రూ.10కే వై-ఫై డేటా ఓచర్లు
రూ.10కే వై-ఫై డేటా ఓచర్లు
Published Fri, Apr 21 2017 1:56 PM | Last Updated on Tue, Sep 5 2017 9:20 AM
న్యూఢిల్లీ : చాలామంది బ్యాలెన్స్ కార్డు కొనుక్కోవాలంటే పక్కనే ఉన్న కిరాణాషాపులకి వెళ్తుంటారు. ఇక నుంచి ఆ కిరాణా షాపుల్లోనే వై-ఫై డేటా ఓచర్లు కూడా దొరుకనున్నాయట. మీ పక్కనే ఉన్న కిరాణాషాపుల్లో తక్కువ ధరకి వై-ఫై డేటా సర్వీసులను అందించేలా ప్రభుత్వం టెక్నాలజీని రూపొందించింది.'పబ్లిక్ డేటా ఆఫీసు(పీడీఓ)' టెక్ సెల్యుషన్స్ పేరుతో మాస్ మార్కెట్ కోసం సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్(సీ-డీఓటీ) దీన్ని అభివృద్ధి చేసింది. తక్కువ ధరకు వై-ఫై సొల్యుషన్స్ అందించేలా దీన్ని తీసుకొచ్చారు. ఈ పీడీఓ ధర 50 వేల రూపాయలు.
డీఓటీ రూపొందించిన ఈ టెక్ సొల్యుషన్స్ తో కిరణాషాపులు వై-ఫై డేటా ఓచర్లను 10 రూపాయలకే విక్రయించవచ్చు. ఉచిత లైసెన్సుతో ఈ సర్వీసులను దుకాణదారులకు సీ-డీఓటీ అందించనుంది. శుక్రవారం ఈ సర్వీసులను సీ-డీఓటీ ప్రారంభించింది. ఈ టెక్ సొల్యుషన్ ప్యాక్లోనే హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ కు చెందిన రెండు అంశాలుంటాయని, వైఫై, ఈ-కేవైసీ, ఓటీపీ, అథన్టికేషన్, వోచర్ మేనేజ్మెంట్ మెకానిజం ఉండనున్నట్టు సీ-డీఓటీ పేర్కొంది. ఎలక్ట్రికల్ గా రూపొందిన దీనిలో బిల్లింగ్ సిస్టమ్ కూడా ఉండబోతున్నట్టు ప్రభుత్వ టెలికాం సెంటర్ చెప్పింది. ప్రస్తుతం డిజిటల్ ఇండియా, దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించి లేదని, కానీ పీడీఓతో తక్కువ ధరకు బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను మూలమూలల విస్తరించవచ్చని సీడీఓటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విపిన్ త్యాగి చెప్పారు. 10 రూపాయలు లేదా అంతకంటే తక్కువ ధరకు ఈ డేటా సర్వీసులను కొనుక్కోవచ్చని పేర్కొన్నారు.
Advertisement
Advertisement