
సినీ మాయలో మహిళలు
సాధారణంగా సినిమా పిచ్చి పురుషులకు ఉంటుంది. అదే పిచ్చి మహిళలకు కూడా ఉంటే ఎలా ఉంటుంది? వాళ్లు ఎలా ట్రాప్‌లో పడ్డారు? అనే కథతో తెరకెక్కిన చిత్రం ‘ట్రాప్’. బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో వీఎస్ ఫణీంద్ర దర్శకత్వంలో ప్రేమ కవితాలయ ఫిలిమ్స్ పతాకంపై ఆళ్ల స్వర్ణలత నిర్మించారు. ఈ చిత్రం టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌ను దర్శకరత్న దాసరి నారాయణరావు రిలీజ్ చేశారు.
దర్శక-నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘వినోదాత్మకంగా సాగే చిత్రమిది. బ్రహ్మాజీ పాత్ర సినిమాకే హైలెట్. దాసరిగారు మా చిత్రం లోగో, పోస్టర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. త్వరలో టీజర్ లాంచ్ చేసి, డిసెంబరులో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. మహేంద్ర ఈఎంఎస్, కాత్యాయని శర్మ, షా తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఈశ్వర్ షెరావలి, కెమెరా: ప్రవీణ్. కె.