Kirana shop
-
కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్మకాలు.. చంద్రబాబుకు మరో వర్గం దూరం..
-
చూడటానికి కిరాణా కొట్టులా... కానీ నెలకు 4 కోట్ల ఆదాయం
-
మార్కెట్లో వస్తువులు కొంటున్నారా? వీటిని గమనించకపోతే జేబుకి చిల్లే!
సాక్షి,విజయనగరం పూల్‌బాగ్: ఏ వస్తువు కొనుగోలు చేయాలనుకున్నా చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు. దుకాణాల్లో లభ్యమయ్యే ఘన పదార్థాలను తూకాల్లో, ద్రవ పదార్థాలను కొలతల్లో కొలుస్తారు. వీటికి నిర్దిష్ట ప్రమాణాలుంటాయి. అయితే కొందరు వ్యాపారులు అధిక ధన దాహంతో కొలతల్లో జిమ్మిక్కులు చేస్తూ కొనుగోలుదారులను మోసం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కొలతల్లో ఏ చిన్నపాటి తేడా గమనించినా వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేయాలి. లేకపోతే అమ్మకందారుల మోసానికి గురికావాల్సి వస్తుంది. ఈ క్రమంలో కొనుగోలుదారులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలన్న విషయంపై తూనికలు, కొలతల శాఖ అధికారులు నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే దుకాణాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు ముమ్మరం చేస్తూ అమ్మకందారుల మోసాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 13,254 సాధారణ, ఎలక్ట్రానిక్ కాటాలు ఉన్నాయి. వాటిని రిపేరు చేసేందుకు 9 మంది లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారు. సాధారణ కాటాలు రెండేళ్లకొకసారి, ఎలక్ట్రానిక్ కాటాలను ఏడాదికొకసారి ముద్రలు/సీళ్లు వేయించుకోవాలి. అవి ఏమైనా మరమ్మతులకు గురైతే లైసెన్స్ హోల్డర్స్ వద్ద రిపేర్ చేయించుకోవాలి. ఎంఆర్పీ కన్నా ఎక్కువకు అమ్మితే చర్యలు.. జిల్లాలోని చౌకధరల దుకాణాలు, వే బ్రిడ్జిలు, రైస్ మిల్లులు, రైస్ షాపులు, హార్డ్‌వేర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ షాపులు, డిస్పెన్సరీ యూనిట్లు, వాటర్ ప్లాంట్లు, పండ్లు, కూరగాయలు, చేపలు, మాంసం దుకాణాలు, స్వీట్స్, బేకరీ, కిరాణా షాపులు, జనరల్ స్టోర్స్, పాలు, పాల ఉత్పత్తులు, పరిశ్రమలు, మాన్‌ఫ్యాక్చరింగ్ యూనిట్స్‌లలో ఎంఆర్పీ రేట్ల కంటే అధికంగా అమ్మకాలు చేపట్టకూడదు. ఎలక్ట్రానిక్ కాటాలు జీరోలో ఉండాలి. మాంసం, చేపల దుకాణాల్లో కాటాలు వేలాడదీసి ఉండాలి. తూకం వేసేటప్పుడు కొనుగోలుదారులు సరిపోయిందా లేదా అనే విషయం గమనించాలి. ఒకవేళ తూకం తక్కువగా ఉంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేయాలి. దీనికోసం ఫోన్ నంబర్లు 08922–223845, 9398159434, 90000828467ను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు. చదవండి: Writer Padmabhushan: ‘ఈ సినిమా చూసిన ప్రతిఒక్కరూ కంటతడి పెట్టుకుంటారు’ -
రోజూ చిల్లరకొట్టుకు వస్తూ.. నిర్వాహకుడి కూతురిని ట్రాప్ చేసి..
సాక్షి, అనంతపురం క్రైం: రోజూ చిల్లరకొట్టుకు వస్తూ సిగరెట్లు, తదితర వాటిని కొనుగోలు చేస్తూ ఓ కొట్టు నిర్వాహకుడి కూతురిని ట్రాప్ చేశాడు ఓ నయవంచకుడు. కొన్ని నెలలుగా బాలికకు మాయమాటలు చెప్పి.. చివరకు ఈ నెల 2న బాలికను తీసుకుని ఉడాయించాడు. అనంతపురం రూరల్ పోలీసులు బాలిక అదృశ్యం కింద కేసు నమోదు చేశారు. రూరల్ ఎస్ఐ కేవీ రమణ వివరాల మేరకు... వన్‌టౌన్ పరిధిలో ఉండే ఓ వ్యక్తి చిల్లరకొట్టు నిర్వహించేవాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. నవోదయ కాలనీకి చెందిన సాకే శేషు (వాచ్మెన్) చిన్న కుమారుడు సాకే వినేష్ చిల్లర కొట్టుకు వెళ్లేవాడు. ఇదే క్రమంలో కొట్టు నిర్వాహకుడి చిన్న కూతురితో పరిచయం పెంచుకున్నాడు. ఆ బాలికకు సెల్‌ఫోన్ లేకున్నా.. అప్పుడప్పుడూ తన తండ్రి సెల్‌ఫోన్‌తోనే వినేష్‌తో చాట్ చేసేది. సెల్ఫోన్లతో లక్ష్మీ అనే పేరుతోనే నంబర్ ఉండటంతో బాలిక తండ్రి కూడా పెద్దగా పట్టించుకోలేదు. చదవండి: (యువతితో ఐదేళ్లుగా ప్రేమ.. నమ్మించి మోసం.. పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో..) పెళ్లికి వెళ్లి... : ఈ నెల 2న బాలిక తన స్నేహితురాలి అక్క వివాహం రూరల్ పరిధిలోని సిండికేట్‌నగర్‌లో జరిగింది. ఆ వివాహ వేడుకకు తండ్రితో కలిసి బాలిక వెళ్లింది. భోజనం చేద్దామనుకున్న సమయంలో బాలిక కనిపించలేదు. అంతా వెతికినా ఫలితం లేకపోయింది. చేసేదిలేక అనంతపురం రూరల్ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా అదృశ్యం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పదికి పైగా కేసులు: బాలికను తీసుకెళ్లిన నిందితుడు సాకే వినేష్‌పై వన్‌టౌన్, టూటౌన్ పరిధిలోని దొంగతనాలు, తదితర కేసులు పదికి పైగా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బాలికను ఏం చేస్తాడోనన్న భయంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
ద్రాక్ష గుత్తులే ఆ షాపుకు అలంకరణ
-
పల్లీపట్టీలు కావాలని వచ్చి... పుస్తెలు అపహరణ!
నాగోలు: పల్లీపట్టీ కావాలని వచ్చిన ఓ దుండగుడు షాపులో ఉన్న మహిళ మెడలోని బంగారు పుస్తెలు తెంచుకొని పారిపోయాడు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... హస్తినాపురం, అనుపమనగర్‌లో నివసించే పెబ్బేటి స్వప్న (35) అదే కాలనీలో జై సంతోషిమాత పింగి గిర్నీ నిర్వహిస్తోంది. గురువారం మధ్యాహ్నం గుర్తుతెలియని యువకుడు దుకాణానికి వచ్చి పల్లీపట్టి కావాలని అడిగి ఆమె మెడలోని పుస్తెలతాడు తెచ్చేందుకు యత్నించాడు. ఆమె తాడును గట్టిగా పట్టుకోవడంతో రెండు పుస్తెలు తెంచుకుని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీస్‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఘరానా దొంగ: కారులో రెక్కీ.. ఇళ్లలో చోరీ
సాక్షి, మంచిర్యాల(ఆదిలాబాద్): కుటుంబ పోషణ కోసం ఏర్పాటు చేసుకున్న కిరాణం సరిగా నడవలేదు. వచ్చిన డబ్బు జల్సాలు, కుటుంబ పోషణకు సరిపోలేదు. దొంగతనాలను ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. కారులో రెక్కీ నిర్వహించి తాళం వేసిన ఇళ్లలో చోరీకి పాల్పడుతున్నాడు. ఐదు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన దొంగను మంచిర్యాల పోలీసులు ఎట్టకేలకు కటకటాల్లోకి నెట్టారు. రూ.9.21లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.30వేల నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మంచిర్యాల పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ అఖిల్‌మహాజన్ వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కేసనపల్లి గ్రామానికి చెందిన రాయపాటి వెంకయ్య చిన్నతనంలోనే తల్లిదండ్రులు అనారోగ్యంతో చనిపోయారు. అయిన వాళ్లు ఎవరూ చేరదీయకపోవడంతో కొరటిపాడు పట్టణంలోని కిరాణ దుకాణంలో నెల జీతానికి కొంతకాలం పని చేశాడు. ఆ తర్వాత సొంతంగా కిరాణం దుకాణం ఏర్పాటు చేసుకుని జీవనం సాగించాడు. దుకాణం సరిగా నడవకపోవడం, జల్సాలకు అలవాటు పడడం, వచ్చిన డబ్బులు కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని దొంగతనాలను ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, పాలకొల్లు, భీమవరం ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లలో, బైక్ దొంగతనాలు చేశాడు. 2008 రాజమండ్రి పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లాడు. అక్కడ కొందరితో పరిచయాలు ఏర్పర్చుకుని విడుదలైన తర్వాత నెల్లూరు, తిరుపతి ఇతర ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. 2009లో పోలీసులు మరోసారి నెల్లూరు సెంట్రల్‌జైలుకు పంపించారు. ఆరు నెలల జైలు శిక్షణ అనంతరం దొంగతనాలకు పాల్పడగా.. తెలంగాణ రాష్ట్రంలో 19, ఆంధ్రప్రదేశ్‌లో 71, కర్ణాటకలో 4, కేరళలో 1, తమిళనాడు రాష్ట్రంలో 5 కేసులు నమోదయ్యాయి. ఐదు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా మారిన వెంకయ్య జిల్లాలోని మంచిర్యాల, చెన్నూర్, సీసీసీ నస్పూర్, శ్రీరాంపూర్, కరీంనగర్లో వరుస చోరీలకు పాల్పడ్డాడు. కారులోనే చోరీ సొత్తు వెంకయ్య ఉరఫ్ వెంకటేష్ ఒక్కడే లేదా జైల్లో పరిచయమైన దొంగ స్నేహితులతో కలిసి కారులో తిరుగుతూ పగలు రెక్కీ నిర్వహించేవాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను గమనిస్తూ రాత్రి వేళ చోరీలకు పాల్పడేవాడు. కారులో కత్తులు, వేటకొడవళ్లు, స్క్రూడైవర్, ఇనుప రాడ్లు ఉండవి. ఎవరైనా అడ్డుకుంటే వాటితో దాడి చేయడానికి సిద్ధంగా ఉండేవాడు. చోరీ సొత్తును కారులోనే దాచి ఉంచుతూ పెద్దమొత్తంలో ఒకేసారి విక్రయించేవాడు. సొత్తు అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సా చేసేవాడు. దొంగతనానికి వెళ్తూ.. చోరీ సొత్తును కారులోనే ఉంచి బెల్లంపల్లిలో మరో దొంగతనానికి కారు (ఏపీ28డీఎం 6110)లో వెళ్తుండగా ఏసీసీ సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు. 424.3 గ్రాముల బంగారం, 650 గ్రాముల వెండి, రూ.30వేలు నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొత్తు విలువ రూ. 9.21లక్షలు ఉంటుందని, ఐదు వేట కొడవళ్లు, రెండు కత్తులు లభించాయని ఏసీపీ వెల్లడించారు. మంచిర్యాల సీసీఎస్ పోలీసులు, స్థానిక సీఐ నారాయణ్‌నాయక్, సీసీఎస్ సీఐ, ఎస్సైలను అభినందించి నగదు రివార్డులు అందజేశారు. చదవండి: ఆర్ఎంపీ క్లినిక్‌లో దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం -
కిరాణా వర్తకులకు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: కిరాణా వర్తకుల మూలధన నిధుల అవసరాలకు మద్దతుగా నిలిచేందుకు ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ నూతనంగా ఒక ‘క్రెడిట్ ప్రోగ్రామ్’ను ప్రకటించింది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు భాగస్వామ్యంతో సులభ రుణాలను సమకూర్చనుంది. కిరాణా వర్తకుల ఇబ్బందులను పరిష్కరించేందుకు, వ్యాపార వృద్ధికి నిధుల అవసరాలను తీర్చేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్టు ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ ప్రకటించింది. ఇందులో భాగంగా కిరాణా వర్తకులు ఎటు వంటి వ్యయాలు లేకుండానే రుణ సాయాన్ని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు, ఇతర ఫిన్‌టెక్ సంస్థల నుంచి పొందొచ్చని తెలిపింది. ఈ రుణాలు రూ.5,000 నుంచి రూ.2 లక్షల వరకు.. 14 రోజుల కాలానికి ఎటువంటి వడ్డీ లేకుండా లభిస్తాయని పేర్కొంది. చదవండి : ఆ పేరు మార్చండి, అమెజాన్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు -
కిరాణా.. క్యాష్‌లెస్‌కే ఆదరణ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి విస్తృతి నేపథ్యంలో ప్రజలకు నిత్యావసరాలను అందిస్తున్న కిరాణా దుకాణాలు.. డిజిటల్ చెల్లింపుల బాటపట్టాయి. వినియోగదారుల కోసం నగదు రహిత (క్యాష్‌లెస్) చెల్లింపులను అందుబాటులో ఉంచుతున్నాయి. దేశ వ్యాప్తంగా కిరాణాల్లో లాక్‌డౌన్‌కు ముందు 35 శాతంగా ఉన్న డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు రెండింతలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వంద మంది ప్రజానీకానికి ఒక దుకాణం అందుబాటులో ఉంది. లాక్డౌన్ సమయంలో దూరపు ప్రయాణాలపై ఆంక్షలు, భౌతిక దూరం వంటి నిబంధనలతో సమీపంలోని చిన్న కిరాణాలపైనే కొనుగోలుదారులు అధికంగా ఆధారపడ్డారు. సూపర్ మార్కెట్లు, మార్ట్‌లకు వెళ్లేందుకు జంకడం, పెద్ద పెద్ద వరుసల్లో నిలుచొని సరుకుల కొనుగోళ్లకు ఆసక్తి చూపక దగ్గర్లోని కిరాణాలవైపే మొగ్గు చూపారు. అయితే అన్ లాక్ ప్రక్రియ తర్వాత కూడా కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు కిరాణా దుకాణాల బాటే పట్టారు. మెట్రో పట్టణాల్లో 50 శాతం, చిన్న పట్టణాల్లో 75 శాతం మంది పెద్దపెద్ద మార్కెట్లను కాదని కిరాణాల్లో కొనుగోలు చేస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. వాట్సాప్‌లో ఆర్డర్లు... ఇంటికే సరుకులు... అయితే కొనుగోలుదారుల తాకిడి ఎక్కువ కావడంతో కిరాణా దుకాణ యజమానులకు వైరస్ సోకిన ఉదంతాలు అనేకం. దీన్ని ఎదుర్కొనేందుకు సాంకేతిక పరిజ్ఞానంవైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలను గణనీయంగా పెంచారు. డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు ఫోన్ పే, గూగుల్‌పే, పేటీఎం, క్యూర్ కోడ్ల ద్వారా నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహిస్తున్నారు. ఈ తరహా చెల్లింపులు కిరాణాల్లో గతంతో 35 శాతం ఉంటే ఇప్పుడు 75 శాతానికి పెరిగాయని బెంగళూర్‌కు చెందిన ఓ సర్వే సంస్థ వెల్లడించింది. కొన్ని నగరాల్లో కిరాణా దుకాణదారులు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీల్లో నిత్యావసర సరుకుల ఆర్డర్లను మెసేజ్‌లు, వాట్సాప్‌ల ద్వారా తీసుకొని ఇంటికే పంపిణీ చేస్తున్నారు. చిన్నచిన్న పట్టణాల్లో సైతం కాంటాక్ట్‌లెస్ డెలివరీలను అందించేందుకు వీలుగా వాట్సాప్‌ల ద్వారా ఆర్డర్లు తీసుకుంటున్నాయి. మా కిరాణా దుకాణానికి ప్రతిరోజూ 100 మంది కస్టమర్లు వస్తారు. లాక్‌డౌన్‌కు ముందు కేవలం పదిపదిహేను మంది మాత్రమే ఫోన్ పేలో చెల్లించేవారు. ఇప్పుడు డెబిట్ కార్డు, గూగుల్‌పే, క్యూడర్ కోడ్ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. కనీసం 80 మంది ఈ తరహా చెల్లింపులే చేస్తున్నారు. – మధుసూదన్, కిరాణాదారు, మెదక్ పరిశుభ్ర వాతావరణం, ఇంటి పక్కనే ఉండటం, డిజిటల్ లావాదేవీలు చేస్తుండటం, ఎమ్మార్పీ ధరలకే విక్రయాలతో కిరాణా దుకాణాల్లోనే వస్తువులు కొనుగోలు చేస్తున్నా. సూపర్ మార్కెట్ల వైపు చూడటమే మరిచిపోయా. – రామ్మూర్తి, సంగారెడ్డి -
హోల్'సేల్' లేదు!
లాక్‌డౌన్‌కు ముందు రోజుకు సగటున లక్ష రూపాయల వ్యాపారం జరిగేది. ఇందులో డొమెస్టిక్ సేల్స్ కంటే కమర్షియల్ సేల్సే ఎక్కువ. ప్రస్తుతం ఫంక్షన్లు తగ్గిపోయాయి. హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచినా కస్టమర్లు ఆసక్తి చూపడం లేదు. దీంతో మా కిరాణాషాపులో వ్యాపారం భారీగా తగ్గింది. ప్రస్తుతం డొమెస్టిక్ కస్టమర్లే ఎక్కువ వస్తున్నారు. చిల్లర వ్యాపారం ఉన్నప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉండదు. గతంతో పోలిస్తే ప్రస్తుతం మా కౌంటర్ రూ.40 వేలు దాటడం లేదు. – ఎల్బీనగర్లోని ఓ హోల్‌సేల్ కిరాణా వ్యాపారి ఆవేదన ఇది సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి విజృంభించినకొద్దీ విక్రయాలు నీరసిస్తున్నాయి. కరోనా ప్రభావం పెరిగినకొద్దీ కిరాణా వ్యాపారం హైరానా పడుతోంది. గిరాకీ లేక వ్యాపారం గిరికీలు కొడుతోంది. శుభకార్యాలు భారీగా తగ్గిపోయాయి. అక్కడక్కడా దావత్‌లు జరుగుతున్నా బంధుమిత్రులు పరిమిత సంఖ్యలోనే వచ్చేస్తున్నారు. దావత్‌లకు పోయేవాళ్లల్లో కొంతమంది మొహం చూపించి రావడం తప్ప భోజనం సైతం చేయడం లేదు. మరోవైపు రెస్టారెంట్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు తెరిచినప్పటికీ గిరాకీ పూర్తిగా తగ్గింది. ఈ ప్రభావం హోల్‌సేల్(టోకు) కిరాణా దుకాణాలపై తీవ్రంగా పడింది. నిత్యావసర సరుకుల వ్యాపారానికి ఢోకా లేదని భావించినా హోల్‌సేల్ వ్యాపారులకు మాత్రం ప్రస్తుత పరిస్థితి మింగుడుపడడం లేదు. సాధారణరోజుల్లో జరిగే వ్యాపారంలో ప్రస్తుతం 40 శాతం మించడం లేదనే ఆందోళన హోల్‌సేల్ వ్యాపారుల్లో వ్యక్తమవుతోంది. లాక్డౌన్.. ఆ తర్వాత పరిస్థితులు క్రమంగా అన్ని రంగాలపైనా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. సాధారణ గృహావసరాలకు జరిగే విక్రయాలతో పోలిస్తే కమర్షియల్ విక్రయాల పరిమాణమే ఎక్కువ. యాభైమంది డొమెస్టిక్ కస్టమర్లకు సరిపడా సరుకులు ఒక కమర్షియల్ కస్టమర్ కొనుగోలు చేస్తాడు. ఈ క్రమంలో కమర్షియల్ సేల్స్ పడిపోవడంతో వ్యాపారులకు నష్టాలు మొదలయ్యాయి. రెండింటిలో తేడా ఏంటంటే... సాధారణంగా ఒక డొమెస్టిక్ కస్టమర్ కొనుగోలు చేసే సరుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని ప్యాకింగ్ చేసేందుకు రిస్క్‌తోపాటు మ్యాన్‌పవర్ అవసరం ఎక్కువ. సరుకులు తూచే క్రమంలో నిర్ణీత పరిమాణం కంటే కాస్త కొసరు వేయడంతో లాభాలు అక్కడే హరించుకుపోతాయని వ్యాపారులు చెబుతున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకే ఈ ఎత్తుగడ అని, వ్యాపారం రొటేషన్ కోసం మాత్రమే డొమెస్టిక్ సేల్స్ పాత్ర పోషిస్తామని అభిప్రాయపడుతున్నారు. కమర్షియల్ కస్టమర్‌కు పెద్దమొత్తంలో సరుకులు ఇవ్వడంతోపాటు ప్యాకేజీ సమస్య కూడా పెద్దగా ఉండదు. కాస్త తక్కువ రేటుకు సరుకులు విక్రయించినా డొమెస్టిక్ సేల్స్‌తో పోలిస్తే ఎక్కువ వ్యాపారం, ఎక్కువ లాభసాటిగా ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. లాక్డౌన్ తర్వాతి పరిస్థితులతో కమర్షియల్ సేల్స్ బాగా పడిపోవడంతో హోల్‌సేల్ వ్యాపారంతోపాటు లాభాలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. దీంతో నిర్వహణభారం ఆందోళన కలిగిస్తోందని చెబుతున్నారు. సూపర్మార్కెట్లు కాస్త మెరుగే... హోల్‌సేల్ వ్యాపారంతో పోలిస్తే సూపర్మార్కెట్లలో వ్యాపారం ఆశాజనకంగా ఉన్నట్లు పలు మార్కెటింగ్ రీసెర్చ్‌లు చెబుతున్నాయి. సూపర్ మార్కెట్లలో సరుకులను ఎక్కువగా డొమెస్టిక్ కస్టమర్లే కొనుగోలు చేస్తారు. ఇక్కడ ప్యాకేజింగ్‌కు ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. సేల్స్ బాయ్స్ కూడా అందుబాటులో ఉండడంతో కస్టమర్ల రాకపోకలు సాఫీగా, వేగంగా సాగుతాయి. ఈ క్రమంలో ఎక్కువ సేల్స్‌తోపాటు ప్యాకేజింగ్ చార్జీలు, సరుకుల కొలత పక్కాగా ఉండడం వ్యాపారికి కలిసొచ్చే అంశం. దీంతో వచ్చే లాభాల్లో ఏమాత్రం తేడా ఉండదు. లాక్డౌన్ కంటే ముందు జరిగే వ్యాపారంతో పోలిస్తే ప్రస్తుతం 65 శాతం పెరిగినట్లు బీఎన్‌రెడ్డి నగర్‌లోని ఓ సూపర్ మార్కెట్ నిర్వాహకుడు ‘సాక్షి’తో అన్నారు. మరో నాలుగు నెలలు ఇంతే... ప్రస్తుతం కోవిడ్–19 వ్యాప్తి తీవ్రమవుతోంది. కరోనా వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో ఇప్పటివరకు నడిచిన వ్యాపారంపై మరింత ప్రభావం పడనుంది. ఉపాధి అవకాశాలు తగ్గుతుండడంతో పేద, మధ్యతరగతి వర్గాలు ఆచితూచి ఖర్చులు పెడుతున్నాయి. వైరస్ ప్రభావం మరో నాలుగు నెలల వరకు ఉంటుందని, అప్పటి వరకు కిరాణా వ్యాపారానికి ఒడిదుడుకులు తప్పకపోవచ్చని వ్యాపారవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డిసెంబర్ వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని, ఆ తర్వాత క్రమంగా కోలుకుంటుందని ఆశిస్తున్నట్లు హోల్‌సేల్ కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ గ్రేటర్ హైదరాబాద్ ప్రతినిధి గణేష్‌గుప్తా అభిప్రాయపడ్డారు. -
గల్లీ కొట్టు.. సూపర్ హిట్టు!
సాక్షి, హైదరాబాద్: ఇళ్ల దగ్గరి కిరాణా షాపులు, గల్లీ చివరి దుకాణాల్లో సరుకుల కొనుగోళ్లు పెరిగాయి. ప్రతీ ముగ్గు రు వినియోగదారుల్లో ఇద్దరు ఎక్కువగా లోకల్ బ్రాండ్స్ సరుకులు, వస్తువులనే కొంటామంటున్నారు. ప్రస్తుతం భారత్‌లోని ‘ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) మార్కెట్’కు డిమాండ్ పెరిగి దాదాపుగా కరోనాకు ముందు నాటి స్థాయికి చేరుకుంటోంది. గతంలో మాదిరే మళ్లీ డియోడరెంట్స్, హెయిర్ కలర్స్, స్కిన్‌కేర్ వంటి ప ర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ కొనుగోళ్లకు కస్టమర్లు మొగ్గుచూపుతున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లి తినడం, బయటి ఫుడ్ ఆర్డర్లు గణనీయంగా తగ్గిపోవడంతో ఇళ్లలోనే వండుకునే వారి శాతం పెరిగి ప్యాకేజ్డ్ ఆటా, రిఫైన్డ్ ఆయిల్ వంటి వాటికి జూన్‌లో భారీగా డిమాండ్ పెరిగింది. వీటితో పాటు లిక్విడ్ సోప్స్, చ్యవన్‌ప్రాశ్, బ్రాండెడ్ తేనె వంటి వాటి కొనుగోళ్లు పెరిగాయని గ్లోబల్ డేటా అనలిటిక్స్ కంపెనీ నీల్సన్ జరిపిన తాజా సర్వేలో వెల్లడైంది. పుంజుకుంటున్న కొనుగోళ్లు: పట్టణాల్లోనే కాక గ్రామీణ ప్రాంతాల్లోనూ నిత్యావసరా లు, ఇతర సంప్రదాయక కొనుగోళ్లతో పాటు ఆహారేతర కేటగిరీల్లోనూ కొనుగోళ్లు పెరిగాయి. ఎఫ్ఎంసీజీ మార్కెట్లో గతేడాది జనవరి–మే మధ్యకాలంతో ఈ ఏడాది అదే కాలాన్ని పోలిస్తే వినియోగదారుల మార్కెట్ తక్కువగా నమోదు కాగా, ఇప్పుడు మళ్లీ పుంజుకుంటున్నట్టు తేలింది. పెరిగిన బ్యూటీకేర్ అమ్మకాలు: లాక్డౌన్ సమయం లో కాస్మటిక్స్, సౌందర్య సాధనాలు, సంబంధిత వస్తువులపై పెట్టే ఖర్చును కస్టమర్లు బాగా తగ్గించుకున్నారు. అలాగే, రోజువారీ వస్తువుల కేటగిరీలోని టూత్పేస్ట్లు, షాంపూలు, హెయి ర్ ఆయిల్, వాషింగ్ పౌడర్, సబ్బులు వంటివి గతంతో పోలిస్తే మితంగా కొనుగోలు చేసి ఉపయోగించారు. ఇప్పుడు మళ్లీ జూన్‌లో వీటి కొనుగోళ్లు పెరగడంతో పా టు సౌందర్య సాధనాలు, ఇతర బ్యూటీకేర్ ఉత్పత్తుల కొనుగోళ్లు పెరిగినట్టు సర్వేలో తేలింది. ఇంటికే సరుకులు.. నీల్సన్ సంస్థ ఆన్లైన్ ద్వారా దేశంలోని 22 నగరాల్లోని వినియోగదారుల ను వివిధ అంశాలపై ప్రశ్నించిం ది. పట్టణ ప్రాంతాల్లోని పలువురు కస్టమర్లు వస్తువుల్ని డోర్ డెలి వరీ చేయాలని కో రుకుంటున్నట్టు వెల్లడైంది. దీంతో కిరాణా షాపులు మొదలు డిపార్ట్మెంటల్ స్టోర్స్ వరకు ఫోన్ లేదా వాట్సాప్ ఆధారిత వ్యవస్థల ద్వారా వినియోగదారుల ఇళ్లకే సరుకులు çపంపే ఏర్పాట్లు చేస్తున్నాయి. మున్ముందు తమ ఆన్లైన్ షాపింగ్‌ను 20 శాతానికిపైగా పెంచబోతున్నట్టు 62 శాతం మంది చెప్పినట్టు ఈ అధ్యయన సంస్థ తెలిపింది. లోకల్ బ్రాండ్ అంటే.. లాక్డౌన్, చైనాతో కయ్యం.. ఈ పరిణామాల నేపథ్యంలో లోకల్ ప్రొడక్ట్స్, బ్రాండ్స్‌కు డిమాండ్ పె రుగుతోంది. తాము కొనే వస్తువు ల్లో స్థానిక బ్రాండ్స్‌కే మొగ్గుచూపుతామని ప్రతీ ముగ్గురు వినియోగదారుల్లో ఇద్దరు చెప్పినట్టు నీల్సన్ సర్వే తెలిపింది. సర్వేలో ‘లోకల్ బ్రాండ్’ అంశంపై ఎవరెలా స్పందించారంటే.. ♦ 78% దేశంలో తయారైనదే స్థానిక బ్రాండ్ ♦ 50% లోకల్ బ్రాండ్లే ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని పెంచుతాయి ♦ 49% దేశవ్యాప్తంగా అందుబాటులో ఉండే బ్రాండే స్థానిక బ్రాండ్ ♦ 48% బ్రాండ్ హెడ్‌క్వార్టర్ భారత్‌లో ఉంటే అదే లోకల్ బ్రాండ్ ♦ 43% ఆయుర్వేద ఔషధాలు, సహజ మూలకాలు వంటి వస్తువుల తయారీ సంస్థలే లోకల్ బ్రాండ్ -
కరోనా ఎఫెక్ట్ : కిరాణా షాపు తెరిచిన దర్శకుడు
చెన్నై : కరోనా మహమ్మారితో అన్ని రంగాలూ కుదేలైనా సినీ పరిశ్రమపై కోవిడ్-19 పెనుప్రభావం చూపింది. లాక్డౌన్ కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో సినీ కార్మికులు పూటగడవక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవకాశాలు లేకపోవడంతో మరికొందరు చిరుద్యోగాలు, చిన్న వ్యాపారాలకు మళ్లుతున్నారు. స్క్రిప్టుతో కుస్తీలు పడుతూ ఫ్లడ్‌లైట్ల హడావిడి మధ్య గడిపే ఓ దర్శకుడు కోవిడ్-19 విసిరిన సవాల్‌తో చిరువ్యాపారిగా మారారు. సినిమా అవకాశాలు కొరవడటంతో ఆనంద్ అనే దర్శకుడు కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమవడంతో తాత్కాలికంగా కిరాణా దుకాణం ఎందుకు తెరవకూడదనే ఆలోచన వచ్చిందని ఆయన చెబుతున్నారు. గత పదేళ్లుగా ఆనంద్ పలు చిన్న సినిమాలను తెరకెక్కించారు. పనిలేకుండా ఖాళీగా కూర్చోలేక నిత్యావసరాలకు అధిక డిమాండ్ ఉందనే ఆలోచనతో ఈ షాపును ప్రారంభించానని చెప్పారు. తాను ఊహించినట్టే నిత్యావసర వస్తువులకు డిమాండ్ అధికంగా ఉందని, షాపుల ముందు ప్రజలు బారులుతీరి తమకు అవసరమైన వాటిని కొనుగోలు చేస్తున్నారని అన్నారు. కిరాణా దుకాణం నడపడంలో ఎలాంటి అనుభవం లేకున్నా చిన్నపాటి మొత్తంతో షాపును ఏర్పాటు చేయగలిగానని అన్నారు. తన ఇంటికి కొద్ది దూరంలోనే తన చిన్ననాటి స్నేహితుడి దుకాణాన్ని అద్దెకు తీసుకుని కిరాణా షాపు నడిపిస్తున్నానని చెప్పుకొచ్చారు. తాను తీసుకున్న నిర్ణయం సినిమా పరిశ్రమలో తన స్నేహితులు ఎవరికీ నచ్చకపోయినా కొద్దిపాటి ఆదాయం వచ్చినా తాను మరికొందరికి సాయపడగలనని ముందుకెళ్లానని గుర్తుచేసుకున్నారు. గత నెలలో తాను ఈ దుకాణాన్ని తెరిచానని, అప్పటినుంచి అంతా అనుకూలంగానే ఉందని చెప్పారు. చిన్న సినిమాలను ఓటీటీ, ఆన్లైన్ వేదికలపై విడుదల చేసే వెసులుబాటు ఉందని, త్వరలో తన దర్శకత్వంలో రూపొందిన సినిమా విడుదలవుతోందని ఆనంద్ వెల్లడించారు. చదవండి : కరోనాను జయించి..101వ వసంతంలోకి -
గ్రేటర్లో కరోనా విజృంభణ: కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ కిరాణ మర్చంట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. వారం రోజుల పాటు బేగంబజార్‌లోని కిరాణా దుకాణాలు మూసివేయనున్నారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 5 వరకు బేగంబజార్‌లో దుకాణాలు మూసివేయనున్నట్లు కిరాణా మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్న విషయాన్ని చిరు వ్యాపారులు, ప్రజలు గమనించగలరని ఆయన విజ్ఞప్తి చేశారు. (చైనా ఉత్పత్తులకు తగ్గని ఆదరణ) కాగా, రాష్ట్రంలో కరోనా కేసులు పదివేలు దాటేశాయి. నిన్న ఒక్కరోజే 891 మందికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో కేసుల సంఖ్య 10,444కి చేరింది. ఇందులో 5,858 మంది వివిధ ఆస్పత్రులు, హోం ఐసోలేషన్లలో చికిత్స పొందుతుండగా.. 4,361 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరో ఐదుగురు మరణించడంతో ఇప్పటివరకు కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 225కి పెరిగింది. (ఇక నుంచి ఇవి ప్లాట్‌ఫాంపై అమ్మబడును) -
కిరాణా ఖర్చుతో హైరానా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ సడలింపులతో సరుకు రవాణా, వస్తు లభ్యత పెరిగినా.. ధరలు మాత్రం దిగిరావట్లేదు. లాక్డౌన్ సమయంలోని ధరలే ప్రస్తుతం ఉండటం, చాలా వస్తువులపై ఆఫర్లు, డిస్కౌంట్లు ఎత్తేయడంతో ధరలు తగ్గకపోగా.. అంతకంతకూ కిరాణా ఖర్చులు పెరు గుతుండటం వారిని హైరానా పెడుతోంది. దీనికి తోడు ప్రభుత్వం ఏప్రిల్, మే నెలల్లో ఇచ్చిన రూ.1,500 సాయాన్ని నిలిపేయడం, ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనిపించకపోవడంతో వినియోగదారులు విలవిల్లాడుతున్నారు. తగ్గిన ఆదాయం.. పెరిగిన ఖర్చు.. రెండు నెలల పాటు కొనసాగిన లాక్‌డౌన్‌తో పేద, మధ్య తరగతితో పాటు ఎగువ మధ్యతరగతి కుటుంబాలపై పెను ప్రభావం పడింది. వారి నెలసరి ఆదాయం కనీసంగా 40 శాతం మేర పడిపోయింది. కుటుంబసభ్యులంతా ఇంటికే పరిమితం కావడంతో నిత్యావసరాలు, కిరాణా ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఇదే సమయంలో సరుకు రవాణాలో ఇబ్బందులు, హోల్‌సేల్, రిటైలర్ల మధ్య గ్యాప్ పెరగడంతో కిరాణా సరుకుల ధరలన్నీ పెరిగాయి. అయితే ప్రస్తుతం లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నుంచి సరఫరా మెరుగైంది. రాష్ట్రాల పరిధిలోనూ అన్ని సరుకుల లభ్యత పెరిగింది. అయినా కూరగాయల ధరలు మినహాయిస్తే అన్ని ధరలు ఏమాత్రం దిగిరావట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక నివేదికల ప్రకారమే కందిపప్పు ధర లాక్డౌన్ ముందున్న ధరల కన్నా రూ.10–15 అధికంగా ఉండి ప్రస్తుతం రూ.110కి అందుబాటులో ఉంది. పెసరపప్పు, మినప్పప్పు ధర సైతం రూ.125–134 మధ్యే ఉంటోంది. ఇది సైతం లాక్‌డౌన్‌కు ముందుతో పోలిస్తే రూ.20 నుంచి రూ.25 ఎక్కువ. చింతపండు ధర కిలో ఏకంగా రూ.200కు చేరుకోగా, కారం రూ.170కి చేరింది. వీటి ధరల్లో పెరుగుదల ఏకంగా రూ.40–60 వరకు ఉంటోంది. అన్ని రకాల నూనెల ధరల్లోనూ రూ.10–30 వరకు పెరుగుదల ఉండగా, అవే ధరలు ఇప్పుడూ కొనసాగుతున్నాయి. ఆఫర్లు లేకపోవడమూ కారణమే.. లాక్డౌన్ సడలింపుల తర్వాత హోల్‌సేల్, రిటైలర్లతో పాటు ఈ–కామర్స్ సంస్థలు ఆఫర్లు తొలగించాయి. కొన్ని సరుకులు బహిరంగ మార్కెట్లలో ఎంఆర్పీ కన్నా ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. ఉప్పు, కారం, పాల ధరలు ఇలాగే పెరిగాయి. ఈ భారమంతా వినియోగదారుడి నడ్డి విరుస్తున్నాయి. లాక్డౌన్ అనంతరం 25 శాతం మంది వినియోగదారులు మాత్రమే సరైన ధరలకు వస్తువులు కొనుగోలు చేశామని లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో చెప్పగా, 49 శాతం మంది తాము ఎంఆర్పీ కన్నా అధిక ధరలకే కొనుగోలు చేశామని చెప్పారు. ఓ పక్క ఆదాయం తగ్గడం, మరోపక్క కిరాణా ఖర్చులు తడిసి మోపెడు అవుతుండటంతో వినియోగదారులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కరోనా నివారణకు పండ్లు తినాలన్న ప్రభుత్వ సూచనల నేపథ్యంలో ఇంటి ఖర్చు నెలకు రూ.6–8 వేల నుంచి రూ.10–12 వేలకు పెరిగినట్లు సర్వేలు చెబుతున్నాయి. లాక్డౌన్ అనంతరం సైతం వినియోగదారులు 15 శాతానికి పైగా ఈ–కామర్స్ సంస్థలపై, 8 శాతం వాట్సాప్ ఆర్డర్లపై, 19 శాతం పక్కనే ఉన్న కిరాణా దుకాణాలపై ఆధారపడుతుండగా, 53 శాతం మంది 3 కిలోమీటర్ల పరిధిలోని స్థానిక రిటైల్ దుకాణాలపై ఆధారపడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. మాల్స్, సూపర్ మార్కెట్లు, స్టోర్లకు వెళ్లేందుకు జంకుతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. -
షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్ల వైపు నో!
ముంబై: కరోనా వైరస్ సంక్షోభాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. లాక్డౌన్ కారణంగా అనేక రంగాలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. కరోనా ప్రభావం లేనప్పుడు నిత్యావసరాలు కొనుగోలు చేయడానికి ప్రజలు షాపింగ్ మాల్స్, లగ్జరీ సూపర్ మార్కెట్ల వైపు మొగ్గు చూపేవారు. అయితే ప్రస్తుత లాక్డౌన్ సమయంలో ప్రజలు నిత్యావసరాల కొనుగోలుకు కిరాణా షాపులను ఆశ్రయిస్తున్నారని ‘డెలైట్ గ్లోబల్ స్టేట్ కన్సుమర్ ట్రాకర్’ అనే సర్వే నివేదిక వెల్లడించింది. ఈ సర్వేలో 18 సంవత్సరాలు పై బడిన 1,000 మంది ప్రజలు పాల్గొన్నారు. ప్రజలు 52 శాతం డబ్డులను నిత్యావసరాల కొనుగోలుకే వాడుతున్నారని సర్వే తెలిపింది. దేశంలోని 72 శాతం వినియోగదారులు కిరాణా షాపులోనే కొనడానికి ఇష్టపడుతున్నారని సర్వే పేర్కొంది. అత్యధిక ప్రజలు కరోనాను నియంత్రించే క్రమంలో జన సమూహానన్ని తగ్గించడానికి మొగ్గు చూపుతున్నట్లు సర్వే పేర్కొంది. లాక్డౌన్ కొనసాగుతున్న క్రమంలో సర్వే ఫలితాలు ప్రజల మనోభావాలను స్పష్టం చేస్తున్నాయిని డెలైట్ ఇండియా ఉన్నతాధికారి అనిల్ తాల్ రేజా అభిప్రాయపడ్డారు. చదవండి: ఎన్సీఎల్టీలో డెలాయిట్‌కు దక్కని ఊరట -
కిరాణ షాపులే కేంద్రంగా కరోనా విజృంభణ
సాక్షి, సిటీబ్యూరో : బస్తీలు, కాలనీల్లో ఉన్న చిన్న చిన్న కిరాణా షాపులు కరోనా వైరస్‌కు కేంద్రంగా మారుతున్నాయి. బేగంబజార్, మలక్‌పేట్ గంజ్ హోల్‌సేల్ మార్కెట్ వ్యాపారుల నుంచి చిరు వ్యాపారులకు వైరస్ విస్తరిస్తుంది. వీరి ద్వారా వారి కుటుంబ సభ్యులకు, కాలనీల్లోని కొనుగోలుదారులకు వైరస్ సోకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీల్లోని చిన్న చిన్న కిరాణా షాపు నిర్వాహకుల్లో చాలా మందికి కరోనాపై సరైన అవగాహన లేదు. వీరు హోల్ సేల్ దుకాణాల నుంచి వస్తువులు తెచ్చిన తర్వాత వాటిపై శానిటైజ్ స్ప్రేలు చల్లడం లేదు. కనీసం షాపునకు వచ్చిన వారు సామాజిక దూరం పాటిస్తున్నారో..? లేదో కూడా చూడటం లేదు. అంతే కాదు వీరిలో ఎవరికి..? ఏ ఆరోగ్య సమస్య ఉందో..? గుర్తించక పోవడం..ఆయా వస్తువులనే నేరుగా కొనుగోలదారుల చేతికి అందిస్తుండటం..వారు ఇచ్చిన నగదును నేరుగా తీసుకోవడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (లాక్డౌన్ : వర్క్ ఫ్రం హోమ్ చాలా బాగుంది) ఆ ఇద్దరి నుంచే ముగ్గురు వ్యాపారులకు... జల్పల్లి, పహడీషరీఫ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తుల వల్ల మలక్పేటగంజ్లోని ముగ్గురు వ్యాపారులకు కరోనా సోకింది. ఇటీవల నమోదవుతున్న కేసుల్లో చాలా వరకు మలక్‌పేట్‌గంజ్ మూలాలే ఉండటం ఆందోళన కలిగిస్తుంది. మార్కెట్లో పల్లీనూనె వ్యాపారం చేసే సరూర్‌నగర్‌కు చెందిన వ్యక్తి(55) నుంచి వనస్థలిపురం ఏ–క్వార్టర్స్‌లో ఉండే ఆయన తండ్రి, తల్లి, సోదరుడు, సోదరుని భార్య, ఇద్దరు కుమార్తెలు, సోదరుని బావ, ఆయన ఇద్దరు పిల్లలకు ఇలా ఒక్కరి నుంచి మొత్తం తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చింది. రెండు రోజుల క్రితం పల్లీ నూనె వ్యాపారి తండ్రి(76) కరోనాతో మృతి చెందగా, తాజాగా శుక్రవారం ఆయన సోదరుడు(45) మృతి చెందాడు. ప్రస్తుతం ఆయన తల్లి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది. (కరోనా : మొన్న తండ్రి.. నిన్న కొడుకు) ఇలా ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోవడం స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. ఇక్కడ పని చేస్తున్న ఓ హమాలి కార్మికుడు రెండు రోజుల క్రితం మృతి చెందగా, మరో పండ్ల వ్యాపారికి కూడా పాజిటివ్ నిర్ధారణ కావడం కలకలం సృష్టిస్తుంది. ఇదిలా ఉంటే ఇదే మార్కెట్ కేంద్రంగా ఎక్కువ కేసులు నమోదు కావడంతో శనివారం ఆ మార్కెట్‌ను రెడ్‌జోన్‌గా ప్రకటించి, దారులను మూసివేశారు. గత 45 రోజుల్లో మార్కెట్‌కు వచ్చిన వారితో పాటు వ్యాపారులు, హమాలీలు, ఇతర వర్కర్లను గుర్తించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ►బోడుప్పల్ పెంటారెడ్డి కాలనీకి చెందిన కిరాణ షాపు నిర్వాహకునికి (46)కి వారం రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయన నుంచి కుమార్తె సహా కుమారునికి వైరస్ సోకింది. ఈయన బేగంబజార్ హోల్‌సేల్ దుకాణాల నుంచి నిత్యావసరాలు తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. ►రామంతాపూర్ శ్రీరమణపురం చర్చికాలనీకి చెందిన కిరాణా షాపు నిర్వాహకుడు(53)కి కరోనా వైరస్ సోకినట్లు పది రోజుల క్రితం నిర్ధారణ అయింది. ఆయన ద్వారా ఆయన భార్యకు కూడా వైరస్ సోకింది. ఈయనకు కూడా హోల్‌సేల్ వ్యాపారుల నుంచే వైరస్ సోకినట్లు తెలిసింది. ►చర్లపల్లి డివిజన్ వీఎన్‌రెడ్డి నగర్‌కు చెందిన కుర్కురే హోల్‌సేల్ వ్యాపారి(65)కి కరోనా సోకినట్లు నాలుగు రోజుల క్రితం నిర్ధారణ అయింది. ఆయన నుంచి ఆయన సోదరుడు, పెద్ద కోడలు, చిన్న కుమారుడు, ఇద్దరు మనవళ్లుకు వైరస్ విస్తరించింది. ►తాజాగా శనివారం సరూర్‌నగర్ జింకలబావి కాలనీకి చెందిన కిరాణాషాపు నిర్వాహకుడు(60)కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయన కుమారుడు రెగ్యులర్‌గా మలక్‌పేటగంజ్ మార్కెట్‌కు వెళ్లి వస్తువులను తెస్తుంటాడు. ఇలా కుమారుని నుంచి ఆయనకు సన్నిహితంగా ఉన్న ఆయన భార్య సహా నలుగురు కుమారులు, ముగ్గురు కోడళ్లు, నలుగురు పిల్లలు, అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న మూడు కుటుంబాలు ఇలా మొత్తం 12 మందిని క్వారంటైన్ చేశారు. ఇదే కిరాణా షాపు నుంచి సుమారు 25 కుటుంబాలు వస్తువులను కొనుగోలు చేస్తుంటాయి. దీంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ►లింగోజిగూడ డివిజన్ భాగ్యనగర్ కాలనీకి చెందిన బియ్యం వ్యాపారి(40)కి శనివారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన కుటుంబంలోని నలుగురు సభ్యులను హోం క్వారంటైన్ చేశారు. కిరాణా షాపులకు బియ్యం సరఫరా చేసి, డబ్బుల వసూళ్లకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఆయనకు వైరస్ సోకి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. -
అమెరికాలో భారత విద్యార్థి కాల్చివేత
వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓ కిరాణా దుకాణంలో దొంగతనానికి వచ్చిన నలుగురు వ్యక్తులు భారత విద్యార్థిని కాల్చి చంపారు. హంతకుల్లో ఒకరు భారత సంతతికి చెందినవాడని తెలిసింది. ఫ్రెస్నో పట్టణంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. 21 ఏళ్ల ధరమ్‌ప్రీత్ సింగ్ జసార్ అనే విద్యార్థి టాకిల్ బాక్స్ అనే స్టోర్‌లో పనిచేస్తున్నాడు. అతను విధుల్లో ఉన్న సమయంలోనే చోరీ చేయడానికి నలుగురు దొంగలు తుపాకులతో లోనికి ప్రవేశించారు. ప్రాణాలు కాపాడుకోవడానికి జసార్ క్యాష్ కౌంటర్ వెనక దాక్కున్నా దొంగతనం చేసి తిరిగి వెళ్తున్న సమయంలో దుండగుల్లో ఒకరు అతనిపై కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయాడని ఫ్రెస్నోబీ అనే స్థానిక వార్తా సంస్థ తెలిపింది. దొంగలు అక్కడి నుంచి కొంత నగదు, సిగరెట్ బాక్సులు ఎత్తుకెళ్లినట్లు పేర్కొంది. పంజాబ్‌కు చెందిన జసార్ అకౌంటింగ్ కోర్సు చేస్తున్నారు. స్టూడెంట్ వీసాపై మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. స్టోర్‌లో దొంగతనానికి పాల్పడిన నలుగురిలో ఒకడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో భారత సంతతి విద్యార్థి 22 ఏళ్ల అమృత్‌రాజ్ సింగ్ అత్వాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రూ.10కే వై-ఫై డేటా ఓచర్లు
న్యూఢిల్లీ : చాలామంది బ్యాలెన్స్ కార్డు కొనుక్కోవాలంటే పక్కనే ఉన్న కిరాణాషాపులకి వెళ్తుంటారు. ఇక నుంచి ఆ కిరాణా షాపుల్లోనే వై-ఫై డేటా ఓచర్లు కూడా దొరుకనున్నాయట. మీ పక్కనే ఉన్న కిరాణాషాపుల్లో తక్కువ ధరకి వై-ఫై డేటా సర్వీసులను అందించేలా ప్రభుత్వం టెక్నాలజీని రూపొందించింది.'పబ్లిక్ డేటా ఆఫీసు(పీడీఓ)' టెక్ సెల్యుషన్స్ పేరుతో మాస్ మార్కెట్ కోసం సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్(సీ-డీఓటీ) దీన్ని అభివృద్ధి చేసింది. తక్కువ ధరకు వై-ఫై సొల్యుషన్స్ అందించేలా దీన్ని తీసుకొచ్చారు. ఈ పీడీఓ ధర 50 వేల రూపాయలు. డీఓటీ రూపొందించిన ఈ టెక్ సొల్యుషన్స్ తో కిరణాషాపులు వై-ఫై డేటా ఓచర్లను 10 రూపాయలకే విక్రయించవచ్చు. ఉచిత లైసెన్సుతో ఈ సర్వీసులను దుకాణదారులకు సీ-డీఓటీ అందించనుంది. శుక్రవారం ఈ సర్వీసులను సీ-డీఓటీ ప్రారంభించింది. ఈ టెక్ సొల్యుషన్ ప్యాక్‌లోనే హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ కు చెందిన రెండు అంశాలుంటాయని, వైఫై, ఈ-కేవైసీ, ఓటీపీ, అథన్టికేషన్, వోచర్ మేనేజ్మెంట్ మెకానిజం ఉండనున్నట్టు సీ-డీఓటీ పేర్కొంది. ఎలక్ట్రికల్ గా రూపొందిన దీనిలో బిల్లింగ్ సిస్టమ్ కూడా ఉండబోతున్నట్టు ప్రభుత్వ టెలికాం సెంటర్ చెప్పింది. ప్రస్తుతం డిజిటల్ ఇండియా, దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించి లేదని, కానీ పీడీఓతో తక్కువ ధరకు బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను మూలమూలల విస్తరించవచ్చని సీడీఓటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విపిన్ త్యాగి చెప్పారు. 10 రూపాయలు లేదా అంతకంటే తక్కువ ధరకు ఈ డేటా సర్వీసులను కొనుక్కోవచ్చని పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో వరుస చోరీలు
హైదరాబాద్: నగరంలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా మల్కాజిగిరి ఎం.జె.కాలనీలో శనివారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. రెండు దుకాణాల షట్టర్లు పగలగొట్టి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. కాలనీలోని కిరాణ దుకాణం, మొబైల్ షాప్‌ల్లోని బియ్యం బస్తాలు, విలువైన సెల్ఫోన్లు ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం గమనించిన యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మరో ఘటనలో కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని 3వ రోడ్డులోని ఓ ఇంట్లో దొంగలు పడి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఇంట్లో వారు నిద్రిస్తుండగానే ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు 7 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గుట్టుగా గుట్కా దందా..!
సాక్షి, నిజామాబాద్ :జిల్లాలో గుట్కా దందా గుట్టుగాసాగుతోంది. ప్యాకింగ్‌లో మా ర్పులు చేసి విక్రయిస్తున్నారు. సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో గుట్కా నిల్వలను తీసుకువచ్చి జిల్లాలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు, శివారు ప్రాంతాలను అడ్డాలుగా చేసుకుని గుట్కా నిల్వలను డంప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి రిటైల్ వ్యాపారులకు రహస్యంగా సరఫరా చేస్తున్నట్లు సమాచారం. హోల్‌సేల్ కిరాణాషాపులకు, పాన్‌షాపులకు చేరవేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డి, ఆర్మూ ర్, బోధన్, బాన్సువాడ తదితర పట్టణాలకు కూడా గుట్కా ప్యాకెట్లు రవాణా అవుతున్నాయి. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రభుత్వం రాష్ట్రంలో గుట్కా విక్రయాలపై నిషేధం విధించింది. ఆరోగ్యానికి ఎంతో హాని చేసే ఈ గుట్కా తింటూ అనేక మంది గొంతు క్యాన్సర్ తదితర వ్యాధుల భారిన పడుతున్నారు. ముఖ్యంగా యువత ఈ గుట్కా మహమ్మారి బారిన పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటోంది. దీంతో ప్రభుత్వం రాష్ట్రంలో గుట్కా విక్రయాలకు చెక్‌పెట్టాలని నిర్ణయించింది. ఇదే అక్రమార్కులకు కలిసొస్తోంది. ఒకసారి గుట్కాకు అలవాట పడిన వ్యక్తి మానడం చాలా కష్టం. దీన్ని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు దండుకుంటున్నారు. నిషేధం ఉందంటూ గుట్కా రేట్లను అమాంతం పెంచేసి అమ్ముతున్నారు. జిల్లాలో ప్రతిరోజు లక్షల రూపాయల్లో ఈ గుట్కా వ్యాపారం కొనసాగుతోందని అంచనా. నగరానికి చెందిన ఓ వ్యాపారి కొందరు యువకులను నియమించుకుని జిల్లాలో పలుచోట్లకు గుట్కా నిల్వలను సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో గుట్కాలపై నిషేధం లేనప్పుడు జిల్లాలో పలుచోట్ల ఏకంగా గుట్కా తయారీ పరిశ్రమలే వెలిశాయంటే ఏమేరకు ఈ దందా కొనసాగేదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నిషేధం అమలులోకి రావడంతో ఈ యూనిట్లు మూతపడ్డాయి. కానీ దందా మాత్రం యథావిధిగా కొనసాగుతోంది. చిరు వ్యాపారులపైనే కేసులు.. పోలీసులు అడపాదడపా కిరాణాషాపులు, పాన్‌షాపుల్లో తనిఖీలు చేసి గుట్కా పాకెట్లను పట్టుకుంటున్నారు. చిరువ్యాపారులపై కేసులు నమోదు చేసి, వేల రూపాయల్లో జరిమానాలు విధిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. అయితే వీటిని సరఫరా చేస్తున్న బడా వ్యాపారులపై, గుట్కా రాకెట్‌పై దృష్టి పెట్టకపోవడం పలు ఆరోపణలకు దారితీస్తోంది. నేతల అండదండలుండటంతోనే గుట్కా దందా చేస్తున్న వ్యాపారుల జోలికి వెళ్లడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు గుట్కా స్థావరాలపై నిఘా పెంచాలని పలువురు కోరుతున్నారు.