ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, అనంతపురం క్రైం: రోజూ చిల్లరకొట్టుకు వస్తూ సిగరెట్లు, తదితర వాటిని కొనుగోలు చేస్తూ ఓ కొట్టు నిర్వాహకుడి కూతురిని ట్రాప్ చేశాడు ఓ నయవంచకుడు. కొన్ని నెలలుగా బాలికకు మాయమాటలు చెప్పి.. చివరకు ఈ నెల 2న బాలికను తీసుకుని ఉడాయించాడు. అనంతపురం రూరల్ పోలీసులు బాలిక అదృశ్యం కింద కేసు నమోదు చేశారు. రూరల్ ఎస్‌ఐ కేవీ రమణ వివరాల మేరకు... వన్‌టౌన్ పరిధిలో ఉండే ఓ వ్యక్తి చిల్లరకొట్టు నిర్వహించేవాడు.
ఇతనికి ఇద్దరు కుమార్తెలు. నవోదయ కాలనీకి చెందిన సాకే శేషు (వాచ్‌మెన్) చిన్న కుమారుడు సాకే వినేష్ చిల్లర కొట్టుకు వెళ్లేవాడు. ఇదే క్రమంలో కొట్టు నిర్వాహకుడి చిన్న కూతురితో పరిచయం పెంచుకున్నాడు. ఆ బాలికకు సెల్‌ఫోన్ లేకున్నా.. అప్పుడప్పుడూ తన తండ్రి సెల్‌ఫోన్‌తోనే వినేష్‌తో చాట్ చేసేది. సెల్‌ఫోన్లతో లక్ష్మీ అనే పేరుతోనే నంబర్ ఉండటంతో బాలిక తండ్రి కూడా పెద్దగా పట్టించుకోలేదు.
చదవండి: (యువతితో ఐదేళ్లుగా ప్రేమ.. నమ్మించి మోసం.. పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో..)
పెళ్లికి వెళ్లి... : ఈ నెల 2న బాలిక తన స్నేహితురాలి అక్క వివాహం రూరల్ పరిధిలోని సిండికేట్‌నగర్‌లో జరిగింది. ఆ వివాహ వేడుకకు తండ్రితో కలిసి బాలిక వెళ్లింది. భోజనం చేద్దామనుకున్న సమయంలో బాలిక కనిపించలేదు. అంతా వెతికినా ఫలితం లేకపోయింది. చేసేదిలేక అనంతపురం రూరల్ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా అదృశ్యం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
పదికి పైగా కేసులు: బాలికను తీసుకెళ్లిన నిందితుడు సాకే వినేష్‌పై వన్‌టౌన్, టూటౌన్ పరిధిలోని దొంగతనాలు, తదితర కేసులు పదికి పైగా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బాలికను ఏం చేస్తాడోనన్న భయంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment