C-DoT
-
వొడాఫోన్ ఐడియా నుంచి ఐవోటీ ల్యాబ్ సర్వీసులు
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) పరికరాల టెస్టింగ్ కోసం ల్యాబ్–యాజ్–ఏ–సరీ్వస్‌లను ఆవిష్కరించినట్లు టెలికం సంస్థ వీఐ (వొడాఫోన్–ఐడియా) తెలిపింది. ఇందుకోసం ప్రత్యేకంగా అధునాతన ఐవోటీ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు, సీ–డాట్ సంస్థతో కలిసి ఈ సరీ్వసులు అందిస్తున్నట్లు వివరించింది. ఇంటర్ఆపరబిలిటీ తదితర ప్రమాణాలకు సంబంధించి ఇప్పటివరకు ఆటోమొబైల్, లాజిస్టిక్స్ వంటి విభాగాల్లో 50 ఐవోటీ డివైజ్‌ల టెస్టింగ్‌ను పూర్తి చేసినట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం 5జీ డివైజ్‌లను కూడా పరీక్షిస్తున్నట్లు సంస్థ చీఫ్ ఎంటర్ప్రైజ్ బిజినెస్ ఆఫీసర్ అరవింద్ నెవాతియా తెలిపారు. -
సి–డాట్ 5జీ మొబైల్ యాంటెన్నా, 6 నెలల్లో సర్వం సిద్ధం
న్యూఢిల్లీ: మేడిన్ ఇండియా 5జీ మొబైల్ యాంటెన్నాలు వాణిజ్యపరంగా వినియోగించేందుకు వీలుగా ఆరు నెలల్లో సిద్ధం కానున్నాయని సి–డాట్ వెల్లడించింది. జియోకు చెందిన రేడిసిస్ ఇండియా, వీవీడీఎన్ టెక్నాలజీస్, వైసిగ్ నెట్వర్క్స్ సహకారంతో వీటిని అభివృద్ధి చేసినట్టు సంస్థ ప్రకటించింది. ఈ యాంటెన్నాలు వైర్లెస్ సిగ్నల్స్‌ను పంపడంతోపాటు అందుకుంటున్నాయని సి–డాట్ ఈడీ రాజ్‌కుమార్ ఉపాధ్యాయ్ తెలిపారు. ‘5జీ కోర్, 5జీ రేడియో దేశీయంగా అభివృద్ధి జరిగింది. సొంతంగా 5జీ సాంకేతికత కలిగిన కొద్ది దేశాల జాబితాలో భారత్ నిలిచింది. బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లో 5జీ రేడియో పరీక్షలు జరుపుతాం. వచ్చే ఆరు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. వాణిజ్యపరంగా ఈ యాంటెన్నాలను ఉపయోగించాలనుకునే క్లయింట్లకు సాంకేతికతను బదిలీ చేస్తాం’ అని ఉపాధ్యాయ్ చెప్పారు. -
విదేశాలకు దేశీయ 6జీ టెక్నాలజీ ఎగుమతి!
2024 నాటికి భారత్ దేశంలో 6జీ టెక్నాలజీని అమలులోకి తీసుకొని రావడానికి కృషి చేస్తున్నట్లు కమ్యూనికేషన్ శాఖ మంత్రి అశ్వినీ వైష్నావ్ నేడు(నవంబర్ 24) తెలిపారు. 6జీ సాంకేతిక పరిజ్ఞానంపై పనిచేయడానికి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు అవసరమైన అనుమతులు ఇచ్చినట్లు ఆయన అన్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ సహాయంతో 6జి టెక్నాలజీని రూపొందించనున్నట్లు వైష్నావ్ పేర్కొన్నారు. ఈ టెక్నాలజీని ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) 5జీ కోసం సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించినట్లు, 2022 ద్వితీయార్ధంలో స్పెక్ట్రమ్ వేలం వేయనున్నట్లు ఆయన అన్నారు. "5జీ స్పెక్ట్రమ్ వేలం కోసం ట్రాయ్(టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) ఇప్పటికే 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రక్రియ రాబోయే సంవత్సరంలో ఫిబ్రవరి-మార్చి వరకు ముగుస్తుంది. ఈ వేలం ప్రక్రియ తర్వాత 2022 క్యూ2 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది" అని వైష్నావ్ తెలిపారు. (చదవండి: తప్పిన తిప్పలు.. ఆన్లైన్లో అందుబాటులోకి జియోఫోన్ నెక్ట్స్!) -
6జీ ఇంటర్నెట్ స్పీడ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
మన దేశంలో ఇంకా 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రాకముందే అప్పుడే 6జీ టెక్నాలజీ మీద పనులు ప్రారంభించాలని కేంద్రం పేర్కొంది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికామ్ పరిశోధన & అభివృద్ధి సంస్థ సీ-డీఓటీని ప్రపంచ మార్కెట్ కు అనుగుణంగా 6జీ, ఇతర భవిష్యత్ టెక్నాలజీల మీద పనులు ప్రారంభించాలని టెలికాం కార్యదర్శి కె రాజరామన్ కోరారు. ఇప్పటికే శామ్ సంగ్, హువావే, ఎల్జీ కొన్ని ఇతర కంపెనీలు 6జీ టెక్నాలజీలపై పనిచేయడం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 5జీ వేగం 5జీ నెట్వర్క్ గరిష్టంగా 20 జీబీపీఎస్ డౌన్లోడ్ వేగాన్ని అందుకోగలదు. భారతదేశంలో 5జీ నెట్వర్క్ స్పీడ్ టెస్టింగ్ సమయంలో డౌన్లోడ్ గరిష్ట వేగం 3.7 జీబీపీఎస్ చేరుకుంది. ఎయిర్ టెల్, వీఐ, జియో కంపెనీలు 5జీ నెట్వర్క్ ట్రయల్స్‌లో 3 జీబీపీఎస్ వరకు డౌన్లోడ్ వేగాన్ని అందుకున్నట్లు పేర్కొన్నాయి. (చదవండి: రూ.69 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ కూడా అదుర్స్!) 6జీ వేగం 6జీ వైర్ లెస్ టెక్నాలజీ ఆరవ తరం. 6జీ నెట్వర్క్ డౌన్లోడ్ వేగం 1000 జీబీపీఎస్ కి చేరుకుంటుందని భావిస్తున్నారు. ఎల్జీ సంస్థ ఇటీవల జర్మనీలో 6జీ నెట్వర్క్ ట్రయిల్స్ ప్రారంభించినట్లు మీడియా నివేదికలు తెలిపాయి. ఈ నివేదిక ప్రకారం, ట్రయల్స్‌లో 100 మీటర్ల దూరంలో డేటాను పంపించడంతో పాటు స్వీకరించారు. 6జీ నెట్వర్క్ సహాయంతో సెకనుకు 1000 మెగాబైట్ల వేగంతో కేవలం 51 సెకన్లలో 6జీబీ మూవీని డౌన్లోడ్ చేసుకోవచ్చు.(చదవండి: సేఫ్టీలో టాటా మోటార్స్ కార్లకు తిరుగులేదు) 6జీ నెట్వర్క్ ముఖ్యాంశాలు 6జీ నెట్వర్క్ వేగం 5జీ కంటే 50 రెట్లు అధికం జపాన్‌లో 6జీ నెట్వర్క్ 2030 నాటికి ప్రారంభించవచ్చు. జపాన్‌తో పాటు, దక్షిణ కొరియా, చైనా, ఫిన్లాండ్ కూడా 6జీ నెట్వర్క్ కోసం సిద్ధమవుతున్నాయి. యూరోపియన్ యూనియన్‌లో 6జీ నెట్వర్క్ కోసం మిలియన్ల యూరోలు ఖర్చు చేస్తున్నారు. -
అప్పుడే 6జీ టెక్నాలజీపై కసరత్తు ప్రారంభించిన కేంద్రం
న్యూఢిల్లీ: ఇంకా 5జీ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రాకముందే అప్పుడే 6జీ టెక్నాలజీ మీద పనులు ప్రారంభించాలని కేంద్రం పేర్కొంది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికామ్ పరిశోధన & అభివృద్ధి సంస్థ సీ-డీఓటీని ప్రపంచ మార్కెట్ కు అనుగుణంగా 6జీ, ఇతర భవిష్యత్ టెక్నాలజీల మీద పనులు ప్రారంభించాలని టెలికాం కార్యదర్శి కె రాజరామన్ కోరారు. ఇప్పటికే శామ్ సంగ్, హువావే, ఎల్ జీ కొన్ని ఇతర కంపెనీలు 6జీ టెక్నాలజీలపై పనిచేయడం ప్రారంభించాయి. ఈ టెక్నాలజీ 5జీ కంటే 50 రెట్లు వేగంగా ఉంటుందని, 2028-2030 మధ్య వాణిజ్యపరంగా అందుబాటులోకి రానున్నట్లు భావిస్తున్నారు. వొడాఫోన్ ఐడియా భారతదేశంలో ట్రయల్స్ సమయంలో అత్యధిక గరిష్ట వేగం 3.7 జీబీపీలను సాధించినట్లు పేర్కొంది. దేశంలోని రిలయన్స్ జియో నెట్ వర్క్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) సెకనుకు 20 మెగాబిట్ వద్ద 4జీ టాప్ స్పీడ్ ను నమోదు చేసింది. అక్టోబర్ 1న డీఓటీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన రాజరామన్ టెక్నాలజీ వాణిజ్యీకరణపై దృష్టి పెట్టాలని, వేగవంతమైన సాంకేతిక వాణిజ్యీకరణ కోసం సి-డిఒటిలో ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయడాన్ని పరిగణనలోకి తీసుకోవాలి అని సీ-డీఓటీకి సూచించారు. ఇప్పటికే అమెరికా, చైనా వంటి దేశాలు 6జీ టెక్నాలజీ అభివృద్ధి, పరిశోధనలకు సంబంధించిన పనులు ప్రారంభించాయి. ఇప్పుడు వాటితో పోటీగా మన దేశంలో కూడా నూతన టెక్నాలజీల పనిచేయాలని డీఓటీ పేర్కొంది. ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, మిక్స్ డ్ రియాలిటీ కలిసిన XR టెక్నాలజీతో.. ఎంటర్టైన్మెంట్, మెడిసిన్, సైన్స్, విద్య, తయారీ పరశ్రమల బౌండరీలను 6జీ పెంచనుంది. -
గామీణ ప్రాంతాల్లోనూ 5జీ ట్రయల్స్!
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ 5జీ పరీక్షలు జరిపేలా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆదేశాలు వెలువరించే అవకాశం ఉంది. ఆరు నెలలపాటు ట్రయల్స్ నిర్వహించుకునేలా భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాకు కేంద్రం అనుమతించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబై, కోల్‌కత, బెంగళూరు, గుజరాత్లో ఈ పరీక్షలు జరుగుతాయి. టెస్టుల్లో భాగంగా టెలి మెడిసిన్, టెలి ఎడ్యుకేషన్, డ్రోన్ ఆధారిత వ్యవసాయం తీరును సైతం పర్యవేక్షిస్తారు. అనుమతి రుసుము చెల్లించిన తర్వాత ఎంటీఎన్ఎల్కు కూడా ట్రయల్ స్పెక్ట్రం కేటాయించనున్నారు. ఢిల్లీలో 5జీ ట్రయల్స్ కోసం సీ-డాట్‌తో ఈ సంస్థ చేతులు కలిపింది. భారత్‌లో 5జీ పరీక్షల కోసం ఎరిక్సన్, నోకియా, శామ్సంగ్, సి-డాట్ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మాత్రమే వినియోగించుకునేందుకు అనుమతి ఉంది. చైనా కంపెనీలకు ఈ విషయంలో అవకాశం ఇవ్వలేదు. రిలయన్స్ జియో తన సొంత టెక్నాలజీతోపాటు శామ్సంగ్ నెట్వర్క్ గేర్స్‌ను వినియోగిస్తున్నట్టు సమాచారం. 4జీతో పోలిస్తే 5జీ డౌన్లోడ్ వేగం పదిరెట్లు మెరుగ్గా ఉంటుందని టెలికం శాఖ అంచనా వేస్తోంది. చదవండి: స్పేస్ ఎక్స్ కు పోటీగా దూసుకెళ్తున్న వన్‌వెబ్ -
రూ.10కే వై-ఫై డేటా ఓచర్లు
న్యూఢిల్లీ : చాలామంది బ్యాలెన్స్ కార్డు కొనుక్కోవాలంటే పక్కనే ఉన్న కిరాణాషాపులకి వెళ్తుంటారు. ఇక నుంచి ఆ కిరాణా షాపుల్లోనే వై-ఫై డేటా ఓచర్లు కూడా దొరుకనున్నాయట. మీ పక్కనే ఉన్న కిరాణాషాపుల్లో తక్కువ ధరకి వై-ఫై డేటా సర్వీసులను అందించేలా ప్రభుత్వం టెక్నాలజీని రూపొందించింది.'పబ్లిక్ డేటా ఆఫీసు(పీడీఓ)' టెక్ సెల్యుషన్స్ పేరుతో మాస్ మార్కెట్ కోసం సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్(సీ-డీఓటీ) దీన్ని అభివృద్ధి చేసింది. తక్కువ ధరకు వై-ఫై సొల్యుషన్స్ అందించేలా దీన్ని తీసుకొచ్చారు. ఈ పీడీఓ ధర 50 వేల రూపాయలు. డీఓటీ రూపొందించిన ఈ టెక్ సొల్యుషన్స్ తో కిరణాషాపులు వై-ఫై డేటా ఓచర్లను 10 రూపాయలకే విక్రయించవచ్చు. ఉచిత లైసెన్సుతో ఈ సర్వీసులను దుకాణదారులకు సీ-డీఓటీ అందించనుంది. శుక్రవారం ఈ సర్వీసులను సీ-డీఓటీ ప్రారంభించింది. ఈ టెక్ సొల్యుషన్ ప్యాక్‌లోనే హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ కు చెందిన రెండు అంశాలుంటాయని, వైఫై, ఈ-కేవైసీ, ఓటీపీ, అథన్టికేషన్, వోచర్ మేనేజ్మెంట్ మెకానిజం ఉండనున్నట్టు సీ-డీఓటీ పేర్కొంది. ఎలక్ట్రికల్ గా రూపొందిన దీనిలో బిల్లింగ్ సిస్టమ్ కూడా ఉండబోతున్నట్టు ప్రభుత్వ టెలికాం సెంటర్ చెప్పింది. ప్రస్తుతం డిజిటల్ ఇండియా, దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించి లేదని, కానీ పీడీఓతో తక్కువ ధరకు బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను మూలమూలల విస్తరించవచ్చని సీడీఓటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విపిన్ త్యాగి చెప్పారు. 10 రూపాయలు లేదా అంతకంటే తక్కువ ధరకు ఈ డేటా సర్వీసులను కొనుక్కోవచ్చని పేర్కొన్నారు.