంతో పాటు పేస్ బౌలర్‌గా సత్తా కలిగిన ఆటగాడు. భారత్‌తో సిరీస్‌లో అతని ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. గ్రాండ్‌హోమ్: బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ ఈ న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. కనీస ధర రూ. 30 లక్షలే కావడం ఫ్రాంచైజీలకు కచ్చితంగా ఆకర్షించవచ్చు. కగిసో రబడ: దక్షిణాఫ్రికా ప్రధాన పేసర్‌గా ఎదిగిన ఈ కుర్రాడు చెలరేగిపోతున్నాడు. స్టార్క్‌ను కోల్పోవడంతో ఎంత మొత్తమైనా వెచ్చించి ఇతని కోసం బెంగళూరు పోటీ పడవచ్చు. టైమల్ మిల్స్: ప్రస్తుతం ఫాస్టెస్ట్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు ఉంది. ఈ ఎడమ చేతి ఇంగ్లండ్ బౌలర్‌ను సొంతం చేసుకోవడం ఏ ఫ్రాంచైజీకైనా ప్రయోజనమే. ఇమ్రాన్ తాహిర్: ఢిల్లీ ఇతడిని విడుదల చేసేసింది కానీ వన్డే, టి20 ఫార్మాట్లలో ప్రస్తుత నంబర్‌వన్ బౌలర్‌గా తాజా ఫామ్ ఈ దక్షిణాఫ్రికా స్పిన్నర్‌కు మరో మంచి అవకాశం కల్పించవచ్చు. అసేలా గుణరత్నే: టైమ్ చూసి ఈ శ్రీలంక బ్యాట్స్‌మన్ పంచ్ కొట్టినట్లున్నాడు. వేలంకు ముందు ఆస్ట్రేలియాపై చెలరేగిన అతని వరుస రెండు మెరుపు ఇన్నింగ్స్‌లు ఫ్రాంచైజీల దృష్టిలో పడే ఉంటాయి. ఇషాంత్ శర్మ: భారత జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉండి వేలానికి వస్తున్న ఏకైక బౌలర్ ఇషాంత్. పుణే అతడిని ఒక్క ఏడాదికే పరిమితం చేసింది. టి20 ఫార్మాట్లో గొప్ప బౌలర్ కాకపోయినా, ఒక భారత ఆటగాడికి ఏమాత్రం దక్కుతుందనేది ఆసక్తికరం. వీరే కాకుండా జేసన్ రాయ్, హేల్స్, ఎవిన్ లూయీస్, మొహమ్మద్ నబీ, షహజాద్, బౌల్ట్, బెయిర్‌స్టో, గప్టిల్, జేసన్ హోల్డర్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. దాదాపు మూడేళ్ల క్రితం తన ఆఖరి అంతర్జాతీయ టి20 ఆడి, రిటైర్ కూడా అయిపోయి, గత ఏడాది అమ్ముడుపోని ఆసీస్ వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ కూడా తన కనీస ధరను రూ. 1.5 కోట్లుగా నిర్ణయించుకోవడం ఈ వేలంలో అన్నింటికంటే ఆశ్చర్యపరిచే అంశం! కుర్రాళ్లు కూడా... భారత్‌కు ప్రాతినిధ్యం వహించకపోయినా... దేశవాళీ క్రికెట్లో ప్రదర్శనతో కొందరు యువ క్రికెటర్లు అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. తక్కువ మొత్తానికి లభించే అవకాశం ఉండటంతో ఫ్రాంచైజీలు వీరిని కూడా ఎంచుకునేందుకు ఆసక్తి చూపించవచ్చు. వీరిలో కొందరు టి20 స్పెషలిస్ట్‌లుగా ముందుకు వస్తే, మరికొందరు అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్నారు. ఆ జాబితాలో మొహమ్మద్ సిరాజ్, టి. నటరాజ్, అశ్విన్ క్రిస్ట్, బాసిల్ తంపి, మురుగన్ అశ్విన్, పృథ్వీషా, తన్మయ్ అగర్వాల్, అంకిత్ బావ్నే, విష్ణు వినోద్, ఇషాంక్ జగ్గీ తదితరులు ఉన్నారు. వేలంలో మన ఆటగాళ్లు తన్మయ్ అగర్వాల్, మొహమ్మద్ సిరాజ్, ఎం.రవికిరణ్, ఆకాశ్ భండారి, ఆశిష్ రెడ్డి (హైదరాబాద్), సీవీ స్టీఫెన్, హనుమ విహారి, విజయ్ కుమార్ (ఆంధ్ర). వేలంలో అందుబాటులో ఉన్న మొత్తం ఆటగాళ్లు : 357 భారత ఆటగాళ్లు : 227 విదేశీ ఆటగాళ్లు : 130 అన్క్యాప్డ్ : 227 బ్యాట్స్‌మెన్ : 62 బౌలర్లు : 117 వికెట్ కీపర్లు : 30 ఆల్‌రౌండర్లు : 148 ఎంపికయ్యే ఆటగాళ్లు : 76 మార్క్యూ ప్లేయర్లు (రూ. 2 కోట్ల కనీస ధర): ఇయాన్ మోర్గాన్, క్రిస్ వోక్స్, బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్), ప్యాట్ కమిన్స్, మిషెల్ జాన్సన్ (ఆస్ట్రేలియా), ఇషాంత్ శర్మ (భారత్), ఏంజెలో మ్యాథ్యూస్ (శ్రీలంక). -
20న ఐపీఎల్ వేలం
76 మంది క్రికెటర్లకు అవకాశం న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్ కోసం జరిగే ఆటగాళ్ల వేలం ఈనెల 20న జరగనున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ వేలం నేడు (శనివారం) జరగాల్సి ఉండగా సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఏర్పడిన పరిణామాలతో తేదీని మార్చాల్సి వచ్చింది. ఇక ఈ వేలంలో పాల్గొనేందుకు 750 మంది క్రికెటర్లు రిజిస్టర్ చేసుకున్నారని బోర్డు తెలిపింది. అయితే ఒక్కో ఫ్రాంచైజీ తమ జట్టులో 27 మంది ఆటగాళ్లకు చోటిచ్చేందుకు అనుమతి ఉంది. ఇందులో తొమ్మిది మంది విదేశీ ఆటగాళ్లుంటారు. దీంతో ఆయా జట్లు తమ కోటాను పూర్తి చేసుకోవాలంటే వేలంలో 76 మందిని కొనుగోలు చేసేందుకు వీలుంది. కోల్‌కతా జట్టులో ఇప్పుడు 14 మంది ఆటగాళ్లే ఉండడంతో వారు అత్యధికంగా 13 మందిని తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సీజన్‌కు గరిష్టంగా అన్ని జట్లు కలిపి రూ.143.33 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అందరికంటే ఎక్కువగా రూ.23.35 కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉండగా... ముంబై మాత్రం రూ.11.55 కోట్లు మాత్రమే ఖర్చు చేసే వీలుంది. ఆటగాళ్ల వేలం అనంతరం 21న ఫ్రాంచైజీల వర్క్ షాప్ ఉంటుంది. -
ఐపీఎల్ వేలం వాయిదా
ఈనెల 20 నుంచి 25 మధ్య ఉండే అవకాశం ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 4న శనివారం జరగాల్సి ఉండగా మూడో వారంలో జరిగే అవకాశాలున్నట్టు సమాచారం. బీసీసీఐ ఈ విషయంలో తుది తేదీ ఖరారు చేయకపోయినా ఈనెల 20 నుంచి 25వ తేదీల మధ్య జరిపేందుకు సిద్ధమవుతోంది. లీగ్ ఏప్రిల్ 5 నుంచి మే 21 వరకు జరిపేందుకు గత నవంబర్‌లో నిర్వహించిన ఐపీఎల్ పాలకమండలిలో నిర్ణయించారు. అదే సమయంలో ఆటగాళ్ల వేలం ఈనెల 4న జరుగుతుందని ప్రకటించారు. అయితే ఈ ఏడాది ఆరంభంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో బీసీసీఐలో సమూల మార్పులు జరిగాయి. అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను వారి పదవుల నుంచి తొలగించింది. బోర్డు సీఈవోగా రాహుల్ జోహ్రిని నియమించి రోజువారీ కార్యకలాపాలను జరిపేలా ఆదేశించింది. అయితే వ్యవహారాల పర్యవేక్షణ కోసం కమిటీ సభ్యుల నియామకం షెడ్యూల్‌కన్నా ఆలస్యమవడంతో ఐపీఎల్ ఆటగాళ్ల వేలం మార్చాలని భావించారు. అయితే గత సోమవారం సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన నలుగురి సభ్యుల ‘కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) గురువారం సంబంధిత బీసీసీఐ అధికారులను కలుసుకుంది. ఐపీఎల్ 2017 తదితర అత్యవసర విషయాలను చర్చించారు. ఐపీఎల్ సన్నాహకాలను పరిశీలిస్తామని ఫ్రాంచైజీలకు సీఓఏ హామీ ఇచ్చింది. త్వరలోనే విధి విధానాలను పంపిస్తామని తెలిపింది’ అని బీసీసీఐ పేర్కొంది. మరోవైపు ఈ ఆలస్యం కారణంగా ఈనెల 18న ముగిసే ముస్తాక్ అలీ టి20 టోర్నీలో రాణించే దేశవాళీ ఆటగాళ్లను కూడా పరిశీలించే అవకాశం దొరుకుతుందని ఓ ఫ్రాంచైజీ అధికారి తెలిపారు. ఇంగ్లండ్ ఆటగాళ్లకు నష్టం లేదు: కోహ్లి భారత్‌తో జరిగిన చివరి టి20లో ఇంగ్లండ్ బ్యాటింగ్ కుప్పకూలినా ఐపీఎల్ వేలంలో వారి అవకాశాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కెప్టెన్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. అది ఆయా ఫ్రాంచైజీల ఆలోచనాధోరణిపై ఆధారపడి ఉంటుందని, వారు తమ జట్ల సమతూకం కోసం ఆలోచించి ఆటగాళ్లను ఎంపిక చేసుకుంటారని చెప్పాడు. అలాగే బెన్ స్టోక్స్ కోసం అన్ని జట్లు పోటీపడి భారీ ధర పలికే అవకాశాలున్నాయని యువరాజ్ సింగ్ తెలిపాడు. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు అద్భుత ఫీల్డర్‌గా పేరు తెచ్చుకున్నాడని, ఇతడి కోసం అన్ని జట్లు ఎగబడతాయని యువీ అన్నాడు.