ప్రముఖ దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో యూజర్లకు 5జీ నెట్‌వర్క్‌ను అందించేందుకు ప‍్రయత్నాలు ముమ్మరం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వారం ప్రారంభంలో బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో 5జీ సేవల్ని ప్రారంభించిన జియో.. తాజాగా మరో 16 నగరాల్లో యూజర్లు వినియోగించేలా అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది.
జియో అందుబాటులోకి తెచ్చిన 16 నగరాల్లో కర్నూలు,కాకినాడ (ఆంధ్రప్రదేశ్), సిల్చార్ (అస్సోం), దేవనగరి, శివమొగ్గ, బీదర్, హోస్‌పేట్, గడగ్-బెటగేరి (కర్ణాటక),మలప్పురం,పాలక్కాడ్,కొట్టాయం, కానూర్ (కేరళ), తిరుపూర్ (తమిళనాడు), నిజామాబాద్, ఖమ్మం (తెలంగాణ), బరేలీ(ఉత్తర్ ప్రదేశ్)లు ఉన్నాయి.
అధిక నగరాల్లో జియో 5జీ సేవలు
దేశంలో తొలిసారి అధిక నగరాల్లో 5జీ సేవల్ని అందుబాటులోకి తెచ్చిన టెలికం సంస్థగా జియో ప్రసిద్ది చెందింది. ఇక జియో 5జీ నెట్ వర్క్ వినియోగించుకునేందుకు సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో జియో వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా 1జీబీపీఎస్ వరకు అన్‌లిమిటెడ్ డేటా పొందవచ్చని జియో మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓ ప్రకటనలో తెలిపింది.
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తర్‌ఖండ్,బీహార్,జార్ఖండ్‌లలో కనెక్టివిటీ సర్వీసుల్ని వినియోగంలోకి తెచ్చిన జియో.. విడతల వారీగా దేశ వ్యాప్తంగా ఈ ఫాస్టెస్ట్ నెట్‌వర్క్ సేవల్ని యూజర్లకు అందిస్తామని జియో ప్రతినిధులు తెలిపారు.
ఈ సందర్భంగా జియో అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. జియో 5 జీ నెట్ వర్క్ వాణిజ్యం, టూరిజం, ఎడ్యూకేషన్ హబ్స్‌గా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చాం. జియో 5జీ నెట్ వర్క్‌తో టెలికం సేవలతో పాటు ఈ-గవర్నెన్స్,ఎడ్యుకేషన్, ఆటోమెషిన్, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్,గేమింగ్, అగ్రికల్చర్, ఐటీ, చిన్న మధ్యతరహా పరిశ్రమ వంటి రంగాలు గణనీయమైన వృద్ది సాధిస్తాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
చదవండి👉 ఫోన్‌ల జాబితా వచ్చేసింది, ఎయిర్‌టెల్ 5జీ నెట్ వర్క్ పనిచేసే స్మార్ట్ ఫోన్‌లు ఇవే!
Comments
Please login to add a commentAdd a comment