
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ కిరాణ మర్చంట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. వారం రోజుల పాటు బేగంబజార్‌లోని కిరాణా దుకాణాలు మూసివేయనున్నారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 5 వరకు బేగంబజార్‌లో దుకాణాలు మూసివేయనున్నట్లు కిరాణా మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్న విషయాన్ని చిరు వ్యాపారులు, ప్రజలు గమనించగలరని ఆయన విజ్ఞప్తి చేశారు. (చైనా ఉత్పత్తులకు తగ్గని ఆదరణ)
కాగా, రాష్ట్రంలో కరోనా కేసులు పదివేలు దాటేశాయి. నిన్న ఒక్కరోజే 891 మందికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో కేసుల సంఖ్య 10,444కి చేరింది. ఇందులో 5,858 మంది వివిధ ఆస్పత్రులు, హోం ఐసోలేషన్లలో చికిత్స పొందుతుండగా.. 4,361 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరో ఐదుగురు మరణించడంతో ఇప్పటివరకు కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 225కి పెరిగింది. (ఇక నుంచి ఇవి ప్లాట్‌ఫాంపై అమ్మబడును)
Comments
Please login to add a commentAdd a comment