
న్యూఢిల్లీ: మేడిన్ ఇండియా 5జీ మొబైల్ యాంటెన్నాలు వాణిజ్యపరంగా వినియోగించేందుకు వీలుగా ఆరు నెలల్లో సిద్ధం కానున్నాయని సి–డాట్ వెల్లడించింది.
జియోకు చెందిన రేడిసిస్ ఇండియా, వీవీడీఎన్ టెక్నాలజీస్, వైసిగ్ నెట్‌వర్క్స్ సహకారంతో వీటిని అభివృద్ధి చేసినట్టు సంస్థ ప్రకటించింది. ఈ యాంటెన్నాలు వైర్‌లెస్ సిగ్నల్స్‌ను పంపడంతోపాటు అందుకుంటున్నాయని సి–డాట్ ఈడీ రాజ్‌కుమార్ ఉపాధ్యాయ్ తెలిపారు. ‘5జీ కోర్, 5జీ రేడియో దేశీయంగా అభివృద్ధి జరిగింది. సొంతంగా 5జీ సాంకేతికత కలిగిన కొద్ది దేశాల జాబితాలో భారత్ నిలిచింది.
బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌లో 5జీ రేడియో పరీక్షలు జరుపుతాం. వచ్చే ఆరు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. వాణిజ్యపరంగా ఈ యాంటెన్నాలను ఉపయోగించాలనుకునే క్లయింట్లకు సాంకేతికతను బదిలీ చేస్తాం’ అని ఉపాధ్యాయ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment