Jio Phone 5G Leaked Online Before Launch, Check Price Details And Key Specifications - Sakshi
Sakshi News home page

విడుదలకు ముందే జియో 5జీ ఫోన్‌ ఫోటోలు లీక్‌, ధర మరీ ఇంత తక్కువా?

Published Fri, Jun 23 2023 3:14 PM | Last Updated on Fri, Jun 23 2023 3:39 PM

Jio Phone 5g Leaked Online - Sakshi

ప్రముఖ దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియో త్వరలో 5జీ ఫోన్‌ను విడుదల చేయనుంది. విడుదలకు ముందే ఆ ఫోన్‌  ఫోటోలు లీకయ్యాయి. అయితే, లీకైన ఫొటోల్లానే జియో ఫోన్‌ ఉంటుందా? ఏవైనా మార్పులుంటాయనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉండగా.. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చక్కెర్లు కొడుతున్న ఫోటోలు జియో అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 

ట్విటర్‌ యూజర్‌ అర్పిత్‌ నహిమిలా పోస్ట్‌ చేసిన ఆ ఫోటొల్ని పరీక్షిస్తే జియో ఫోన్‌ డ్యూయల్‌ రేర్‌ కెమెరా, బ్లాక్‌ కలర్‌ వేరియంట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు 13 మెగా పిక్సెల్‌ ఏఐ కెమెరా, 2 మెగా పిక్సెల్‌ సెకండరీ లెన్స్‌, కెమెరా ముందు భాగం 5 మెగా పిక్సెల్‌ షూటర్‌తో వాటర్‌డ్రాప్‌ స్టైల్‌ నాచ్‌, ఫోన్‌ బాడీ ఫైబర్‌ ప‍్లాస్టిక్‌తో తయారైంది. 5జీ యూనిసాస్‌ ప్రాసెసర్‌, డైమన్సిటీ 700 ఎస్‌ఓఎస్‌గా ఉంది. ఇక, ఈ ఏడాది దివాళి లేదా కొత్త ఏడాది మధ్య కాలంలో విడుదల కానున్న జియో 5జీ ఫోన్‌ ధర రూ.10,000 ఉండనున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి.   

గతంలో వెలుగులోకి వచ్చిన రిపోర్ట్‌లలో జియో ఫోన్‌ 5జీ 4జీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, స్నాప్‌ డ్రాగన్‌ 480 ఎస్‌ఓఎస్‌ను పొందవచ్చని పేర్కొంది. 5జీ ఫోన్ 90హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల హెచ్‌ప్లస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 12 సపోర్ట్‌తో జియో 18 డబ్ల్యూ ఛార్జింగ్‌ సపోర్ట్‌, 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీతో రానున్నట్లు ఆ నివేదికలు హైలెట్‌ చేశాయి. స్మార్ట్‌ఫోన్ ధర రూ. 8,000  నుంచి రూ. 12,000 ఉండనున్నట్లు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ రిపోర్ట్ గత సంవత్సరం అంచనా వేసింది.

ఫోన్ గూగుల్ మొబైల్ సర్వీసెస్, జియో యాప్స్‌తో ఇన్‌ బిల్ట్‌ అయి వస్తున్నాయి. ఇందుకోసం గత ఏడాది జియో గూగుల్‌తో కలిసి పనిచేస్తున్నట్లు ధృవీకరించింది. ఫోన్‌లతో పాటు అతితక్కువ ధరకే ల్యాప్‌ట్యాప్‌లను జియో అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 1.6-అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 665 ఎస్‌ఓఎస్‌, 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీతో బడ్జెట్‌ ల్యాప్‌ ట్యాప్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 15,799.

చదవండి : రిలయన్స్‌తో ఒప్పందం.. భారత్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న చైనా కంపెనీ?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement