begum bazar
-
బేగం బజార్ సీఐపై చేయిచేసుకున్న ఆశా వర్కర్స్
-
బేగం బజార్ లో భూముల ధరలకు రెక్కలు.. గజం ఎంతంటే..?
-
‘గోల్డెన్’ బజార్!.. గజం ధర రూ.10 లక్షలు
హోల్‌సేల్ మార్కెట్లకు కేంద్రమైన బేగంబజార్ స్థల యజమానులకు మాత్రం గోల్డెన్ బజార్‌గా మారింది. కోకాపేటలో ఎకరం భూమి రూ.100 కోట్లు పలికితేనే అంతా ఆశ్చర్యపోయారు. కానీ తాజాగా పాతబస్తీని ఆనుకుని ఉన్న బేగంబజార్ ఫీల్ఖానాలోని 101 గజాల స్థలం రూ.10 కోట్లకు అమ్ముడుపోయింది. తద్వారా తెలంగాణలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా బేగంబజార్ నిలిచిందని స్థిరాస్తి రంగ నిపుణులు చెబుతున్నారు. – అబిడ్స్ (హైదరాబాద్)ఎందుకింత డిమాండ్?తెలుగు రాష్ట్రాల్లో హోల్‌సేల్ మార్కెట్లకు కేరాఫ్ అడ్రస్ బేగంబజార్. వాణిజ్య మార్కెట్లో దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పోటీపడుతోంది. ఉత్తర్‌ప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు చెందిన హోల్‌సేల్ వ్యాపారస్తులు బేగంబజార్‌లో స్థిరపడ్డారు. ఇక్కడ సుమారు 5–6 వేల హోల్‌సేల్ దుకాణాలుంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి నిత్యం దాదాపు లక్ష మంది రిటైల్ వ్యాపారస్తులు వస్తుంటారు. దీంతో కొత్తగా మౌలిక వసతుల అభివృద్ధి లేకపోయినప్పటికీ దుకాణాలు, వాణిజ్య సముదాయాలకు అవసరమైన స్థలాలకు డిమాండ్ విపరీతంగా ఉంటోంది. కొన్నిచోట్ల భూమి అందుబాటులో లేకపోవడంతో పాత భవనాలను కూల్చి కొత్త వాటిని నిర్మిస్తుండటం గమనార్హం. ఇక ఎక్కడైనా కొద్దిపాటి స్థలం అందుబాటులో ఉంటే పదుల సంఖ్యలో వ్యాపారస్తులు పోటీ పడుతున్నారు. దీంతో ఏ గల్లీలో అయినా స్థల యజమానులకు కాసుల వర్షం కురుస్తోంది. కొనుగోలుదారుల నుంచి ఉన్న డిమాండ్ కారణంగా భూ యజమానులు రాత్రికి రాత్రే ధరలను పెంచేస్తున్నారు. అత్యధికంగా ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారులు భూ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. -
బేగంబజార్ లో హోలీ సంబరాలు (ఫోటోలు)
-
BJP MLA Raja Singh: అరెస్ట్.. టెన్షన్
సాక్షి, హైదరాబాద్ /చార్మినార్/అబిడ్స్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు గురువారం మరోసారి అరెస్ట్ చేయడంతో ధూల్‌పేట్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం మంగళ్‌హాట్, షాహినాయత్‌గంజ్ పోలీసులు రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేశారు. మధ్యాహ్నం వెస్ట్‌జోన్ పోలీసులతో పాటు టాస్‌్కఫోర్స్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజాసింగ్ ఇంటి వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. రాజాసింగ్ ఇంటి పరిసర ప్రాంతాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఆయనను అరెస్ట్ చేశారు. ధూల్‌పేటతో పాటు గోషామహల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చార్మినార్ వద్ద బలగాల పహారా రాజాసింగ్ అరెస్టుకు నిరసనగా వ్యాపారులు దుకాణాలను మూసివేశారు. కొంతమంది బీజేపీ కార్యకర్తలు ద్విచక్ర వాహనాలపై వచ్చి దుకాణాలను మూసివేయించగా పలు ప్రాంతాల్లో స్వచ్ఛందంగా మూసివేశారు. ఫీల్‌ఖానా, బేగంబజార్, కోల్సివాడి, ఛత్రి, మిట్టికాషేర్, సిద్దిఅంబర్ బజార్, బర్తన్‌బజార్ ప్రాంతాల్లో దాదాపు వెయ్యిమంది వ్యాపారులు తమ దుకాణాలను మూసివేశారు. రాజాసింగ్ అరెస్టుతో ఎంజే మార్కెట్ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను బీజేపీ కార్యకర్తలు, రాజాసింగ్ అభిమానులు దహనం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మజ్లిస్, టీఆర్ఎస్లు కక్షతోనే ఎమ్మెల్యేని అరెస్ట్ చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. గోషామహల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. బేగంబజార్, జాంబాగ్, ధూల్‌పేట్, మంగళ్‌హాట్, చుడీబజార్ తదితర ప్రాంతాల్లో ప్రజలు రాజాసింగ్ అరెస్టుపై చర్చించుకోవడం కనిపించింది. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న రాజాసింగ్ అభిమానులు ఈ రోజు గడిస్తే చాలు! శుక్రవారం.. సాధారణ పరిస్థితుల్లోనే నగర పోలీసులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అలాంటిది ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. కేవలం పాతబస్తీలోనే కాకుండా నగర వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నగరం సోమవారం రాత్రి నుంచి అట్టుడుకుతోంది. గురువారం సాయంత్రానికి సాధారణ పరిస్థితులు నెలకొన్నా.. ఎలాంటి ఏమరుపాటుకు తావివ్వకూడదని నిర్ణయించారు. దక్షిణ, తూర్పు, పశ్చిమ మండలాల్లోని పోలీసు స్టేషన్ల పరిధితో పాటు మిగిలిన చోట్లా ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. బేగం బజార్లో భారీగా మోహరించిన పోలీసులు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు.. బారికేడ్లు, సున్నిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పికెట్ల వద్ద ఉన్న సిబ్బందికి తోడు అత్యవసర సమయాల్లో వి«నియోగించడానికి స్టైకింగ్ ఫోర్స్ టీమ్స్‌ను సిద్ధం చేస్తున్నారు. సమస్యాత్మక వ్యక్తుల కదలికలను కనిపెట్టి, వెంబడించడానికి మఫ్టీల్లో ఉండే షాడో పారీ్టలు ఏర్పాటు చేశారు. అవసరాన్ని బట్టి నగరంలోని ఏ ప్రాంతానికైనా తరలించేందుకు వీలుగా కొన్ని ప్రత్యేక బలగాలను రిజర్వ్‌లో ఉంచారు. విధుల్లో ఉన్న ఐపీఎస్ అధికారుల వెంట కొన్ని రిజర్వ్ టీమ్స్ ఉంటాయి. ఇవి సదరు అధికారి వెంటే ఉంటూ అవసరమైన చోటకు వెళ్తాయి. నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అణువణువు నిఘా ఉంచి, చిత్రీకరించడానికి వీడియో, డిజిటల్ కెమెరాలతో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. పీస్ కమిటీలతో పోలీసులు ముందుకు వెళ్తున్నారు. అత్యంత అప్రమత్తంగా.. బందోబస్తు, భద్రత ఏర్పాట్లను నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో పాతబస్తీలోని ప్రాంతాలతో పాటు మిగిలిన చోట్లా అత్యంత అప్రమత్తత ప్రకటించారు. దీనికి సంబంధించి కమిషనర్ గురువారం విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సీవీ ఆనంద్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి నగర అధికారులతో పాటు బందోబస్తు కోసం జిల్లాలు, ఇతర విభాగాల నుంచి వచ్చిన అధికారులు హాజరయ్యారు. ఇందులో శుక్రవారం అమలు చేయాల్సిన వ్యూహాన్ని ఖరారు చేశారు. అత్యంత సున్నిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్న దక్షిణ, తూర్పు, పశ్చిమ మండలాలతో పాటు సోమవారం రాత్రి నుంచి నిరసనలు చోటు చేసుకున్న చోట్ల ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్లోని దృశ్యాలను కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించనున్నారు. అనుమానాస్పద కదలికలు ఇతర వ్యవహారాలను పసిగట్టడానికి వీటిని ఉపయోగించనున్నారు. దీని కోసం కంట్రోల్ రూమ్‌లో ప్రత్యేక సిబ్బందిని నియమించారు. రాజాసింగ్ అరెస్టును నిరశిస్తూ దుకాణాలు మూసివేత బోసిపోయిన పాతబస్తీ: పాతబస్తీలో గురువారం ప్రశాంత వాతావరణం కనిపించింది. ఉదయం నుంచీ సాయంత్రం ఎలాంటి నిరసన కార్యక్రమాలు.. ఆందోళనలు జరగలేదు. శాలిబండ చౌరస్తా వద్ద బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు మజ్లిస్ నాయకులతో పాటు ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రధాన రోడ్లపైకి వచ్చి రాజాసింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజాసింగ్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో దక్షిణ మండలం పోలీసులు లాఠీ చార్జి చేశారు. విషయం తెలుసుకున్న శాలిబండ మజ్లిస్ కార్పొరేటర్ ముజఫర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కాగా.. రెండు మూడు రోజులుగా పాతబస్తీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చార్మినార్ వద్ద సందర్శకుల సందడి తగ్గింది. చిరు వ్యాపారాలు వెలవెలబోయాయి. నయాపూల్, మదీనా, మీరాలంమండి, పత్తర్‌గట్టి, గుల్జార్‌హౌజ్, చార్‌కమాన్, లాడ్‌బజార్ తదితర ప్రాంతాల్లోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. పాతబస్తీలో ఎలాంటి నిరసన ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి ఎవరికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య తెలిపారు. ప్రాంతాలను బట్టి ఏర్పాట్లు.. నగర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ఈ బందోబస్తులో ప్రాంతాల స్థితిగతులను బట్టి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి ఉద్రిక్తతలు, ఉద్రేకాలకు తావు లేని చోట్ల సాధారణ స్థాయి పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. రాజధానిలోని అన్ని ప్రాంతాల్లో తనిఖీలు, సోదాలు, నాకాబందీలు నిర్వహించాలని నిర్ణయించారు. గురువారం రాత్రి నుంచే ఇవి ప్రారంభం కానున్నాయి. సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. కేవలం ప్రధాన రహదారులకే పరిమితం కాకుండా గల్లీలు, మారుమూల ప్రాంతాల్లోనూ చేపట్టాలని సిబ్బందికి ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. బుధవారం అర్ధరాత్రి, గురువారం తెల్లవారుజామున సైతం పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగాయి. రాజేష్ మెడికల్ హాల్ వద్ద పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. వీరిని వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం వదిలిపెట్టారు. బుధవారం మొఘల్‌పురా వద్ద పోలీసు వాహనం ధ్వంసానికి సంబంధించి స్థానిక ఠాణాలో కేసు నమోదైంది. (చదవండి: రాజా సింగ్‌పై పీడీ యాక్ట్.. ఈ చట్టం ఉద్దేశం ఏంటి?) -
బేగంబజార్ పరువు హత్య: సంజన తల్లి ముందుగానే హెచ్చరించినా..
హైదరాబాద్: నగరంలోని బేగం బజార్లో.. పరువు హత్యకు గురైన నీరజ్ పర్వాన్ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు అంశాలు వెలుగు చూశాయి. సంజన తల్లి నీరజ్-సంజనలను ముందుగానే హెచ్చరించినా.. వాళ్లు వినకపోవడం, తదనంతర పరిణామాలు సంజన బంధువుల్లో నీరజ్ పట్ల మరింత విద్వేషాన్ని రగిల్చిందని తెలుస్తోంది. కులాంతర వివాహం కావడంతో పరువు పోయి ఆ అవమానభారంతోనే నీరజ్‌ను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో నిందితులు ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. పెళ్లి, ఆ తర్వాత బాబు పుట్టినతర్వాత యాదవ అహీర్ సమాజ్‌కు చెందిన వ్యక్తులతో నీరజ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు నిందితులు తెలిపారు. ఈ ఘటన తర్వాత యాదవ్ సమాజ్‌లోని కార్యక్రమాలకు సైతం సంజన కుటుంబీకులను పిలవకపోవడంతో ఆ కుటుంబం రగిలిపోయిందట. పైగా తమ కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో.. ఎక్కడికి వెళ్లినా అవమానపడ్డ సంజన కుటుంబ సభ్యులు. వాస్తవానికి గతేడాది ఏప్రిల్‌లో సంజనకు, మరో అబ్బాయితో నిశ్చితార్థం ఏర్పాటు చేశారు ఆమె కుటుంబ సభ్యులు. అయితే అంతుకు ముందే ఇంట్లోంచి వెళ్లిపోయిన సంజన, నీరజ్‌ను షంషీర్‌గంజ్‌లోని సాయిబాబా ఆలయంలో ప్రేమపెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో.. బాబు పుట్టాక తన తల్లితో సంజన మాట్లాడింది. ఆ సమయంలో.. ఎట్టిపరిస్థితుల్లో బేగం బజార్‌కు రావొద్దని సంజన తల్లి ఆ జంటను హెచ్చరించినట్లు రిపోర్ట్‌లో ఉంది. అయితే ఆమె హెచ్చరికలను లెక్క చేయని ఆ జంట.. బేగం బజార్లోనే ఉంది. దీంతో ఎలాగైనా నీరజ్‌ను హత్య చేయాలని ప్లాన్ చేసుకున్నారు నిందితులు. గురువారం జుమేరాత్ బజార్లో కత్తులు, రాడ్లు కొన్నారు. ఘటనకు ముందు పీకలదాకా మద్యం సేవించారు. శుక్రవారం రాత్రి నీరజ్ కోసం ఓ బాలుడితో రెక్కీ చేశారు. ఆ సమయంలో తాతతో కలిసి బైక్‌పై వెళ్తున్న నీరజ్ కంట్లో కారం చల్లి.. కత్తులతో దాడి చేసి హతమార్చారు. చదవండి: నా అత్తమామలకు కూడా ప్రాణహాని ఉంది-నీరజ్ భార్య -
నీరజ్‌ను చంపినవాళ్లను అరెస్ట్ చేశాం: డీసీపీ జోయల్ డేవిస్
హైదరాబాద్: సరూర్ నగర్ ఘటన తరహాలోనే సంచలనం సృష్టించింది చర్చనీయాంశంగా మారింది బేగంబజార్ పరువు హత్య. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు నగర వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు. శనివారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన.. కేసు పురోగతి వివరాలను వెల్లడించారు. ఈ ఉదంతంలో మధ్యవర్తుల ద్వారా నిందితులు ఉన్న ప్రాంతాన్ని గుర్తించినట్లు తెలిపిన డీసీపీ.. గంటల వ్యవధిలోనే ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. గతేడాది ఏప్రిల్‌లో సంజన, నీరజ్ పన్వార్‌లు షంషీర్‌గంజ్‌లోని సాయిబాబా ఆలయంలో ప్రేమపెళ్లి చేసుకున్నారు. వీళ్ల వివాహం పెద్దలకు ఇష్టం లేదు.. ఒప్పుకోలేదు. దీంతో వీళ్లిద్దరూ ఫలక్‌నుమాలోని షంషీర్‌గంజ్‌లో కాపురం పెట్టారు. నీరజ్ వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో సంజన బంధువులు నీరజ్‌పై కక్ష పెంచుకున్నారు. తాగిన మైకంలో ఈ నేరం చెయ్యాలి అని అనుకున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఏడున్నర గంటల ప్రాంతాలో హైదరాబాద్ బేగంబజార్ మార్కెట్ వద్ద నీరజ్ పన్వర్ అలియాస్ బంటీపై హత్యకు స్కెచ్ గీశారు. నీరజ్ తన తాతయ్యతో కలిసి బైక్‌పై బంధువుల ఇంటికి వెళ్తుండగా యాదగిరి గల్లి, చేపల మార్కెట్ వద్ద అతడిని ఆపి కత్తులు, బండరాళ్లతో దాడికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావానికి గురై ఓజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు నీరజ్. నిందితులను.. అభినందన్ యాదవ్, విజయ్ యాదవ్, సంజయ్ యాదవ్, రోహిత్ యాదవ్, మహేష్ అహీర్ యాదవ్‌తో పాటు ఒక మైనర్ కూడా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. నీరజ్‌ను ఆరుగురు కలిసే చంపారని డీసీపీ వెల్లడించారు. నగర సీపీ ఆదేశాల మేరకు ఏడు బృందాలను ఏర్పాటుచేయగా.. షాహినాయత్‌గంజ్ పోలీసులు 24 గంటల్లో నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ వెల్లడించారు. -
హైదరాబాద్‌లో మరో పరువు హత్య.. కేసులో పురోగతి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో బేగంబజార్‌కు కోల్సివాడికి చెందిన నీరజ్ పన్వార్ (21) అనే యువకుడిని కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు పాల్పడిన ఐదుగురిని అరెస్ట్ చేయగా, మరో 10 మందిని కూడా అదుపులోకి తీసుకొని టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు. పరువు హత్య? వివరాల ప్రకారం.. బేగంబజార్‌కు కోల్సివాడికి చెందిన నీరజ్ పన్వార్ (21) శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో అతని భార్య సోదరులు, వారి స్నేహితులను కిరాతకంగా హతమార్చారు. ఆ వెంటనే కర్ణాటకలోని గుడిమిత్కల్ ప్రాంతానికి వారు పారిపోయారు. రెండు వాహనాల పై వెళ్ళిన ఐదుగురు హంతకులు మృతుడు నీరజ్ భార్య సంజన కజిన్ బ్రదర్స్, వారి ముగ్గురు స్నేహితులుగా పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు కర్ణాటక గుడిమత్కల్లో నిందితులు ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గుడిమిత్కల్‌లో వారిని అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే మొత్తం 10మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నీరజ్ పోస్టుమార్టంపై ప్రాథమిక నివేదిక నీరజ్ పోస్టుమార్టంపై ప్రాథమిక నివేదికను ఫోరెన్సిక్ వైద్యులు వెల్లడించారు. నీరజ్ శరీర భాగాల్లో పలుచోట్ల గాయాలు గుర్తించారు ఫోరెన్సిక్ వైద్యులు. నీరజ్ తల, మెడ, ఛాతి భాగాల్లో 10కిపైగా కత్తిపోట్లు గుర్తించారు.దీనికి సంబంధించిన ప్రాథమికి నివేదికన పోలీసులకు అందజేశారు వైద్యులు. చదవండి: హైదరాబాద్‌లో మరో పరువు హత్య?.. బేగంబజార్‌లో యువకుడిని ఘోరంగా చంపిన దుండగులు -
హైదరాబాద్ బేగంబజార్ లో దారుణం
-
పెళ్లైనప్పటి నుంచి మాటలు లేవు.. నా భర్తను చంపింది వాళ్లే: నీరజ్ భార్య
సాక్షి, హైదరాబాద్: తన భార్తను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మృతుడు నీరజ్ భార్య సంజన కోరారు. నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. కాగా బేగంబజార్‌కు కోల్సివాడికి చెందిన నీరజ్ పన్వార్ (21) శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో నలుగురు దుండగులు కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. తాతతో కలిసి నీరజ్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా చేపల మార్కెట్ సమీపంలో మాటేసిన దుండగులు ఒక్కసారిగా అతనిపై దాడి చేసి.. కత్తులతో పొడిచి చంపారు. వేరే కులానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నందుకే యువతి కుటుంబ సభ్యులు కక్ష పెంచుకుని హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇటీవల సరూర్‌నగర్‌లో జరిగిన పరువు హత్యను మరువక ముందే చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం సృష్టించింది ఈ ఘటనపై నీరజ్ భార్య స్పందిస్తూ.. వివాహం అయినప్పటి నుంచీ వారి నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయని చెప్పారు. తన కజిన్ విజయ్, సంజులే ఈ హత్య చేశారని, మరో ముగ్గురుతో కలిసి ఈ దారుణానికి తెగబడ్డారని తెలిపింది. వారి నుంచి తనకు, తన అత్త, మామలకు కూడా ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. నీరజ్‌తో పెళ్లి అయినప్పటి నుంచి వారితో సంబంధాలు లేవని తెలిపింది. ‘నేను వివాహం చేసుకున్న తర్వాత నా బిడ్డ చనిపోయింది అని వారు నన్ను వదిలేశారు. కానీ వాళ్లు ఇప్పుడిలా చేయడం వల్ల నాకు అన్యాయం జరిగింది’ అంటూ సంజన వాపోయింది. ఇక వ్యాపారి నీరజ్ పన్వార్ హత్యను నిరసిస్తూ బేగంబజార్ వ్యాపారులు మార్కెట్ బంద్ పాటిస్తున్నారు. నీరజ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యాపారవేత్తలందరూ ఈ హత్యను ఖండిస్తున్నామని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను శిక్షించాలని కోరుతున్నారు. పోలీసులు వేగంగా స్పందించిన నిందితులను అరెస్ట్ చేయడంపై కృతజ్ఞతలు తెలిపిన వ్యాపారులు వారికి త్వరగా శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడితేనే ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగవని చెబుతున్నారు. తన కుమారుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మృతుడు నీరజ్ పన్వార్ తండ్రి జగదీష్ ప్రసాద్ పన్వార్ డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎం , కమిషనర్ ఆఫ్ పోలీస్ తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. చదవండి: పురిటి నొప్పులతో ఆసుపత్రికి.. అమ్మతనం ఆస్వాదించకుండానే.. -
హైదరాబాద్‌లో మరో పరువు హత్య? వెంటాడి కత్తులతో..
-
తాత కళ్లముందే దారుణం.. హైదరాబాద్‌లో మరో పరువు హత్య?
అబిడ్స్ (హైదరాబాద్): బేగంబజార్‌కు కోల్సివాడికి చెందిన నీరజ్ పన్వార్ (21) శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో తన తాతతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. చేపల మార్కెట్ సమీపంలో మాటేసిన నలుగురు దుండగులు ఒక్కసారిగా అతనిపై దాడి చేశారు. తాత నిశ్చేష్టుడై చూస్తుండగానే కత్తులతో అతి కిరాతకంగా పొడిచారు. క్షణాల్లో అక్కడినుంచి పరారయ్యారు. రక్తం మడుగులో కొట్టుమిట్టాడుతున్న నీరజ్‌ను పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రేమ వివాహం చేసుకున్న నీరజ్‌పై అతని భార్య కుటుంబ సభ్యులు కక్ష పెంచుకుని హత్య చేశారని నీరజ్ తండ్రి రాజేందర్ పన్వార్ ఆరోపించారు. ఇటీవల సరూర్‌నగర్‌లో జరిగిన పరువు హత్యను మరువక ముందే చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం సృష్టించింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. నీరజ్ తన ఇంటికి సమీపంలో నివసించే వేరే కులానికి చెందిన సంజనను ప్రేమించాడు. వీరి పెళ్లికి సంజన కుటుంబసభ్యులు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఏడాదిన్నర క్రితం వివాహం చేసుకున్న వీరు పాతబస్తీ శంషీర్‌గంజ్‌లో ఉంటున్నారు. వారికి మూడు నెలల బాబు కూడా ఉన్నాడు. కాగా శుక్రవారం రాత్రి తాత జగదీష్ పన్వార్‌తో కలిసి కైనెటిక్ హోండాపై వెళ్తున్న నీరజ్‌ను అటకాయించిన దుండగులు కత్తులతో పొడిచి హతమార్చారు. అతని శరీరంపై 15 నుంచి 20 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రద్దీగా ఉండే బేగంబజార్ రోడ్డుపై చోటు చేసుకున్న ఈ దారుణ హత్యోదంతంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. గోషామహాల్ ఏసీపీ సతీష్‌కుమార్, షాహినాయత్‌గంజ్ ఇన్స్పెక్టర్ అజయ్‌కుమార్‌ల నేతృత్వంలో పోలీసులు నీరజ్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సంజన కుటుంబీకులే దాడి చేశారు ప్రేమ వివాహం చేసుకున్నందుకే సంజన కుటుంబీకులు తన కుమారుడిపై దాడి చేసి దారుణంగా హత్య చేశారని నీరజ్ తండ్రి రాజేందర్ పన్వార్ రోదిస్తూ ఆరోపించారు. వారితో తన కుమారుడికి ప్రాణహాని ఉందని గతంలో అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపారు. ప్రేమ వివాహం చేసుకోవడంతో ఏడాదిన్నరగా కక్ష పెంచుకున్న వారు తన కొడుకును హత్య చేశారని ఆరోపించారు. తన కుమారుడని హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా నీరజ్‌ను హత్య చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని ఏసీపీ సతీష్‌కుమార్ తెలిపారు. మొత్తం నలుగురు వ్యక్తులు నీరజ్ పన్వార్‌ను అడ్డగించి కత్తులతో దాడి చేసినట్లు తెలిపారు. క్లూస్ టీం ఘటనా స్థలంలో వివరాలు సేకరించింది. -
ఏడేళ్ల బాలికపై మేనమామ లైంగికదాడి
సాక్షి, అబిడ్స్: ఏడేళ్ల మైనర్ బాలికపై మేనమామ (19) లైంగికదాడి చేసిన ఘటన బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పాతబస్తీకి చెందిన ఏడేళ్ల బాలిక పటేల్‌నగర్‌లోని తన అమ్మమ్మ ఇంటికి ఈనెల 18వ తేదీన వచ్చింది. ఆటో డ్రైవర్ అయిన మేనమామ(19) బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కూతురు దుస్తులు చిరిగినట్లు గమనించిన తల్లి..బాలికను ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లి బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇన్స్పెక్టర్ మధుమోహన్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
టీఆర్ఎస్ నేత వీరంగం: సీసీ టీవీలో దాడి దృశ్యాలు
సాక్షి, హైదరాబాద్: బేగంబజార్‌లో టీఆర్ఎస్ నేత శాంతిదేవి వీరంగం సృష్టించారు. మంగళవారం రాత్రి 8 గంటలకు షాప్‌లు మూసివేయాలని హంగామా చేశారు. ఫ్లై వుడ్ షాప్ మూసివేయాలంటూ షాప్ ఓనర్‌పై శాంతిదేవి దాడికి పాల్పడ్డారు. ప్రశ్నించిన షాప్ ఓనర్‌పై శాంతిదేవి అనుచరులు దాడి చేశారు. శాంతిదేవి అనుచరుల దాడి దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. దాడిపై షాపు ఓనర్... బేగం బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు, రేపు నోటిఫికేషన్ -
టీఆర్ఎస్ నేత వీరంగం: సీసీ టీవీలో దాడి దృశ్యాలు
-
సమయాన్ని తగ్గించిన బేగంబజార్ లోని దుకాణాలు
-
బేగంబజార్‌లో కరోనా కలకలం
సాక్షి, అబిడ్స్(హైదరాబాద్): బేగంబజార్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. బేగంబజార్‌లో 100 మందికిపైగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలోనే ప్రముఖ వ్యాపార కేంద్రమైన బేగంబజార్‌కు కరోనా ఎఫెక్ట్ పడింది. పలువురు వ్యాపారస్తులకు కరోనా రావడం, మార్కెట్లో విపరీతమైన రద్దీ ఉండడంతో బేగంబజార్‌లో ఈ నెల 9వ తేదీ నుంచి దుకాణాల వేళలను మార్చారు. శుక్రవారం నుంచి ఉదయం 9 గంటలకు దుకాణాలు తెరిచి సాయంత్రం 5 గంటల వరకే మూసివేస్తామని ది హైదరాబాద్ కిరాణా మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ రాఠి, ప్రధాన కార్యదర్శి మహేష్‌కుమార్ అగర్వాల్‌లు తెలిపారు. బేగంబజార్, ఛత్రి, ఫిష్ మార్కెట్, మిట్టికా షేర్ తదితర ప్రాంతాల్లోని హోల్‌సేల్ కిరాణ దుకాణాలన్నీ తమ అసోసియేషన్ నిబంధనలు పాటిస్తాయన్నారు. ప్రతి దుకాణం వద్ద కొనుగోలుదారులు, వ్యాపారస్తులు మాస్క్‌లు ధరించేలా, శానిటైజర్ వాడే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వారు వివరించారు. -
అసభ్య మెసేజ్‌లు పంపి పెళ్లి చెడగొట్టే యత్నం..
సాక్షి, సిటీబ్యూరో: వివాహం నిశ్చయమైన అమ్మాయికి, ఆమె కుటుంబ సభ్యులకు అసభ్యకరమైన మేసేజ్‌లు పంపుతూ పెళ్లి చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్న యువకుడిని సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బేగంబజార్‌కు చెందిన బాధితురాలికి ఇటీవల పెళ్లి కుదిరింది. అయితే ఆమెతో పాటు కుటుంబ సభ్యులకు ఇటీవల అసభ్యకరమైన మేసేజ్‌లు వస్తున్నాయి. దీనిపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు బేగంబజార్‌లో కిరాణ దుకాణం నిర్వహించే వివేక్‌గా గుర్తించారు. బుధవారం నిందితుడిని అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు, బాధితురాలికి బంధువని తేలింది. -
బీ అలెర్ట్.. జంతు కళేబరాలతో కల్తీ నూనె..
ఉరుకులు.. పరుగుల నగరజీవికి కాసింత విశ్రాంతి దొరికేది భోజనం దగ్గరే.. ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన కొందరు ఉద్యోగులు ఎప్పుడో రాత్రికి ఇంటికి చేరుకుంటారు. ఆకలి తీర్చుకునేందుకు టిఫిన్ సెంటర్లు, బిర్యానీ సెంటర్లు, చిరుతిళ్ల బండ్లను ఆశ్రయించాల్సిందే.. నోరూరించే బిర్యానీ.. వేడివేడి బజ్జీలు.. బాగా నూనె దట్టించిన దోశ.. ఇలా ఏది తిన్నా ఆరోగ్యానికి డ్యామేజీ అయినట్లే.. ఎవరు ఏ కల్తీ నూనె వాడుతున్నారో తెలియకపోవడంతో రోగాలు తప్పడం లేదు. కొన్నిచోట్ల జంతువుల వ్యర్థాలను మరిగించి తీసిన నూనెలతోనే ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. ఆ నూనే వివిధ బ్రాండ్ల పేరుతో ప్యాకింగ్ చేసి బేగంబజార్ కేంద్రంగా మార్కెట్లో విక్రయించి రూ.లక్షల్లో దండుకుంటున్నారు. – సాక్షి, సిటీబ్యూరో నగరంలోని కాటేదాన్ పారిశ్రామికవాడ, శాస్త్రిపురం, జలపల్లి, మల్లాపూర్, మైలార్‌దేవ్‌పల్లి, చాంద్రాయణగుట్ట, బాబానగర్, బండ్లగూడ, పహాడీషరీఫ్ తదితర ప్రాంతాలు పశువ్యర్థాలతో కల్తీ నూనె తయారీకి అడ్డాగా మారాయి. బ్రాండెడ్ ఆయిల్ కంపెనీల స్టిక్కర్లతో బేగంబజార్ కేంద్రంగా వాటిని హోల్‌సేల్‌గా విక్రయిస్తున్నారు. పశువుల వ్యర్థాలతో నూనె తీసే ప్రాంతాల్లోకి ప్రవేశించడం సామాన్యులేవరికీ సాధ్యం కాదు. కోటలను తలపించే ప్రహరీల మధ్య ఈ గోడాన్లు ఉంటాయి. అక్కడ పనిచేసే వారంతా బిహార్, యూపీ, అసోం, ఓడిశా రాష్ట్రాలకు చెందిన యువకులే.. కొత్తవారు కనిపిస్తే దాడులకు ఏమాత్రం వెనకాడరు. ఆహార శుద్ధి (ఫుడ్ ప్రాసెసింగ్) పరిశ్రమల ముసుగులోనూ పశువ్యర్థాలతో తీసిన నూనె కలిపి పేరొందిన బ్రాండ్లుగా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: నూనెల ధరలు పెరుగుదల పశువుల వ్యర్థాలతో.. పశువుల ఎముకలు, కొమ్ములు, మాంసం.. చనిపోయిన జంతువుల కళేబరాల నుంచి తీసిన కొవ్వుతో వంట నూనెలు తయారు చేస్తున్నారు. మూతపడిన కార్ఖానాల్లో భారీ ఇనుప గోళాలు, గిన్నెల్లో పశువుల ఎముకలు, కొవ్వును కరిగేదాకా మరగబెట్టి నూనె తీస్తున్నారు. దాన్ని డబ్బాలు, ప్యాకెట్లలో నింపి బ్రాండెడ్ లేబుళ్లను అంటించి జనంపైకి వదులుతున్నారు. కోట్ల రూపాయల విలువైన ఈ రోత పుట్టించే దందా సాగుతోంది మహానగర పరిధిలోనే.. ఏళ్లతరబడి ఖాళీగా పోస్టులు విశ్వ నగరం వైపు పరుగులు తీస్తూ కోటి మందికి పైగా జనాభా కలిగిన హెదరాబాద్ మహానగరంలో ఆహార భద్రతా విభాగం సిబ్బంది సంఖ్యను వేళ్లపై లెక్కించవచ్చు. జీహెచ్ఎంసీ ఆహార తనిఖీ విభాగానికి సర్కిల్ ఒకరి చొప్పున 30 పోస్టులు మంజురు కాగా, పని చేస్తోంది 20 మంది మాత్రమే. ఐదు గెజిటెడ్ పోస్టులకు గాను ఇద్దరే పనిచేస్తున్నారు. సర్కిల్ స్థాయిలో 10 పోస్టులు, గెజిటెడ్ స్థాయిలో మూడు పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. ఆహార భద్రత ప్రమాణాల ప్రకారం ప్రతి 50 వేల మంది జనాభాకు ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉండాలి. ఈ లెక్కన గ్రేటర్ హైదరాబాద్‌లో 200 మందికి తగ్గకుండా ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉండాలి. ఇటీవల కొన్ని ఘటనల్లో.. ఏడు నెలల క్రితం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్‌లోని ఒక ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో జంతు కళేబరాలతో కల్తీ నూనె తయారీ బండారం బయటపడింది. అక్టోబర్‌లో శంషాబాద్ జోన్ ఎస్ఓటీ పోలీసులు మైలాదేవులపల్లి పరిధిలోని అలీనగర్‌లో జంతు కళేబరాలతో కల్తీ నూనె తయారు చేస్తున్న మూడు కేంద్రాలపై దాడులు చేసి సీజ్ చేశారు. నగర శివార్లలోని జల్పల్లి సమీపంలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో పెద్ద పెద్ద కడాయిలు ఏర్పాటు చేసి జంతు కళేబరాలను ఉడికిస్తుండగా ఎస్వోటీ పోలీసులు దాడి చేసి 160 డమ్ముల నూనె సీజ్ చేశారు. జల్పల్లి నుంచి పహాడీషరిఫ్‌కు వెళ్లే దారిలో కల్తీ నూనె దందా జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెరుగుతున్న కేన్సర్ కేసులు గ్రేటర్లో ఏటేటా కేన్సర్ కేసులు పెరుగుతున్నట్లు వైద్యారోగ్యశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం 12వేలకు పైగా కేసులు నమోదవుతుండగా, అందులో అత్యధిక కేసులు కల్తీ ఆయిల్ వల్లే వెలుగు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకసారి వాడిన ఆయిల్‌ను మళ్లీ వినియోగించడంతో రోగాలు పెరుగుతున్నాయి. కల్తీ నూనెతో రక్తంలో రక్తపోటు, మధుమేహంతో పాటు రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. కల్తీ నూనె కాలేయం, కిడ్నీ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందులోని హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ కేన్సర్‌కు కారణమవుతుంది. ఆ నునె వాసన పీల్చినా ప్రమాదమే.. ఫిర్యాదులు అందితేనే.. ఈ విషపూరిత నూనెను అరికట్టేందుకు అధికార యంత్రాంగం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫిర్యాదు అందితే దాడిచేసి సీజ్ చేయడం.. తర్వాత ఫిర్యాదు అందే వరకు సంబంధం లేదనే విధంగా సంబంధిత అధికారులు వ్యవహరించడం విస్మయానికి గురిచేస్తోంది. నెలవారి మామూళ్ల మత్తులో జోగుతున్న సర్కారీ శాఖల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలమీదకు తెస్తోంది. ఫిర్యాదులు అందినప్పుడు నగర స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు, జీహెచ్ఎంసీ హెల్త్ విభాగం, పౌర సరఫరాల శాఖ, వైద్యారోగ్య శాఖ ఫుడ్ ఇన్స్పెక్టర్లు కల్తీ మాఫియాపై మొక్కుబడిగా దాడులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. శుద్ధి చేసిన నూనెను మరిగిస్తే పొంగు రాదు. రంగు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది. జంతువుల కళేబరాలతో చేసిన నూనె పొంగుతో పాటు దుర్వాసన వస్తుంది. – డాక్టర్ ఆర్వీ రాఘవేందర్రావు, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ -
హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం..
సాక్షి, హైదరాబాద్: బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. సిద్దింబెర్ బజార్‌లోని రాజధాని మోటార్స్ గోడౌన్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. సంఘటనా స్థలానికి నాలుగు ఫైరింజన్లు చేరుకున్నాయి. మంటలను ఫైర్ సిబ్బంది, బేగంపేట బజార్ పోలీసులు అదుపులోకి తీసుకువస్తున్నారు.షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
గ్రేటర్లో కరోనా విజృంభణ: కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ కిరాణ మర్చంట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. వారం రోజుల పాటు బేగంబజార్‌లోని కిరాణా దుకాణాలు మూసివేయనున్నారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 5 వరకు బేగంబజార్‌లో దుకాణాలు మూసివేయనున్నట్లు కిరాణా మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్న విషయాన్ని చిరు వ్యాపారులు, ప్రజలు గమనించగలరని ఆయన విజ్ఞప్తి చేశారు. (చైనా ఉత్పత్తులకు తగ్గని ఆదరణ) కాగా, రాష్ట్రంలో కరోనా కేసులు పదివేలు దాటేశాయి. నిన్న ఒక్కరోజే 891 మందికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో కేసుల సంఖ్య 10,444కి చేరింది. ఇందులో 5,858 మంది వివిధ ఆస్పత్రులు, హోం ఐసోలేషన్లలో చికిత్స పొందుతుండగా.. 4,361 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరో ఐదుగురు మరణించడంతో ఇప్పటివరకు కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 225కి పెరిగింది. (ఇక నుంచి ఇవి ప్లాట్‌ఫాంపై అమ్మబడును) -
బేగంబజార్: చిరుదుకాణాలపై విజిలెన్స్ అధికారుల దాడులు
-
రాజసింగ్ ఎంట్రీతో వెనక్కితగ్గిన జీహెచ్ఎంసీ అధికారులు
సాక్షి, హైదరాబాద్: ప్లాస్టిక్ బ్యాన్ అవసరమేనని కాని చిన్న వ్యాపారులను టార్గెట్ చేయడం సరికాదని జీహెచ్ఎంసీ అధికారులకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. ప్రభుత్వానికి, అధికారులకు చిత్త శుద్ధి ఉంటే ప్లాస్టిక్ ఉత్పత్తిని, పంపిణీ దారులను నియంత్రించాలన్నారు. శుక్రవారం బేగంబజార్‌లో 50 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్ కవర్లను అమ్ముతున్న షాపులపై జీహెచ్ఎంసీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడిచేశారు. నిబంధనలకు విరుద్దంగా ప్లాస్టిక్ కవర్లు అమ్ముతున్న ఐదు షాపులను అధికారులు సీజ్ చేశారు. షాపులపై అధికారుల దాడులను నిరసిస్తూ వ్యాపారస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు చేపట్టారు. బేగంబజార్ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం తెలుసుకున్న రాజాసింగ్ షాపులపై దాడులు చేస్తున్న అధికారులను అడ్డుకున్నారు. షాప్ యజమానులను భయబ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. మరోసారి ఇలాంటి దాడులను చేయవద్దని అధికారులను కోరారు. రాజాసింగ్ ఎంట్రీతో అధికార బృందాలు వెనుదిరిగాయి. -
డ్రైఫ్రూట్స్.. విక్రయాలు ఫుల్..
అబిడ్స్ : రంజాన్ సందడి బేగంబజార్‌లో జోరుగా కొనసాగుతోంది. పాతబస్తీ బేగంబజార్‌లో హోల్‌సేల్ వ్యాపారస్తులు పెద్దఎత్తున డ్రై ఫ్రూట్స్ విక్రయాలు చేస్తున్నారు. రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండే ముస్లింలు ఉపవాసం అనంతరం ఖర్జూరాలతో పాటు డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు. దీంతో పాతబస్తీతో పాటు నగరంలోని పలు ప్రాంతాల వాసులు పెద్దఎత్తున బేగంబజార్‌లో ఖర్జూరంతో పాటు డ్రైఫ్రూట్స్ విక్రయాలు చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే డ్రై ఫ్రూట్స్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలాసా నుంచి వచ్చే ఖాజూలను పెద్దఎత్తున విక్రయిస్తున్నారు. రంజాన్ మాసం సగం అయినా విక్రయాలు పుంజుకున్నాయి. బేగంబజార్ పరిసర ప్రాంతాల్లో హోల్‌సెల్ ధరలకే విక్రయిస్తుండటంతో నగరం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి... విదేశాల నుంచి నగరానికి డ్రై ఫ్రూట్స్ దిగుమతి అవుతున్నాయి. ఇరాన్ దేశం నుంచి ఖర్జూరాలు, అమెరికా నుంచి బాదం, పలు అరబ్ దేశాల నుంచి పిస్తా, వాల్నట్స్, అంజూర్, ఎండు ద్రాక్ష, కుర్బానిలాంటి డ్రై ఫ్రూట్స్ న్యూ ఢిల్లీ నుంచి నగరానికి దిగుమతి అవుతున్నాయి. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకువస్తున్నారు. కాజు మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోని పలాసా నుంచి దిగుమతి అవుతోంది. డ్రై ఫ్రూట్స్ ధరలు ఇవే... బేగంబజార్ హోల్‌సెల్ మార్కెట్లో డ్రైఫ్రూట్స్ ధరలు కిలో చొప్పున ఇలా ఉన్నాయి. ఖాజు కిలో రూ.780 నుంచి రూ.1200 వరకు, ఆలమోండ్స్ కిలో రూ.700 నుంచి రూ.2,800ల వరకు, పిస్తా కిలో రూ.వెయ్యి నుంచి రూ.1,800ల వరకు, ఖర్జూరా కిలో రూ.180 నుంచి రూ.1,600ల వరకు విక్రయాలు చేస్తున్నారు. రెండు సంవత్సరాల నుంచి ఖాజు, బాదం ధరలు కిలోకు 10 నుంచి 20 శాతం పెరిగాయి. హోల్‌సెల్ ధరలకే రిటైల్ అమ్మకాలు డ్రైఫ్రూట్స్‌ను హోల్‌సెల్ ధరలకే రిటైల్‌గా విక్రయిస్తున్నాం. రంజాన్‌తో పాటు దసరా, దీపావళి, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డ్రైఫ్రూట్స్ విక్రయాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. రంజాన్ మాసం కావడంతో ఖర్జూలతో పాటు డ్రైఫ్రూట్స్ విక్రయాలు రెండింతలు పెరిగాయి. 1967లో హోల్‌సెల్ డ్రైఫ్రూట్ షాపును ప్రారంభించిన తాము రిటైల్ వారికి కూడా ఎలాంటి వ్యత్యాసం లేకుండా హోల్‌సేల్ ధరలకే విక్రయిస్తున్నాం. డ్రైఫ్రూట్స్‌తో మనిషి ఆరోగ్యకరంగా ఉంటాడు. ఎన్నో పోషకాలు కూడా లభిస్తాయి. ఈ మధ్య కాలంలో డ్రైఫ్రూట్స్ విక్రయాలు చాలా పెరిగాయి. – రాహుల్ సాంక్ల, శ్రీకిషన్ సత్యనారాయణ సాంక్ల డ్రైఫ్రూట్స్ దుకాణం యజమాని -
కలర్స్ ఆఫ్ లైఫ్